Showing posts with label 257 శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు. Show all posts
Showing posts with label 257 శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు. Show all posts

01 June 2026

శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు Sri vinoda dayakambu

257
దేవుని వాక్యం 
రా - కాపి,  తా - ఏక 

శ్రీ వినోద దాయకంబు - దేవుని వాక్యంబు - జీవమునకు నాస్పదంబు - చిరమగు ధనంబు = భావంబుల మార్చు నంబు - బహుళ సాధనంబు ||శ్రీ||

1.పాప తతికి నాయుధంబు - పాపి కాశ్రయంబు - భూపతులకు దుస్తరంబు -పుణ్య సాధనంబు = శాప మడంచెడు శరంబు - జగతికి విభవంబు ||శ్రీ||

2.స్వాతంత్ర్య మిడు దనంబు - సర్వశ్రేయంబు - ఘాతకులకు ఖడ్గంబు - నీతికినిలయంబు - ప్రీతిని గరపెడు విధంబు - ఖ్యాతికిఁ బథంబు ||శ్రీ||

3.సత్య విరాజితంబు - నిత్య శోభితంబు - భృత్య వరుల సంచకరము - భీతున కభయంబు = చేతో విభవంబు సుగుణ - శిష్యుల హారంబు ||శ్రీ||

4.కర్తఁ జూపు నద్దంబు - ఘనమహాద్భుతంబు - దురితతతికి నస్త్రంబు - దు ఖశోషణంబు = పరమోపదేశంబు - బహుళమానితంబు ||శ్రీ||

5.సర్వజనులకును హితంబు - సౌఖ్యసాధనంబు - శాంతికి నిజమార్గంబు - జగడముల హరంబు = జగము నంతకును వరంబు - సత్యవిజయంబు ||శ్రీ||

6.కోలాహల కారణంబు - చాల ప్రాచీనంబు-మూలమౌ ధనంబు జగము - నేలెడి తంత్రంబు = జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు ||శ్రీ||

7.జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు - దాని బోధనంబు - దీనజనుల కర్థంబు - దివ్య శోభితంబు = l మానితభక్తిని దినంబు - మానని పఠనంబు ||శ్రీ||
- గున్నాబత్తుల సమూయేలు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...