Showing posts with label చ. Show all posts
Showing posts with label చ. Show all posts

01 June 2026

చేరి భుజియింపుడీవిందు యేసు Cheri bhujimpudivindhu yesu

280
ప్రభురాత్రి సంస్కారవిందు 
(చాయ: సోదరులారా గనుడీ యాశ్చర్యం)
రా - కేదార, తా - అట 

చేరి భుజియింపుడీవిందు - యేసు - సిద్ధపరచిన కృపావిందు = తోరణంబగు మేడ గదిలో - జేరి శిష్యుల తోడ సిలువ = భారమున్ మదినెంచి నెరపిన - భావ గర్భితమైన విందు ||చేరి||

1.జీవాహారము దైవసుతుడే - పరమ - జీవజలముల దాత యితడే = జీవనాధుని రక్త మేనులు - జీవానాహారములు కాగా - చావును దొల గించి మృతులస - జీవులనుగా మార్చువిందు ||చేరి||

2.కారుణ్యనిధి యేసు రాజు - నరుల - గావగ బలియైన రోజు = భారమైన సిలువ కెరయై - పాప భారము పరిహరింప = ధారవోసిన పుణ్యరక్తపు - ధారలన్ దలపోయు విందు ||చేరి||

3.దాసగణముల బ్రోవనెంచి - రుధిర - ధారలను గార్చిభరించి = భాసు రంబగు నవ నిబంధన - జేసి సంఘ పునాది వేసి = వాసి మీరగ నిత్య జీవము - బోసినట్టి యేసు విందు ||చేరి||

4.పాప పరిహారార్థముకై - క్రీస్తు - పడిన ఘోరబాధ కొరకై = యేపు దనరగ స్తుతులుబాడుచు - యేసునాధుని రాకవరకు = ఆపకుండగ సత్ప్రసాదము - నందుకొని బలమొంద రండి ||చేరి||

5.విందుతో మొదలిడిన సేవ - యేసు - విందుతో ముగియించె బ్రోవ = విందులోగల మర్మమేదియొ - విపులముగ బోధించు క్రీస్తున్ = డెందమున ధ్యానించి యాయన - యందె నమ్మిక గలిగియుందము ||చేరి||
- వి. డి. జాన్ సుందరరావు 

16 March 2025

Chudare kreeshuni judare చూడరే క్రీస్తుని జూడరే



చూడరే క్రీస్తుని జూడరే - నా సఖులార - చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి - తేఁడు యేదశఁ గూడినాఁడో ॥చూడరే॥

1. మించి పొంతి పిలాతు సత్య మొ - కించుకైనఁ దలంప కక్కట - వంచనను గొట్టించి యూదుల -మంచితనమే కోరి యప్ప -గించెనా -మేలు గ ణించెనా = ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స - హించిరో పరికించి మీరిది ॥చూడరే॥ -

2. మంటికిని నాకాశమునకును -మధ్యమున వ్రేలాడుచుండఁగ -నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని - కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది --మది నెంచెనా = హా నా - కంట నే నిటువంటి యాపదం-గంటిఁ - బ్రాణము లుండునే యిఁకఁ ॥జూడరే॥ -గంటిఁ -

3. ఊటగా రక్తంబు కారుచు - నుండ బల్లెపుఁ బ్రక్కపోటు - మాటిమాటికిఁ జూడ దుఃఖము - మరలునే తలమీఁద ముళ్లకి - రీటమా యితనికి -వాటమా = యూదులు - మోటులై బాహాటమున నీ - పాటులను గాటముగఁ --జేసిరి ॥చూడరే॥ 
- పురుషోత్తమ చౌధరి

11 December 2022

Chinnadaina urilona | చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు


చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు (2)
దివ్యమైన లోకమందు వాసముండువాడు
దీనులైన వారి మధ్య ఉండగోరినాడు 
రాజ్యాలన్నింటిలో సంబరాలు నేడు
పూజ్యనీయునికి కీర్తనాలుపాడు (2)

నీడలేక గూడులేక సాయమొవచ్చు జడలేక
కృంగియున్నవారికింక తోడు (2)
నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు (2)
సత్యమును జీవమును తానైయున్నాడు. ||రాజ్యాలన్నిటిలో||

బుద్దిలేక శుద్దిలేక దిద్దుబాటు చేతకాక
కూలబడ్డవారికింక తోడు (2)
కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు (2)
కొండయును కోటయును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక
బెంగపడ్డవారికింక తోడు. (2)
వేడుకున్నవారికి ఆయనే భారందించగలిగినోడు. (2)
మార్గమును ద్వారామును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

20 March 2022

Chediyalu gumpugudiri | చేడియలు గుంపుగూడిరి

200    స్త్రీలు సిలువచెంత ధ్యానించుట
రా - సారంగ (చాయ:వచ్చి గాబ్రియేలు) తా - త్రిపుట

చేడియలు గుంపుగూడిరి - క్రీస్తు - జాడఁ గని ¹తాల్మి నీడిరి = ²ఆడికలనోర్చి నేఁడు మన పాఁలి - వాఁడుసిలువ ను - న్నాడు గదె యంచు ||చేడియలు||

1.వారి మొగములు వాడెను - యేసు - వారి వెత లెల్ల జూడను = ³నీరు ⁴దృక్సర - సీరుహములందు - జార తమ కొన - గోరులను ⁵మీటి ||చేడియలు||

2.రొమ్ములను జేతు లుంచుచు ⁶చింత - గ్రమ్మి ⁷నిట్టూర్పు లిచ్చుచు = ⁸కొమ్మలట ⁹నిల్పు - బొమ్మలన ¹⁰చేష్ట - లిమ్ముచెడి ¹¹యబ్బు - రమ్ముతో నిల్చి ||చేడియలు||
____________________________
¹ఓర్పు. ²నిందలు. ³కన్నీళ్లు.  ⁴కమలములవంటి కన్నులనుండి. ⁵చిమ్మి. ⁶దుఃఖముచేత నిండుకొని. ⁷ఉస్సురనుచు.. ⁸స్త్రీలు. ⁹నిలువబెట్టిన. ¹⁰బొమ్మలవలె కదలమెదలక.  ¹¹ఆశ్చర్యముతో.

02 January 2022

Chakkanaina Daari Neeve | చక్కనైన దారి నీవే చేరువైన

చక్కనైన దారి నీవే - చేరువైన తోడు నీవే (2)
యేసయ్యా నీవే చాలయ్యా 
నా బ్రతుకునందు ఎన్నడూ వీడిపోకయ్యా (2) 

1. చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా (2) 
యేసయ్యా ఆశ్రయం నీవైనావయ్యా 
యేసయ్యా భుజంపై చెయ్యేసావయ్యా 
నీ ప్రేమనెవరు ఆపలేరయ్యా 
ఎంత ఉపకార బుద్ధి నీదయ్యా (2) || చక్కనైన ||

2. అడిగినదానికన్నా అధికం చేసావయ్యా 
నీ స్థానం ఎవ్వరికి చెందనీనయ్యా (2) 
యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు 
యేసయ్యా అందని వాడవు కావు 
సమీపమైన బంధువువి నీవు 
నీ ఆత్మతో దీవించుచున్నావు (2) || చక్కనైన ||

25 December 2021

Chali Raathiri Eduru Choose | చలి రాతిరి ఎదురు చూసే

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2)

పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||

చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||

DOWNLOAD MP3 SONG HERE 👇

Chudare maredu putti nadu | చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు

120               రక్షకుని రాక
రా - యదుకుల కాంభోజి             తా - ఆది

చూడరే మాఱేఁడు పుట్టి - నాఁడు బెత్లెహేములో = నేఁడీ భూమి వాసులకు - నిండు రక్షణబ్బెను ||చూడరే||

1. ఎన్నరాని దేవ దీప్తి - మున్ను మిన్ను గ్రమ్మెను =  పన్నుగా రేయెండ కాంతి - కన్ననది మించెను ||చూడరే||

2. దూత తెల్పె వ్రేల కొక - ప్రీతియగు ముచ్చటన్ =  ఖ్యాతిగ దావీదు పురిని - కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||

3. తూరుపున జ్ఞానులొక్క - తార దివిని గాంచిరి = వారు వీరు వచ్చి సేవ - వరుసగాను జేసిరి ||చూడరే||

4. మక్కువతో మనమెల్ల - మ్రొక్కి సేవఁ జేతుము =  మిక్కుటముగ మనకు శాంతిఁ - గ్రక్కున నొసంగును ||చూడరే||
                            - జాన్ చౌదరి

15 December 2021

Chukka chakkanidi oranna | చుక్కా చక్కానిది ఓరన్న


చుక్కా చక్కానిది ఓరన్న (2) 
క్రీస్తు రాజు జననం చూపెనన్న (2) 
ఇమ్మనుయేలుగా నీకు నాకు తోడుగా 
భువినేలే రారాజు వచ్చినాడమ్మ (2) 
కనుల విందుగా సందడి చెద్దామా 
ఉత్సాహంతో ఊరంతా సంబరమే చేద్దామా 
Happy happy happy happy Christmas 
Merry merry merry merry Christmas 

జగములనేలే ఆ రాజు యేసు 
బెత్లహెమందు జన్మించెను 
ఆ కన్య గర్భాన రక్షకుడు మన కొరకు 
పశువుల పాకలో ఉదయించెను 
సర్వోన్నత మైన స్తలములలోన 
సర్వజనులకు సమాధానమని 
స్తోత్రగానం చేసియున్నారు 
సంతోషంతో సువార్తమానం సృష్టికి చాటారు ||Happy||

దూత తెల్పిన ఆ గొప్పశుభవార్త 
గొఱ్ఱెల కాపరులు ప్రకటించెను 
తూర్పు జ్ఞానులు ఆ తార మార్గాన 
బాలయేసును వీక్షించెను 
బంగారమును సాంబ్రాణి బోళం 
కానుకలుగా అర్పించి వారు 
నమస్కరించి సాగిలపడినారు 
ఆర్బాటంతో రక్షకుడేసును ఆరాదించారు ||Happy||

DOWNLOAD MP3 SONG HERE 👇

12 December 2021

Chatinchudi Manushyajaathi | చాటించుఁడి మనుష్యజాతి

470        Go, preach my Gospel

1. చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము
చాటించుఁడి యవశ్య మేసు ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము
   
    ||చాటుదము - చాటుదము 
      చాటుదము - చాటుదము 
      చాటుదము - చాటుదము 
      శ్రీ యేసు నామము||

2. కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో 
నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో 
మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో 

   ||చాటుదము - చాటుదము 
     చాటుదము - చాటుదము 
     చాటుదము - చాటుదము 
     చక్కని మార్గము||

3. సమీపమందు నుండు నేమో చావుకాలము
సదా నశించిపోవువారి కీ సుభాగ్యము 
విధంబుఁ జూపఁగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందము

    ||చాటుదము - చాటుదము 
      చాటుదము - చాటుదము 
      చాటుదము - చాటుదము 
      సత్య సువార్తను||

04 November 2021

Chemmagillu Kallalona | చెమ్మగిల్లు కళ్ళలోన

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం - 
కష్టాల బాటలోనె సాగదు పయనం 
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును (2)

1. నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె - 
నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె 
నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 

2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే 
అక్కరలోన ఉన్నవారికి- నీవే మేలు చేసేవులే-
మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే 
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
DOWNLOAD MP3 SONG HERE 👇

03 November 2021

Chintha Ledika Yesu | చింత లేదిక యేసు పుట్టెను

109                
కరుణగల రక్షకుడు
రా - బిలహరి, తా - త్రిపుట

చింత లేదిఁక యేసు పుట్టెను - వింతగను బేత్లహేమందునఁ = చెంత జేరను రండి సర్వజనాంగమా - సంతస మొందుమా॥చింత॥

1.దూత తెల్పెను గొల్లలకు శుభ - వార్త నా దివసంబు వింతగా - ఖ్యాతి మిరఁగ వారు యేసును గాంచిరి - స్తుతు లొనరించిరి ॥చింత॥

2.చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో - మక్కువతో నా ప్రభుని గను గొన = చక్కఁగా బెత్లముపురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి ॥చింత॥

3.కన్యగర్భమునందుఁ బుట్టెను - కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు = ధన్యులగుటకు రండి వేగమె దీనులై - సర్వమాన్యులై॥చింత॥

4.పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుఁ డవతరించెను = దాపుఁ జేరిన వారి కిడుఁ గడు భాగ్యము - మోక్షభాగ్యము ॥చింత॥

DOWNLOAD MP3 SONG HERE 👇

21 August 2021

Chejarithe Thirigi Radu Ee | చేజారితే తిరిగి రాదు ఈ సమయం

చేజారితే తిరిగి రాదు ఈ సమయం


చేజారితే తిరిగి రాదు ఈ సమయం – చేయాలిగా సద్వినియోగం 
విలువైనది సమయం - దేవునికర్పించుమా 
కాలముండగానే - ప్రభువు పనిలో సాగుమా.. (2) 

1. తిరిగిరాదు ఈ కాలం వ్యర్ధముగా గడపకూ - పాపములో బ్రతుకుతూ నాశన్నాని పొందకు (2) 
దుర్డినములు రాకముందే ప్రభు చెంతకు చేరుమా(2)
మరణఛాయా కమ్మకముందే క్రీస్తు కొరకు బ్రతుకుమా ||చేజారితే||

2. దేవుడిచ్చిన వరమే ఈ జీవత సమయం - మలుచుకో ఆ సమయం దేవునికి అనుకూలంగా (2)
పరమతండ్రి చిత్తమునేరిగి సత్క్రియలే చేయుమా(2)
 క్రీస్తు వలె బ్రతుకుతు నీవు నిత్యజీవమొందుమా ||చేజారితే||

DOWNLOAD MP3 SONG HERE 👇

20 August 2021

Cheri Kolvundi Kreesthuni Paadamula | చేరి కొల్వుండి క్రీస్తుని పాదముల

85
క్రీస్తును కొలుచుట
రా - జంఝూటిి, తా – ఆది
                     
చేరి కొల్వుండి - క్రీస్తుని పాదములఁ - చేరి కొల్వుండి = చేరికొల్వుండి - స్థిరమతితో మీ - నోరు నిండ మది - కోరికఁ దీరం ||జేరి||

1.¹ధీరకలితుఁ డుప - కారకుఁ డితఁ డని - ²యారూఢిగ మదిఁ - గోరి ప్రియమునఁ || జేరి ||

2.జనకుని యుగ్రం - బును దా నోరిచి - జనులకు మేలు నొ - సంగి ఘనునిఁ || జేరి ||

3.³సార చరిత్రో - దారుఁడు   ⁴పాతక - ధీరుఁడు   ⁵శుద్ధా - చారుండితఁడని || జేరి ||

4.దేవుని కొమరుఁడు - ⁶ధీవిస్తారుఁడు - ⁷సేవ కావనుఁడు క్షేమకరుండని || జేరి ॥

5.యేసుని వారల - ⁸నీశుఁడు మన్నన - జేసి తప్పు క్షమ - చేయునుగానఁ ||జేరి||

6.మరణము నొందిన - నరులను  గృపఁ  ⁹గ్ర - మ్మరఁ బ్రతికించిన -  ¹⁰మహిమోజ్వలుని || జేరి ॥

7.పలు దయ్యంబులఁ - బారఁదరిమి రో - గుల రక్షించిన - ¹¹మలినాపహునిఁ || జేరి ||

8.జను  ¹²లచ్చెరు వొం - దను  మూఁగకు నో - రును గన్నులు  ¹³చీ -  కునకిడినాఁ డని || చేరి ||
  - కాజా అనంతము
-----------------------------------
¹ధైర్యవంతుడు. ²నిశ్చయముగా. ³మంచి చరిత్రగలవాడు. ⁴పాపమును జయించువాడు. ⁵పరిశుద్ధమైన గురువు. ⁶మిక్కిలి జ్ఞాని. ⁷సేవకులను రక్షించువాడు. ⁸దేవుడు. ⁹తిరిగి. ¹⁰మహిమతో ప్రకాశించుచున్నవాని. ¹¹పాపమును పోగొట్టువాని. ¹²ఆశ్చర్యము. ¹³గుడ్డి.

14 August 2021

Chuda goreda deva | చూడ గోరెద దేవ మందిరావరణములను

19
దేవుని మందిరావరణములు
(దావీదు కీర్తన 84)
రా - హిందుస్థాని,  తా - జుల్వ
(చాయ: సాక్ష్యమిచ్చెద)

చూడ గోరెద - దేవ మంది రావరణములను - చూడ గోరెద = చూడ నాకు నాశ గలదు - సుంద రావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో - సొమ్మ సిల్లుచున్న దహా ||చూడ||
 
1.నీదు నివాసములు జూడ - నెంతో రమ్యమై తనర = నాదు హృదయమునకు నంద మిచ్చు నిపుడు నెపుడు ||జూడ||
 
2.జీవము గల ప్రభుని జూడ - జీవి నాలో కేక వేసె = కోవెలలకు దొటికె గూటి - తావు నీ మందిరమున ||చూడ||
 
3.పిచ్చుకలకు దొటికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు కుతూహలముతోను - పిల్లల నవి మందిరమున ||చూడ||
 
4.నీదు మందిరంబులోన - నిత్యవాసులైనవారు = నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా ||చూడ||
 
5.ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల = ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||
 
6.నీదు యావరణములలో - నేను నొక్క దినము గడుప = నెంతో విలువ గల నాకు - వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ||
 
7.కానరండు మనము నిపుడె - మనము లలర ప్రభుని జూడ = మందిరమున కేగి నిండు - మన శ్శాంతి బొంది బ్రతుక ||జూడ||
                         - ఎం. జే రామాంజులు

23 June 2021

Charles Stewart Thompson | చార్లెస్ స్టువర్ట్ థాంప్సన్

📚 *ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *చార్లెస్ స్టువర్ట్ థాంప్సన్ Charles Stewart Thompson* 🛐
జననం            : 17-08-1851
మహిమ ప్రవేశం: 19-05-1900
స్వస్థలం           : ఈసింగ్టన్
దేశం                : యునైటెడ్ కింగ్‌డమ్
దర్శన స్థలము  : భారతదేశం 

       భారతదేశములో పురాతనమైన అతిపెద్ద తెగలలో ఒకటైన భిల్ అనే తెగవారి మధ్య మొట్టమొదటిగా సేవ చేసిన వైద్య మిషనరీ చార్లెస్ స్టువర్ట్ థాంప్సన్. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన థాంప్సన్ తమ గ్రామములో ఉన్న స్థానిక క్రైస్తవాలయమునకు క్రమం తప్పకుండా వెళ్ళేవారు. ఇది అతను విశ్వాసములో ఎదుగునట్లు సహాయపడింది. అతను ‘కాలేజ్ ఆఫ్ ఇస్లింగ్టన్’ లో వైద్యశాస్త్రములో శిక్షణ పొందిన తరువాత, ‘చర్చి మిషన్ సొసైటీ’ అతనిని చేర్చుకొనుటకు అంగీకరించి, భారతదేశములోని భిల్ తెగవారి మధ్య మిషనరీగా సేవ చేయుటకు థాంప్సన్‌ను నియమించింది.

              1881వ సంll లో రాజస్థాన్‌లోని ఖేవారా మిషన్ స్థావరమునకు వచ్చిన అతను, అక్కడ వైద్య మిషనరీగా తన పరిచర్యను ప్రారంభించారు. అయితే, వైద్య సేవల ద్వారా భిల్ ప్రజలతో సంబంధములను ఏర్పరచుకొని వారిని క్రీస్తు కొరకు సంపాదించవలెననిన థాంప్సన్ యొక్క ప్రణాళిక విఫలమైంది. ఏలయనగా ఈ ప్రాంతములోని భిల్ ప్రజలకు పాశ్చాత్య ఔషధం మీద నమ్మకం లేకపోవడం మాత్రమే కాదు, ఆంగ్ల వైద్యులు వారి శరీరములకు హాని చేస్తున్నట్లు వారు భావించారు. అందువలన, ప్రజలలో నమ్మకమును కలిగించుటకై థాంప్సన్ ఆసుపత్రి యొక్క మౌలిక సదుపాయములను విడిచిపెట్టి, వైద్య చికిత్సను అందించుటకై ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. క్రమంగా, అతని యొక్క ఈ తాత్కాలిక ఏర్పాటు విజయవంతమవ్వగా, చికిత్స పొందుటకై చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు అతని యొద్దకు రావడం మొదలయ్యింది.

        తరువాతి 16 సంవత్సరాల కాలం గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్ర ప్రాంతములను పర్యటించిన అతను, ఆ ప్రాంతములలో వైద్య సేవలను అందించి, చిన్న చిన్న వైద్యశాలలను మరియు ఔషధాలయములను స్థాపించారు. ప్రజలకు చికిత్స చేస్తున్నప్పుడు వారికి సువార్తను కూడా అందించేవారు థాంప్సన్. అంతేకాకుండా అనేక పాఠశాలలను కూడా స్థాపించిన అతను, భిల్ భాష యొక్క మాండలికంలో ప్రార్థనల పుస్తకమును కూడా ప్రచురించారు. అతను సువార్తను ప్రకటించే విధానమేమనగా వ్యక్తిగతముగా ఇతరులకు సువార్తను చెప్పడం. అయితే, శారీరక ప్రయోజనముల కొరకు క్రీస్తును అంగీకరించమని అతను ఏనాడూ వారిని అడుగలేదు. అతను చేపట్టిన ప్రయత్నముల వలన ప్రజలు నెమ్మదిగా తమ భిల్ విశ్వాసములను మరియు సంప్రదాయములను విడిచిపెట్టి, యేసు క్రీస్తును విశ్వసించడం ప్రారంభించారు. 1899-1900 సంll మధ్యకాలంలో చప్పానియా కరువు సంభవించి భిల్ ప్రజలను తీవ్రముగా దెబ్బతీసినప్పుడు, థాంప్సన్ ఒంటిగానే అనేక సహాయక కేంద్రములను ఏర్పరిచారు మరియు మరణపుటంచులలో ఉన్న వేలాది మంది పిల్లలను రక్షించారు. ఆ సమయములో కలరా బారిన పడిన అతను, భూసంబంధమైన తన సేవలను విరమించుకొని, పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచి వెళ్ళారు.

           థాంప్సన్ చేసిన సేవ భిల్ తెగ యొక్క ప్రాంతములో తరువాతి మిషనరీ పరిచర్యకు పునాది వేసింది. మొదటి ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించుటకు అతనికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే, మొట్టమొదటిగా భిల్ ప్రజల మధ్య అతని ద్వారా ప్రారంభించబడిన మార్గదర్శకమైన సేవ ఎంతో కాలము తరువాత ఫలములను ఫలించగా, ఆ ఫలము యొక్క సంతోషమును అతని తరువాత ఆ పరిచర్యను కొనసాగించిన వారు అనుభవించారు.

🚸 *ప్రియమైనవారలారా, మీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆత్మీయ మరియు శారీరక అవసరతలను గురించిన చింత మీలోనున్నదా?* 🚸

🛐*"ప్రభువా, అవసరతలలో ఉన్నవారికి సహాయమందించుట ద్వారా మీకు సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******
*ఒక మిషనరీ జీవిత చరిత్ర* ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లయితే, ఇతరులు కూడా ప్రయోజనం పొందులాగున దీనిని అందరికీ పంపి, *ప్రభువును సేవించుటకు* వారిని ప్రోత్సహించ మనవి!
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
తెలుగు అనువాదం: ఆర్. ఆర్. ప్రియాంక

03 June 2021

Chachina Chethulatho Yeduru | చాచిన చేతులతో ఎదురు చూచు

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను 
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను
అ.ప: ఓ చిన్నితనయా - నీకిన్ని శ్రమలేలనయా 
     నీ తండ్రి ప్రేమను గనవా - నీ యింటికి తిరిగి రావా

1. పనివారు సయితం నీ తండ్రి ఇంట రుచియైన అన్నం తినుచుండగా 
కనికరము చూపే వారెవరు లేక శుచిలేని పొట్టుకై ఆశింతువా 

2. నీ క్షేమమును కోరు నీ తండ్రినొదిలి ఆ క్షామ దేశమున జీవింతువా 
విస్తార ఆస్తి పై అధికారమును విడిచి కష్టాల బాటలో పయనింతువా 

3. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై యుండి పందులతో నీకు సహవాసమా 
ఏర్పరచబడిన యువరాజువై యుండి పనికిమాలినవారితో స్నేహమా
DOWNLOAD MP3 SONG HERE 👇

29 May 2021

Chudare Golgatha Giri Cherare | చూడరే గొల్గొత గిరి చేరరే కలువరి

చూడరే గొల్గొత గిరి - చేరరే కలువరి దరి 
యేసు శ్రమల వేదన - పాపికొరకు రోదన 
సిలువ పైన దైవసుతుని మరణ యాతన 

1.లేత మొక్కవలెను యేసయ్య పెరిగెను
 సురూపము సొగసతనికి లేకపోయెను 
ఛెళ్ళుమన్న కొరడాలు - ఒడలంతా గాయాలు 
ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగెన్ 

2.బాధింపబడినను మౌనియాయెను 
అన్యాయపు తీర్పునొంది దోషియాయెను 
పక్కలో దిగె బళ్ళెం - తలకు ముండ్ల మకుటం
మనయందరి దోషమును ఆయనే మోసెన్

25 May 2021

Chethulethi Vandanamulu Chethu | చేతులెత్తి వందనములు చేతు మిపుడే

532
యేసునకు స్తుతి
రా-ముఖారి, తా-ఆది
(చాయ:దిన దినమునకు దిక్కునీవే)

చేతులెత్తి వందనములు - చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగలందు మముఁ - బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతు||

1. సుఖమైనట్టి నిద్ర మమ్ము - నొందఁజేసి రాత్రియందు - సకల మేలు లంద జేయు - స్వామి యేసుక్రీస్తూ నీకు||చేతు||

2. అన్నవస్త్రములను మాకు - నన్ని వేళలందు నిచ్చి - కన్న తండ్రివలెను బెంచు - చున్న యేసుస్వామీ నీకే ||చేతు||

3. విద్యా బుద్ధులన్ని యిచ్చి - వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ - బెంపారఁ జేయు మేసయ్యా ||చేతు||

 4. చిన్నవారి స్నేహితుడుగ నున్న - యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు - నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||
 - నరెళ్ళ సమూయేలు సుబ్బయ్య
DOWNLOAD MP3 S ONG HERE 👇

24 January 2021

Chudumu Ee Kshaname | చూడుము ఈ క్షణమే కల్వరిని

చూడుము ఈ క్షణమే కల్వరిని 
ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా

1. మానవు లెంతో చెడిపోయిరి
    మరణించెదమని తలపోయక
    ఎరుగరు మరణము నిక్కమని
    నరకమున్నదని వారెరుగరు
                                     ||చూడుము||
2. ఇహమందు నీకు కలవన్నియు
    చనిపోవు సమయాన వెంటరావు
    చనిపోయినను నీవు లేచెదవు
    తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
                                     ||చూడుము||
3. మనలను ధనవంతులుగా చేయను
    దరిద్రుడాయెను మన ప్రభువు
    రక్తము కార్చెను పాపులకై
    అంగీకరించుము శ్రీ యేసుని
                                     ||చూడుము||
4. సిలువపై చూడుము ఆ ప్రియుని
    ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
    అర్పించుకో నీదు జీవితము
    ఆయన కొరకై జీవించుము
                                     ||చూడుము||
_____________________________
Chudumu ee kshaname kalvarini - premaprabhuvu neekai piluchundenu
Goppa raksananivva sriyesudu 
Siluvaalo vrelaadu chunnadugaa

Maanavu lentho chedipoyiri
Maraninchedamani thalapoyaka
Yerugaru maranamu nikkamani
Narakamunnadani vaarerugaru
                                   ||Chudumu||
Ihamandu neeku kalavanniyu
Chanipovu samayana ventaraavu
Chanipoyinanu neevu lechedavu
Theerpunnadani yerugu oka dinamuna
                                  ||Chudumu||
Manalanu dhanavanthuluga cheyanu
Daaridrudayenu mana prabhuvu
Rakthamu kaarchenu paapulakai
Angeekarinchumu sri yesuni
                                  ||Chudumu||
Siluvapai chudumu aa priyuni 
Aa premakai neevu yemithuvu 
Arpinchuko needu jeevithamu
Aayana korakai jeevinchumu
                                  ||Chudumu||

20 August 2020

Chudumu Gethsemane Thotalo | చూడుము గెత్సెమనే తోటలో

650
చూడుము గెత్సెమనే - తోటలో నా ప్రభువు - పాపినాకై వి - జ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది - పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది

1.దేహమంతయు నలగి - శోకము చెందిన వాడై దేవాది దేవుని - ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే ||            

 2. తండ్రి ఈ పాత్ర తొలగున్ - నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ - చిత్తము చేయుటకు నన్నప్పగించితి వనెను ||

3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది రక్షకుడేసు - హృదయము పగులుగ - విజ్ఞాపనము చేసెనే ||

4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే - మన యేసు ప్రభువు - తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే ||

5. ప్రేమామృత వాక్కులచే - ఆదరించెడి ప్రభువు - వేదన సమయమున - బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే ||

6. నన్ను తనవలె మార్చెడి - ఈ మహా ప్రేమను త - ల - చి తలచి హృదయము కరుగగ - సదా కీర్తించెదను ||చూడుము||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...