Showing posts with label Maha Ghana Tejomurthi lyrics. Show all posts
Showing posts with label Maha Ghana Tejomurthi lyrics. Show all posts

15 March 2021

Maha Ghana Tejomurthi | మహా ఘన తేజోమూర్తి

మహా ఘన తేజోమూర్తి 
మహా మహిమ దివ్యలోక చక్రవర్తి 
మాపాప విమోచనముకై క్రీస్తును ఇచ్చిన ప్రేమమూర్తి(2)
మా ఆదర్శ మూర్తివి నీవే మా అందరికి స్ఫూర్తివి నీవే 
మా జీవితా కీర్తివి నీవే మా అందరికి ముక్తివి నీవే 
                                                ||మహా||
1. నీ విచ్చినా మా శరీరాకృతి నీ దయయే మా ప్రగతీ 
నీ మేలులే మా వివాహస్థితి నీ బహుమానమే మా సంతతీ
నీ సంకల్పమే ఈ సర్వజగతి నీదివ్య జ్ఞానమే ఈ సర్వ ప్రకృతి 
నీ మాటే మా జాగృతి నీ సంఘమే మా సర్వోన్నతి

అ:ప: మా తండ్రీ నీమేలులకై అందుకో మా సంస్తుతి 
క్రీస్తేసుని పోలి నెరవేర్చదము నీ నీతి 
మా తండ్రీ నీమేలులకై అందుకో మా సంస్తుతి 
క్రీస్తేసుని పోలి అవుదును నేను ఆహుతి
                                                 ||మహా||
2. నీ విచ్చినా ఈ ప్రాణభుక్తి నీ దయయే మా సర్వశక్తి 
నీ చలువే మా యావదాస్తీ నీ కృపయే మా కీర్తీ 
నీ ప్రేమే మా అందరిస్థితీ... నీ కరుణే మా సంతృప్తి..
నీ ఆత్మే మాకు ముక్తి.. నీ ఆత్మే మాకు అధిపతి

మా తండ్రీ నీమేలులకై అందుకో మా సంస్తుతి 
క్రీస్తేసునిపోలి నెరవేర్చెదము నీ నీతి 
మా తండ్రి నీమేలులకై అందుకో మా సంస్తుతి 
క్రీస్తేసుని పోలి అవుదును నేను ఆహుతి
                                                  ||మహా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...