Showing posts with label A. Show all posts
Showing posts with label A. Show all posts

01 June 2026

ఆచరించుచునున్నాము ఆ చందము Aacharinchuchunnamu aa chandamu

274
పెద్దల బాప్తిస్మము
రా - నవరోజు, తా - అట 

ఆచరించుచునున్నాము - ఆ చందము మేము = యే చందమేసు ప్రభు సెల - విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||

1.నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ - నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ - వాసికెక్కగా గాఁజేయుటకు వ్యాపించిరి కోరి = యోసియ్యోను రాజశాశ్వత - శ్రీసనాధ శ్రితరక్షభాజ - నీ సుదయచే నీ యుద్యోగము - నిత్యంబును బొంది ||యాచరించు||

2.భాసురత్వత్సమా చార - వాక్యము విని సదావి -  శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ = భాసమాన పతితపా - వనతాంకిత పాత్ర దరికు - ల్లాసము నెమ్మోములందు - రాజిల్లగం దెచ్చి ||యాచరించు||

3.పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష - పారావతమా - వీరి - నిత్తరి - నరుదౌ నీదైవత్వచి - హ్నముతోడను గూడ = సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు - బరిని వ్యాపించియుండుటకు - ప్రార్థించుచు నిన్ను ||యాచరించు||

4.పరయానంద వదనము నీ - దరికరాఁగిగోరు వీరి న్నీ - పరమ కృపన్ దీవించి నీ - కరుణా కటాక్షేక్షన్ = స్థిరతఁ బాంచియాత్మలకు - నీ మహిమ కిరణములు - నెరపు మో అభువాయని - నిన్ను వేడుచు ||నాచరించు||
- విలియం డాకన్ 

31 May 2026

అడుగుచున్నా మో దేవ కడు దయను Aduguchunnamo deva kadu dayanu

269
బోధకుల కొరకైన ప్రార్థన 
రా - శంకరాభరణం, తా - ఆది 

అడుగుచున్నా మో దేవ - కడు దయను గావఁ = జెడుగుల మైన మేము ని - న్నడుగుటకు నే బిడియ మొందము - అడుగుఁడి మీ కిడియెద నంచు - నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||

1.వేడు కలరఁగఁ గూడి నిను గొని - యాడి యడిగెడు నీదు భక్తులఁ = గోడు గని దయతోడ నెప్పుడు - వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||

2.సారె సారెకు నిన్ను విడిచి - ఘోర దురితపు భారమందుఁ = జేరి నిను మఱచితిమి గద మా - క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||

3.దుష్టుడు మాతోడఁ బోరఁగ - శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత = కష్ట మనక వాని గెల్వఁ - బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||

4.తోర మగు విశ్వాస నిరీక్షణ - కూరిమి విమలాత్మ వరములు = వారక హృదయాంతరంబులఁ - జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||

5.మోద మొప్పఁగ నీదు వాక్యము - మేదినిపై బోధపరచెడు - బోధ కులపై శోధనంబులు - పొర్లి రాకుండాదరింప ||నడుగు||

6.దురితముల చే భరితు లయ్యెడు - నరులపై నీ కరుణఁ జూపి = గురుతరంబగు మారు పుట్టుక - వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||

7.రోగములచే సేగి నొందుచు - జాగు సేయక నినుఁ దలఁచుచు = బాగు గోరుచు నున్న భక్తుల - రోగములు వెడలించు మని ని ||న్నడుగు||

8.ధరణిపైని మరణ మయ్యెడు - తరుణమందో కరుణా కలితా = పరమ పురమునందుఁజేరి - వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||
- విలియం బెర్రీ 

16 May 2025

Aaradhana yesu neeke ఆరాధన యేసు నీకే



ఆరాధన యేసు నీకే - ఆరాధన యేసు నీకే (2)
నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నే నడిచెద (2)
నీ వాక్యములొ నే నిలిచెద - నిను వెంబడించెద (2)||ఆరాధన||

1. గాలి నీరు అగ్నియు - నీ అద్భుత మాటకు   
లోబడుచునే ఉన్నవి - అన్నీ వేళలా (3)
ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే (2)

నీ చిత్తమునే చేసేద – నీ మార్గములోనే నడిచెద
నీ చిత్తమునే చేసాడా – నీ మార్గములో నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద || ఆరాధన యేసు నీకే||
నీ సన్నిధిలో నే నిలిచెడా – నిన్ను వెంబదించేదా || ఆరాధన యేసు నీకే ||

2. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్   
చూచు చూనే నడచెద - అన్నీ వేళలా (3)
ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...