Showing posts with label మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభూ. Show all posts
Showing posts with label మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభూ. Show all posts

12 July 2021

Mahima neeke prabhu ghanatha neeke మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభూ

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభూ 
స్తుతి మహిమ ఘనతయూ ప్రభావము నీకే ప్రభూ

సమీపింపరాని తేజస్సునందు - వసియించు అమరుండవే 
శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ సర్వము నా కిచ్చితివే (2)
ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే (2)

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలిచి వెలిగించితివే 
నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే (2) 

రాజులైన యాజక సమూహమున - ఏర్పరచబడిన వంశమై 
పరిశుద్ధ జనమై సొతైన ప్రజగా నన్ను చేసితివే (2)
                          - అంశుమతి మేరీ గారు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...