Showing posts with label రావూరి రంగయ్య. Show all posts
Showing posts with label రావూరి రంగయ్య. Show all posts

10 June 2022

Parama rakshaka yesu prabhuva | పరమ రక్షక యేసు ప్రభువా

168 
క్రీస్తు పాపికి ఆశ్రయము
(ఛాయ: ఉన్నపాటున)
రా - అసావేరి, తా - త్రిపుట

   పరమ రక్షక యేసు - ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే = ధరజనంబులుసేయు బహువిధ - దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపఁజేసెడి - దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||

1.క్షితి ¹నబ్ధి తీర ²పై కతయైన నెన్ననా - ³యితియౌను లెక్కింపఁగా = ⁴కుతల జన్మంబెత్తియేనిట - బ్రతుకు దినముల - జేయునఘములు - మతి దలపనిమితా ⁵యుతంబులు - పతితు డనునాగతి యెరుంగను ||పరమరక్షక||

2.⁶పసలేని మాయా దు - ర్వ్యసనంబులను జెంది - దెసదప్పి యున్నాఁడను = వసుధలో దుష్టునికి లోఁబడి - మసలజాలని బలహీనత - ⁷గసటు కన్నులగప్పి కడు మా - నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||

3.మదితప్పి గొఱ్ఱెల - మంద బాసినగొఱ్ఱె - చెదరి చలించినట్లు = వదలకెపుడు దురాత్మలైరి స - ముదయమునఁ బడితిరిగి వడిచెడి - మదికి విశ్రమమేమి లేమిని - హృదయ సంతాపముల సుడిఁబడి ||పరమరక్షక||

4.⁸మదపున్నాగము భంగి - మత్తిల్లి దుర్భావ - హృదయుఁడనై చెడితిని = గొదగొనుచు గాయములతో నా - యెద దృఢంబించుకయు లేమినిఁ - గదల శక్యము గాక మూల్గుచు - గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||

5.అమిత దురాత్ముఁడ - నని కడఁ ద్రోయక - క్షమియింపు మీ కరుణచే = తమిని మిక్కిలి దుర్విషయగుణ - సముదంబులు జుట్టి పాపపు - తమము గప్పియు గలుషకానన - సమితిలోఁబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||
                              – రావూరి రంగయ్య
----------------------------------
¹సముద్రము. ²ఇసుక. ³సాధ్యమాను. ⁴భూమి. ⁵పదివేలు. ⁶కాంతి. ⁷మాలిన్యము. ⁸ఏనుగు.

24 March 2022

Endhuboyedhavo ha prabhu | ఎందుఁబోయెదవో హా ప్రభురాయ

203  
సిలువమోయు యేసు
రా - ముఖారి 
(ఛాయ: కలుగును గాక) 
తా- చాఫ్

ఎందుఁబోయెదవో - హా ప్రభురాయ ఎందుఁబోయెదవో = ఎందుఁ బోయెదవయ్య - యీ దుర్మానవశ్రేణి - బొందఁదగిన భరంబుఁ బూని రక్షక నీవు ||ఎందు||

1.వడగాలిలోను - నీ నెమ్మోము - వాడికందఁగను - నొడలఁ జెమటయు నీరు - నొడిసివర దయై పార - నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు నీవు ||ఎందు||

2.మూఁపుపై సిలువ శత్రు స - మూహముల్ నడువఁ - కాపు ప్రచండమౌ కారెండ కాయఁగ - నేపున నా పాప - మీ పాటు పెట్టఁగ ||ఎందు||

3.విరువు గట్టివియో - జనుల రక్షించు - బిరుదలయ్యవియో = పరమ రక్షకుండా నా - పాపబంధము లవియో - పరిశోదించెడి వారి - పట్టుకొమ్మలవియో ||ఎందు||

4.ఆకాశమందు - దూతలు కొల్వ - నతితేజ మొందు - ప్రాకటమైన నీ సదముల్ పగులురాల - తాఁకునఁబగిలి ర క్త - ధారలొల్కఁగను ||నెందు||

5.పరమందుఁగల్గు - పరిమళముచేఁ - బసమించి వెల్గు =  చిరమౌ దేహమునకు నా - యెరుష లేమను నట్టి -  పురములోపలి మన్ను - పూత మయ్యెనా ప్రభువా ||ఎందు||

6.ఒక పాలివెతలా - రవ్వంతైన - సుకరమౌ స్థితులా = యకటా చెదరి గుండె - లదరి ఝుల్ ఝుల్ మని - యొకటిఁ బొందక తాప - మొంది కుందునే కర్త ||ఎందు||
                                – రావూరి రంగయ్య

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...