215
క్రీస్తు పునరుత్థానము
రా - మధ్యమావతి, తా - త్రిపుట
సుదతులార మీ - రిచ్చోట నెవ్వరి - వెదుకుచు నున్నారు = మృదువుగాను - జీ - వించు వాని పెద్ద - నిదుర బోయినటు - లెదలందు భావించి ||సుదతులార||
1.ఇచట లేఁడు లేచి - యున్నాఁడు ప్రభు క్రీస్తు - యేసు స్వతంత్రుఁడై = ప్రచురంబుగఁ దన - పాట్లు లేచుటయును - వచియించె గలిలయ్య - వర దేశమున మీతో ||సుదతులార||
2.మనుజ కుమారుఁ డె - క్కుడు పాపిష్ఠులచేత - మరణ మొందుట సిల్వ పైఁ = దనకుఁ దానె మూఁడవ - దినమందు లేచుట - యును దెల్పెఁ గద మీరు - వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||
3.ఎదలలోన జ్ఞాప - కము చేసికొనుఁడింక - యేసు తెల్పిన మాటలు = ముదముతో జీవముఁ - గని లేచె నను వార్త - సుదతు లాలకించి - రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||
– పురుషోత్తము చౌదరి
No comments:
Post a Comment