Showing posts with label శక్తి చేత కాదు బలము చేత కాదు. Show all posts
Showing posts with label శక్తి చేత కాదు బలము చేత కాదు. Show all posts

30 October 2021

Shakthi Chetha Kaadu | శక్తి చేత కాదు బలము చేత కాదు


శక్తి చేత కాదు - బలము చేత కాదు
దేవుని ఆత్మచే - సమస్తము సాధ్యము (2) ||శక్తి||

నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి (2)
తన రూపులో తన పోలికలో (2)
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి||

కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు (2)
అగ్ని గుండములో మరణ శాసనములో (2)
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి||

ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2)
ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2)
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...