Showing posts with label Siluvalo Neevu Kaarchina Raktham lyrics. Show all posts
Showing posts with label Siluvalo Neevu Kaarchina Raktham lyrics. Show all posts

29 May 2021

Siluvalo Neevu Kaarchina Raktham | సిలువలో నీవు కార్చిన రక్తం పాపము

సిలువలో నీవు కార్చిన రక్తం పాపము తొలగించును
 కలుషము కడిగి పరిశుద్ధపరచి జీవము కలిగించును(2)
 అ.ప: యేసూ నీ రక్తమే పాపికి శరణము (2)
          యేసూ నీ రక్తమే శాప హరణము (2)

1.సిలువలో నీవు కార్చిన రక్తం - రోగము తొలగించును (2)
చీకటి శక్తుల దూరము చేసి స్వస్థత కలిగించును (2) ||యేసూ||

2.సిలువలో నీవు కార్చిన రక్తం - వేదన తొలగించును (2)
అపాయములనుండి తప్పించి నెమ్మది కలిగించును (2) ||యేసూ||

3.సిలువలో నీవు కార్చిన రక్తం - నిరాశను తొలగించును (2)
కన్నీరు తుడిచి ఆనందం పుట్టించి నిరీక్షణ కలిగించును (2) ||యేసూ||

4.సిలువలో నీవు కార్చిన రక్తం - భయము తొలగించును (2)
అపవాది అనుచరుల అణగదొక్కి జయము కలిగించును (2) ||యేసూ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...