Showing posts with label క్రిస్మస్ గీతాలు. Show all posts
Showing posts with label క్రిస్మస్ గీతాలు. Show all posts

24 November 2023

Mariya thanayudai మరియ తనయుడై


మరియ తనయుడై - మనుజావతారుడై 
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను

ఆనందమానందమే - లోకానికి శుభదినమే ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే

1.ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను 
ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను ||ఆనంద||

2.బెత్లహేము పురములో - దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను - మన పాపము తొలగించెను ||ఆనంద||

3.రాజులకే రాజుగా - ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగ - యేసయ్య జన్మించెగ ||ఆనంద||
- సురేష్ నిట్టల

14 December 2022

Kreesthu nedu puttenu lyrics | క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా లిరిక్స్



క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా
జగమంతా చాటను నిండు మనసుతో పరవశించను (2)
రారాజు మహారాజు జన్మించే ఈ ధరలో కొనియాడి కీర్తించి ఆరాధించెదము (2)

అప:సంతోషమే సమాధానమే ఆశ్చర్యమే మహదానందమే (2)

1.సంతోషకరమైన శుభవార్త కాపరులకు తెలిసే ఈ వార్త -
లోకంలో లేని సంతోషం భువిపై తెచ్చింది ప్రభు వార్త (2)
కృంగిన జీవితాలకు కృప చూపెను ఈ క్రిస్మస్ భయముతో ఉన్న వారికి బలపరచెను ఈ క్రిస్మస్ (2) ||సంతోషమే||

2.నిరీక్షణ లేని జనులకు నిరీక్షణ తెచ్చింది ఈవార్త -
రక్షణ లేని జనులకు రక్షణ తెచ్చింది ప్రభు వార్త పాపముతో ఉన్న వారికి పవిత్రపరచును క్రిస్మస్ బాధలలో ఉన్న వారికి బలపరచును ఈ క్రిస్మస్ ||సంతోషమే||

3.సమాధానం లేని మనుషులకు సమాధానం తెచ్చెను ఈవార్త -
సమాధానపరచెను తండ్రితో శాంతి నొసగే ఈ ప్రభువార్త (2)
లయమయ్యే జీవితాలను లేవనెత్తు ఈ క్రిస్మస్ వ్యధలతో ఉన్న వారికి ఉత్తేజపరచును క్రిస్మస్ (2) ||సంతోషమే||

11 December 2022

Chinnadaina urilona | చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు


చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు (2)
దివ్యమైన లోకమందు వాసముండువాడు
దీనులైన వారి మధ్య ఉండగోరినాడు 
రాజ్యాలన్నింటిలో సంబరాలు నేడు
పూజ్యనీయునికి కీర్తనాలుపాడు (2)

నీడలేక గూడులేక సాయమొవచ్చు జడలేక
కృంగియున్నవారికింక తోడు (2)
నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు (2)
సత్యమును జీవమును తానైయున్నాడు. ||రాజ్యాలన్నిటిలో||

బుద్దిలేక శుద్దిలేక దిద్దుబాటు చేతకాక
కూలబడ్డవారికింక తోడు (2)
కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు (2)
కొండయును కోటయును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక
బెంగపడ్డవారికింక తోడు. (2)
వేడుకున్నవారికి ఆయనే భారందించగలిగినోడు. (2)
మార్గమును ద్వారామును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

Sarvonnatha sthalamulalo lyrics | సర్వోన్నత స్థలములలోన


సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ - ఆయనకిష్టులకు ఇలలో సమాధానమే
అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం
మనకు రక్షాకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి ||సర్వోన్నత||

1.మరియ భయపడుకు నీవనీ - దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ (2)
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి - నీవు గర్భము ధరియింతువన్నారు (2)
లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను
మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే (సర్వోన్నత)

2.మంద కాపరులకు శుభవార్తను - దూత తెలిపెను ఆ రాత్రి వేళలో (2)
మనకొరకురక్షకుడుపుట్టియున్నాడు మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)
మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు - రాజరాజసుతుడు
మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను ||సర్వోన్నత||

Loka rakshakudu manakoraku | లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను


లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను 
మన పాప శాపములన్ని తొలగింపను 
ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను … 
లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను 

కన్య కుమారుడుగా మనకై పుట్టెను 
లోక రాజులందరికి దడ పుట్టించెను 
సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను 

దావీదు సుతినిగా మన కొరకొచ్చేను 
గొల్యాతులందరు ఇక కూలిపోవును 
ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును 

రక్షకుండు ఉదయించెన్! మన పాప శిక్ష తొలగింపఁన్! 
తన రాజ్యమున ఇక మనలన్! 
శాశ్వతముగా నిలువనిచ్చెన్!

ఆశ్చర్యములను చేసెన్! 
ఆలోచనను ఇచ్చెన్!
బలమును చూపి నిత్యము నిలచి!
సమాధానము నొసఁగెన్…!

ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు…
అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను …
నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును …

Enthavaraku choodani | ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని


ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
వింత సంగతి యేసు పుట్టుక
బెత్లహేము అయ్యింది వేదిక
తూర్పునుండి వచ్చింది తారక

ఎంత గొప్ప కానుక - చింతలింక లేవిక
అంతటా అందుకే పండుగ

1.పాపియైన మనిషిలో నుండి
నీతిరాజు ఎట్లు వచ్చునండి
పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని
కన్యమరియు జన్మనిచ్చెనండి

2.అల్పమైన నజరేతునుండి
మంచి ఫలము ఎట్లు వచ్చునండి
చెడ్డదాన్ని ఎన్నుకొని గొప్పచేయ పూనుకొని
మేలుకరముగా మార్చెనండి

3.నరునికై మహిమలో నుండి
మధ్యవర్తి ఎట్లు వచ్చునండి
రక్షకుని వేడుకొని శిక్షమీద వేసుకొని
ఇద్దరిపై చెయ్యిఉంచెనండి

Pashula paaka chooda | పశుల పాక చుడా పగడాల | యేసయ్య పుట్టెనేడు


పశుల పాక చుడా పగడాల మేడా..ఆ..ఆ
ఆందు తొంగి చూడా ముద్దుల వాల..ఆ.
కోటి సూర్యల్ల కాంతి తానుమ్మా ..ఆ ..
మా రాజు మెస్సయ్య..ఆ..ఆ.. నారుడాయేనమ్మా..ఆ 

యేసయ్య పుట్టెనేడు (4)
యేసయ్య పుట్టేనేడు హోయెలాలో....  
లోకమంతా వెలుగు చూడు హాయిలాలో....
బెత్లహీము నగరిలో హోయిలాలో....
నజరేతు ఊరిలో హోయెలాలో.... (2)
దేవాది దేవుడు అంట నర రూప బాలుడంట (2)
కన్న మరియ కన్నదంటా ఇమ్మనుయేలుంట హోయిలాలో. హొయ్. ||యేసయ్య||

లోక పాలకుడు బాలుడు దీన బాందవుడు
ఆవతరించాడు నేడు పాపుల రక్షకుడు (2)
సూడ సక్కనొడు చుక్కల్లో చంద్రుడు (2)
కదిలి వచ్చాడు చూడు కరుణాల బాలుడలోలే హోయిలాలో... హొయ్...
రాజులకు రాజు రమ్యమైన దేవుడు హోయేలాలో.... హోయేలాలో...
మంచి మనసొన్నొడు నిన్ను నన్ను చూసేటోడు హోయెలాలో....హోయిలాలో ....
బేధాలు చుపనోడు దీనులను చేరునోడు జాలిని చూపుటోడు కన్నిళ్లును తుడేసేటోడు ఇసాంటోలు ఎవరున్నారు రారండి చూసేద్దం హోయిలాలో హొయ్ ||యేసయ్య||

జీవ నాదుడు బాలుడు మహిమ రూపుడు
మంచి కాపరి మనకై సెరవచ్చాడు (2)
సల్లని చుపులోడు సుద్దెలెన్నో చెప్పెటోడు (2)
తగ్గింపు చుపెనోడు పుట్టాడో దీనుడోలే హోయెలాలో.... హొయ్...
శుభవార్త తెలిపెను గోల్లలకు దేవదూత హోయిలాలో ... హోయిలాలో .....
శాంతి దూత ఆయనని సద్గుడు సంపన్నుడని హోయిలాలో..... హోయిలాలో....
ఎండన బయలెల్లారు బాలుడిని చూసోద్ధమని దుడ్డుకర్ర పట్టుకుని జున్నుపాలు తీసుకుని కొండ కోన దాటుకుని వస్తరి దండం పెడితిరి హోయిలాలో.. హొయ్.. ||యేసయ్య||

నీతి మంతుడు బాలుడు నిర్మల హృదయుడు
వినయ శీలుడు అతడు విమల అప్తుడు (2)
లేఖనాలు చెప్పినట్లు లోకానికి వచ్చాడు (2)
భయం లేదు దిగులు లేదు ప్రేమ పంచి ఇచ్చాడు హోయిలాలో... హొయ్...
తోక చుక్కని చూసి లెక్క లేసి జ్ఞానులు హోయిలాలో... హోయెలాలో....
యూదులు రాజుగా పుట్టి శాంతి దూత ఇతడేనని హోయిలాలో.... హోయెలాలో....
నమ్మకాన్ని ఒడిసి పట్టి పట్టుదలను చేత పట్టి రారాజును యేసు చూడ నజరేతు చేరుకుని బంగారు సాంబ్రాణి బోళంను కానుకులిచ్చి మొక్కినారు హోయెలాలో. హొయ్.||యేసయ్య||

Annanna Oranna | అన్నన్నా ఓరన్నా ఓరన్నా


అన్నన్నా ఓరన్నా - ఓరన్నా మాయన్నా
యేసన్న స్వరమును విన్నావా - యెపుడైనా యేసును చూశావా

1.మెల్లమెల్లని స్వరము - చల్లచల్లని చూపు
కరుణించే కరముల తోడ - కన్నీరు తుడిచేవాడు
నీ ఒంటరి బ్రతుకు బాటలో - నీడగ నిలుచుండేవాడు
బాధించు వ్యాధి సమయంలో - తల్లిలా తోడుండేవాడు

2.ధరణిని పాలించేవాడు - దయగల తండ్రే వాడు
దివినేలె రాజే వాడు - ధరలోన మనిషిగ పుట్టి 
ధర నరుల పాపభారముకై - బలిపశువే తానైనాడన్నా
ఇలలోన యజ్ఞయాగాలు - ఇక లేనేలేవన్నాడన్నా

3.సాగర జలముల పైన - అల్లాడే ఆత్మే తాను
ఉన్నత శిఖరముపైన - అత్యున్నతుడైన వాడు 
లోతైన లోయకుహరంలో - గంభీర స్వరమే తనదన్నా
నీ అంతరంగమందున - అవునంటే కొలువుంటాడన్నా

బేత్లెహేము పురమందున | Bethlehemu Puramanduna


బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం..
ఆడి పాడి ఆనందిద్దాం..
బెత్లెహెము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం (2)
కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం (2)  
ఆనందం పరమానందం - నింగీ నేేలా పరవశం (2) ||బెత్లె||

1.గొల్లలకు శుభవార్త - అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని (2)
దివియందు దేవునికి మహిమ - భువియందు సమాధానం (2)
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం ||బెత్లె||

2.పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు
పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ (2)
కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ (2)
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం ||బెత్లె||

3.నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది
రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి (2)
రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం (2)
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం ||బెత్లె||

Manchu kurise kaalamlo | మంచు కురిసే కాలంలో



మంచు కురిసే కాలంలో - మంచి కార్యం జరిగెను లోకంలో (2)
మహిమ రాజ్యం నుండి - మరియ గర్భమున మా మనిషిగ (2)
యేసు పుట్టెను - జనులకు రక్షణను తెచ్చెను
క్రీస్తు పుట్టెను - కమ్మని పండుగను తెచ్చెను (2)

సల్లా సల్లని దారులలో - గొర్రెల కాపరుల గాన కచేరీలు
మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి - తూర్పు దేశపు మహాజ్ఞానులు (2)

1.ఆనాడు దావీదు వంశంలో - క్రిస్మస్ గానాలు పాడగ
ఈనాడు సొంత రక్షకునికి - క్రిస్మస్ ఆరాధన చేయంగ (2)
క్రిస్మస్ పవనాలు వీస్తున్నాయి - దరిదాపుచేరి ధన్యులుకండి (2) ||సల్లా||

2.నరులారా నమ్మండి వాక్యాన్ని - ప్రవక్తల ప్రవచనాలు నిజమని 
యెష్షయి మొద్దు చిగురించెను - క్రీస్తు అనే చిగురు పుట్టెను (2)
పాపుల పాలిట మన రక్షకుని - పూజసేయ పరుగున రండి (2) ||సల్లా||

03 December 2022

Merise aa thara naa jeevithamulo | మెరిసే ఆ తార నా జీవితంలో

మెరిసే ఆ తార నా జీవితంలో 
నింపింది ఆనందం నా బ్రతుకులో (2)
గళమెత్తి పాడుదాం స్వరమెత్తి చాటుదాం -
మనకొక్క రాజు పుట్టాడని (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ -
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (4) 

1.చల్లని ఆ రాత్రి వేళలో - శుద్ద రాత్రి సమయంలో (2)
మెరిసేను ఓ కాంతి శుభవార్తతో - ఆనందం పొంగెను నా బ్రతుకులో (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (4) 

2.ఒంటరి నా బ్రతుకు పయనములో -
మెరిసింది ఆతార ఆకాశంలో (2)
దారి చూపింది నా ఆశకు ఇక - సంతోషమే నా బ్రతుకులు (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (4) ||మెరిసే||

Emmanuyelu manaku thodu | యూదయా దేశమునందు


యూదయా దేశమునందు - బెత్లహేమను గ్రామమందు -
యూదుల రాజైన యేసు - ఉదయించెను నేటి దినము (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2)

జగన్నుత కీర్తనానంద చరిత (4)

సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయూ ఆయన కిష్టులైనా వారికీ ధరయందు సమాధానము (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2)

చీకటిలోనున్న మనుజులకు - అరుణోదయ దర్శనం
చెదరిన గొర్రెలను వెదకునట్టి - మందకు ఆ మంచి కాపరి (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2) 
యూదయా దేశమునందు - బెత్లహేమను గ్రామమందు -
యూదుల రాజైన యేసు - ఉదయించెను నేటి దినము (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2)

జగన్నుత కీర్తనానంద చరిత (4)

02 December 2022

Baludu kadhammo balavanthudu | బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు


బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడిచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్య (2)

కన్య మరియ గర్భమునందు బెత్లహేము పురము నందు (2)
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మ
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి
పరుగు పరుగున పాక చేరాము

మనసారా మ్రొక్కినాము మది నిండా కొలిచినాము (2)
మా మంచి కాపరని సంతోషించాము
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||

27 November 2022

Paadudi geethamul halleluya | పాడుడి గీతముల్ హల్లేలూయా

పాడుడి గీతముల్ - హల్లేలూయా
మీటుడి నాదముల్ - హల్లేలూయా
పాపరహితుడు - హల్లేలూయా
పాపవినాశకుడు - హల్లేలూయా  

1.కన్య మరియ గర్భమందున - వెలసినావు పున్యపురుషుడా
నీవు పుట్టినావా పశుల శాలయందున (2) ||పాడుడి||  

2.పశుల శాల వెలగిపొయెను - పావనుండు జననమొందగా
ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను (2)||పాడుడి||

3.ఉల్లమందు సంతసించిరి - యేసుప్రభుని పూజచేసిరి
పయనించిరి గొల్లలు ప్రభు జాడకు (2)||పాడుడి||

4.ఆకసమున వింతగొలిపెను - అద్భుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు (2)||పాడుడి||

5.నక్కలకు బొరియలుండెను - నక్కలకు గూళ్ళు వెలయను
నీవు తలవాల్చుటకు స్థలమే లేదాయెను (2)||పాడుడి||

20 November 2022

Aananda geetham ne paadeda | ఆనందగీతం నే పాడెద



ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

1.ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను 
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

2.దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి 
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

3.జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను 
"దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

13 November 2022

Entho anandamu | Paramandu unna aa daivamu| పరమందు ఉన్న ఆ దైవము



పరమందు ఉన్న ఆ దైవము -
భువిపైకి దిగివచ్చినా వైనము (2) 
జనులందరి రక్షణకై ఆ దైవము దయచూపి చేసిన సంకల్పము (2)
ఎంతో ఆనందము - నిత్య సంతోషము 
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2)  

1.ప్రజలందరు పాపులై - దేవునికి దూరమై
పాపం పరిపక్వమై - మరణం దరి చేరువై (2)
పాపాన్ని క్షమియించుటకు - మరణాన్ని తొలగించుటకు 
అందరినీ రక్షించుటకు - పరిశుద్ధత స్థాపించుటకు
దైవమే... మనుష్యునిగా ఇలలో జన్మింపగా
ఎంతో ఆనందము - నిత్య సంతోషము 
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2) ||పరమందు||  

2. ప్రజలందరు శుద్దులై - పాపానికి దూరమై 
ప్రభు యేసుని శిష్యులై - లోకానికి వేడుకై (2)
క్రీస్తును ప్రకటించుటకు - క్రీస్తు ప్రేమ చూపించుటకు
క్రీస్తు లా జీవించుటకు - పాపిని రక్షించుటకు
దైవమే... మాదిరిగా ఇలలో జన్మించగా
ఎంతో ఆనందము - నిత్య సంతోషము
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2) ||పరమందు||

08 November 2022

Yelo yelo yelo antu | ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ


ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు  
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా 
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే 
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు 
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు 
నిన్నే కోరి నిన్నే చేరి 
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 

1.లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా -
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు 
ఘనమైన ఒక వేడుక   
ఆ గొల్లలేగా - దరువేసే చూడు 
మెస్సయ్య - పుట్టాడనీ          
మన మెస్సయ్య - పుట్టాడనీ    

2.వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ -
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు 
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు 
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే 

3.ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా - 
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు 
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు 
యేసయ్య మనకుండగా 
మన యేసయ్య మనకుండగా

31 October 2022

Happy happy christmas antu | హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం 
అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం
ఊరువాడ వీధుల్లోన తిరిగి చెప్పెదం
యేసే మన దేవుడని ఆరాధించెదం

వార్త సంతోషవార్త శుభవార్త సర్వలోకనికీ
వార్త రక్షణవార్త ప్రేమసువార్త ప్రజలందరికీ
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
చీకటి బ్రతుకులను వెలుగుగ చేస్తాడని
ధైర్యమే మన వంతని చెప్పెను దూత

హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ అంటూ ఆర్భటించెదం 
అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం 
ఊరూవాడా వీదుల్లోన తిరిగి చెప్పెదం
యేసే మన దేవుడని ఆరాధించెదం (2)
క్రిస్మస్ పాటలతో క్రీస్తు ప్రేమతో (2)
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాం

1.మన పాపం మన శాపం తీసివేయను - యేసు ధరకు వచ్చెను
మన రోగం మన మరణం తీసివేయను - యేసు ఇలకు వచ్చెను (2)
పాపము తీయుటకు - శాపము బాపుటకు
సిలువ రక్తముతో - మనలను కడుగుటకు 
ఎంతో ఇష్టపడి వచ్చెను యేసు (2) ||హ్యాపీ హ్యాపీ||

2.ఇమ్మానుయేలను వాగ్ధానముతో 
యేసు ధరకు వచ్చెను
ఇల నుండి పరలోకం మనలచేర్చను యేసు ఇలకు వచ్చును (2)
మన తోడైయుండ మనలను రక్షింప
మనకై మరణించి సమాధి చేయబడి
తిరిగి లేచుటకు వచ్చెను యేసు (2)||హ్యాపీ హ్యాపీ||

29 April 2022

O bhethlehemu graamama | ఓ బెత్లెహేము గ్రామమా

133  
O Little Town of Bethlehem

1.ఓ బెత్లెహేము గ్రామమా! - సద్దేమిలేకయు 
నీవొంద గాఢనిద్రపై - వెలుంగు తారలు 
కానేమి, నిత్యజ్యోతి - జ్వలించు నీతమిన్ 
పెక్కేండ్ల భీతివాంఛలీ - రాత్రి తీరె నీలోన్

2.మరియకేసుపుట్టెను - నిద్రింప మర్త్యులు 
పై గూడి దూతల్వింతయౌ - ప్రేమన్వీక్షింతురు - 
చాటుడో వేగుచుక్కల్ - ఈ శుద్ధజన్మము 
దైవానకు నున్నతుల్ భువిన్ - శాంతంచు పాడుడీ

3.సద్దేమి లేక వెచ్చగా! - ఈ వింత దానము 
ఆరీతి దేవుడిచ్చుపై - వరాల్ నరాళికి
నరుండెరుంగకున్నన్ - ఈ పాపధాత్రిలో
దీనులంగీకరించిన - యేసుందుజొచ్చును

4.ఓ బెత్లెహేము పావన - వత్సా! మా పై దిగు 
పోగొట్టి పాపముల్ మాలో - నీ వేళ పుట్టుము 
సువార్త క్రిస్మస్ దూతల్ - చెప్పంగ విందుము 
మా యొద్ద నుండరమ్ము మా - 
ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.
                      – ఫిలిఫ్ బ్రూక్స్

27 March 2022

Oranna peddanna raaroy | ఓరన్న పెద్దన్న రారోయ్

ఓరన్న పెద్దన్న రారోయ్ యేసురాజు పుట్టాడంటా (2)
దావీదు పురము నందు పశువుల పాకలోనంటా (2)

ఈ లోకమంతటిని చేసినవాడు . పశువుల శాలలో పుట్టాదంటా బంగార వీధులలో తిరిగేవాడు పశువుల తొట్టిలో పరుండేనంటా (2) 
చూడబోధము అన్నాలారా పూజచేద్దాము తమ్ములారా (2)

కోటిసూర్యుల కాంతి కలిగినవాడు చిన్నారి బాలుడిగా పుట్టాడంటా సృష్టికే ములమై ఉన్నవాడు పశువుల మధ్యలో ఉండేనంటా (2) 
కలసిపోదాము అన్నలారా (2) 
చాటి వద్దాము తుమ్ములారా (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...