Showing posts with label పి. రవివర్మ. Show all posts
Showing posts with label పి. రవివర్మ. Show all posts

02 May 2022

Rarajagu yesuni naamam | రారాజగు యేసునినామం

143 
రారాజగు యేసుని
రా - బెహాగ, తా - ఆది

రారాజగు యేసునినామం - రమ్యంబగు దేవుని నామం ఈశుండగు యేసునినామం - ఈధర నిదె పావననామం యేసునినామం - దేవునినామం - రమ్యంబగు దేవుని నామం ||రారాజు||

1.గగనము వీడిన గురునామం - కలుషాత్మల బ్రోచెడు నామం ||రారాజు||

2.స్లీవాంకముగల యినామం - సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజు||

3.విజయం బొపగెడు నిజనామం - విమలాత్ముల కిదివర నామం ||రారాజు||

4.మనమున కిది యజ్జ్వలనామం - జనముల కిదియే ఋజు నామం ||రారాజు||

5.ఈధరస్తుతులను గొనునామం - ఈ యేసుని యమృత నామం ||రారాజు|| 
                             – పి. రవివర్మ

30 April 2022

Yese bhagavannamam | యేసే భగవన్నామం భజింపను

139
యేసు నామ స్మరణ
రా - అసావెరీ,  తా - ఆది
(ఛాయ: భజో మధుర)

యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర ||మేసే||

1.యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే||

2.యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే||

3.యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే||

4.యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే||

5.యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే||
                     – పి. రవివర్మ

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...