Showing posts with label Jeeva swaraalu songs. Show all posts
Showing posts with label Jeeva swaraalu songs. Show all posts

06 July 2021

Naa prana priyudu yessayya | నా ప్రాణ ప్రియుడు యేసయ్య

నా ప్రాణ ప్రియుడు యేసయ్య - కరుణా హృదయుడు యేసయ్య 
పరలోకసుతుడు - నాకెంతో హితుడు - నమ్మదగిన నా స్నేహితుడు 

1.అతిసుందరుడు - ధవళవర్ణుడు 
స్తుతియింపదగిన - ఘననామధేయుడు 
నను ప్రేమించిన నజరేతువాడు 
నాకు చాలినదేవుడు - నా హృదయపు నాధుడు
యేసయ్య నా యేసయ్య ( 4 ) 

2.ఐశ్వర్యవంతుడు - దీర్ఘశాంతుడు 
ఆశ్చర్యకరుడు - బహుబలవంతుడు 
రుధిరము కార్చిన నిజమైన జేడు 
ప్రాణమిచ్చిన దేవుడు - నా హృదయపు నాధుడు
యేసయ్య నా యేసయ్య ( 4 )
DOWNLOAD MP3 SONG HERE 👇

Erigiyunnanaya Neekedi Asadhyamu | ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము

ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని 
మారని వాగ్దానములు - మాకొరకు దాచి ఉంచినావని 

1. నను చుట్టుముట్టిన బాధలతో - నాహృదయం కలవరపడగా - 
నా స్వంత జనుల నిందలతో - నా గుండె నాలో నీరైపోగా (2)
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే - నను ఓదార్చితివే ||ఎరిగి||

2. మించిన బలవంతుల చేతినుండి - తప్పించిన యేసు దేవుడా - 
వంచనకారుల వలలనుండి - రక్షించిన హృదయ నాధుడా (2)
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ||ఎరిగి||

DOWNLOAD MP3 SONG HERE 👇

Konthasepu Kanabadi Anthalone | కొంత సేపు కనబడి అంతలోనే

కొంత సేపు కనబడి - 
అంతలోనే మాయమయ్యే -
ఆవిరివంటిదిరా ఈ జీవితం - 
లోకానకాదేదీ శాశ్వతం (2)

అ.ప:యేసే నిజదేవుడు - నిత్యజీవమిస్తాడు
        మరణమైన జీవమైన నిన్ను విడువడు 

1.ఎదురౌతారెందరో నీ పయనంలో - 
నిలిచేది ఎందరు నీ అక్కరలో 
వచ్చేదెవరు నీతో మరణము వరకు - 
ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు ||యేసే||

2.చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - 
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా 
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - 
సంపాదన ఎవరిదగునో యోచించితివా ||యేసే||

3.నీ శాపం తాను మోసి పాపం తీసి - 
రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి 
విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా - 
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Mahonnathuda Maa Deva Sahayakuda | మహోన్నతుడా మా దేవా సహాయకుడా

మహోన్నతుడా మా దేవా - సహాయకుడా యెహోవా
ఉదయకాలపు నైవేద్యము - హృదయపూర్వక అర్పణము 

అ.ప: నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా 

1. అగ్నిని పోలిన నేత్రములు - అపరంజివంటి పాదములు 
అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా 

2. జలముల ధ్వనివంటి కంఠస్వరం - నోటను రెండంచుల ఖడ్గం 
ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా

3. ఆదియు అంతము లేనివాడా - యుగయుగములు జీవించువాడా
పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్(4)
DOWNLOAD MP3 SONG HERE

Nee Needalo Naa Brathuku Gadavaalani | నీ నీడలో నా బ్రతుకు గడవాలని

నీ నీడలో నా బ్రతుకు గడవాలని 
నీ అడుగుజాడలలో నే నడవాలని 

అ.ప: హృదయ వాంఛను కలిగియుంటిని -
నీ సహాయము కోరుకుంటిని 

1. నీయందు నిలిచి ఫలించాలని - ఈ లోక ఆశలు జయించాలని 
నీ ప్రేమ నాలో చూపించాలని - నా పొరుగువారిని ప్రేమించాలని 

2. నీ సేవలో నే తరించాలని - నీకై శ్రమలను భరించాలని 
విశ్వాస పరుగు ముగించాలని - జీవకిరీటము ధరించాలని

3. నీ రూపు నాలో కనిపించాలని - నా అహమంతా నశియించాలని 
నీ వార్త ఇలలో ప్రకటించాలని - నీ కడకు ఆత్మల నడిపించాలని
DOWNLOAD MP3 SONG HERE 👇

Manasa Veenanu Shruthichesi | మానసవీణను శృతిచేసి మనసు నిండా

మానసవీణను శృతిచేసి - మనసు నిండా కృతజ్ఞత నింపి 
గొంతెత్తి స్తుతిగీతములే పాడవా - వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా 

1. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
 సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
 స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం
 దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం 

2. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి
 దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి 
 మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే
 స్తుతిధూపం పై పైకెగసి దీవెనలే వర్షింపవా
DOWNLOAD MP3 SONG HERE 👇

Karunamayuni Kadavari Pilupu | కరుణామయుని కడవరి పిలుపు

కరుణామయుని కడవరి పిలుపు 
కృపాకాలపు ఆఖరి మలుపు - 
తెరువు నీదు హృదయపు తలుపు 
యేసుక్రీస్తుని మదిలో నిలుపు 
నీకిదే మేలుకొలుపు - నీకిదే మేలుకొలుపు 

1. మరియ తనయగా గొరియ పిల్లగా మొదటిసారి భువికొచ్చెను 
నరుల పాపము మరణశాపము సిలువ పై తను మోసెను 
హింసించువారిని క్షమియించెను - దూషించుచున్నను భరియించెను 
పరిశుద్ధ రక్తము చిందించెను - పాప క్షమాపణ కలిగించెను 
ప్రాణము విడిచి మరణము గెలిచి రక్షణ సిద్ధము చేసెను 

2. జనులందరికి న్యాయము తీర్చను తీర్పరియై 
తన గొర్రెలకు బహుమానమివ్వను ప్రధాన కాపరియై
 కడవరి బూర నాదముతో - వేల దూతల సమూహముతో 
ఉగ్రుడై - ప్రళయ కాలరుద్రుడై 
సప్త నక్షత్రధారుడై - మహా తేజస్సుతో భానుడై
 యూదా గోత్రపు సింహముగా ప్రభువు వేంచేయు వేళ 
సమాధులన్నీ తెరువబడి మృతులు లేచేటి వేళ
 ప్రియ యేసుని సంధింతువా - విడిచి పెట్టబడి రోదింతువా 
ఇదియే రక్షణ దినం - అర్పించు యేసుకు జీవితం
DOWNLOAD MP3 SONG HERE 👇

03 June 2021

Aikyaparachumayya Ee Vadhuvarulanu | ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను 
సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను 
మధుర ప్రేమలో మనసులు కలువ 
హృదయ సీమలే ఒకటిగ నిలువ 
నీ దీవెనలే పంపుమా 

1.ఆనందముతోడదుఃఖమునే గెల్వ - 
చిరునవ్వు తోడ కష్టముల నోర్వ 
సంసారనావను సరిగా నడిపించ 
నీవే సహాయమీయుమా 

2.ప్రార్థనా జీవితము సమాధానము 
భక్తి విశ్వాసము నీతి న్యాయము 
నీవు చూపిన కనికరం - నీవు నేర్పిన సాత్వికం 
అనుగ్రహించి నడిపించుమా  

3.ఇహలోకభోగము పై మనసుంచక - 
పరలోక భాగ్యముపై లక్ష్యముంచగ 
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృప దయచేయుమా
DOWNLOAD MP3 SONG HERE 👇

Chachina Chethulatho Yeduru | చాచిన చేతులతో ఎదురు చూచు

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను 
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను
అ.ప: ఓ చిన్నితనయా - నీకిన్ని శ్రమలేలనయా 
     నీ తండ్రి ప్రేమను గనవా - నీ యింటికి తిరిగి రావా

1. పనివారు సయితం నీ తండ్రి ఇంట రుచియైన అన్నం తినుచుండగా 
కనికరము చూపే వారెవరు లేక శుచిలేని పొట్టుకై ఆశింతువా 

2. నీ క్షేమమును కోరు నీ తండ్రినొదిలి ఆ క్షామ దేశమున జీవింతువా 
విస్తార ఆస్తి పై అధికారమును విడిచి కష్టాల బాటలో పయనింతువా 

3. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై యుండి పందులతో నీకు సహవాసమా 
ఏర్పరచబడిన యువరాజువై యుండి పనికిమాలినవారితో స్నేహమా
DOWNLOAD MP3 SONG HERE 👇

Thellaga Telavarakamunde Tholi | తెల్లగ తెలవారకముందే తొలి కోడి

తెల్లగ తెలవారకముందే - తొలి కోడి కూయకముందే
లేచినాడే యేసుదేవుడు సమాధిగుండె చీల్చినాడే మృత్యుంజయుడు

1.ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే 
తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పనివాడు చేసి చూపినాడే 

2.స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే 
తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారే
DOWNLOAD MP3 SONG HERE 👇

Yentho Nammadagina Devudavu Neevu | ఎంతో నమ్మదగిన దేవుడవు నీవు

ఎంతో నమ్మదగిన దేవుడవు నీవు 
సంతోషమునకే కారణభూతుడవు 
కొంతైనా కునుకవు నా చేయి వీడవు 
వింతైన ప్రేమతో నన్నాదరించుదువు 

1. లోకులంతా ఏకమై నను వెలివేసినా 
శోకమెంతో భారమై నను కృంగదీసినా 
నీవు నాలో ఉన్నావని నన్ను నడిపిస్తున్నావని 
ఎరిగి ధైర్యము పొంద నాకు శక్తినీవయ్యా 

2.మరణ పాశము మమ్ము చుట్టి ఏడిపించినా 
మాకు ప్రియులే మమ్ము విడిచి నిన్ను చేరినా 
మరల వచ్చి మమ్ము లేపి పరమునకు కొనిపోతావని
నిరీక్షణతో దుఃఖపడకుండగజేయుమయ్యా
DOWNLOAD MP3 SONG HERE 👇

Yendukayya yesayya naapai | ఎందుకయ్యా యేసయ్యా

ఎందుకయ్యా యేసయ్యా నా పై ఇంత ప్రేమ (2)
పాపిని నాకొరకు నీకు ఏల సిలువ శ్రమ (2)

1. శ్రీమంతుడవు సిరికే రాజువు - 
ప్రార్థించినంతనే కృప చూపువాడవు (2) 
కడు దీనుడవై మరియ సుతుడవై (2)
పశుల శాలలో జన్మించినావా - 
నాకై ఇంత తగ్గించుకున్నావా  ||ఎందుకయ్యా||

2. న్యాయము జరిగించు శాసనకర్తవు - 
న్యాయాధిపతిగా రానున్నవాడవు (2) 
లోకాధికారుల తీర్పుకు తలవంచి(2)
దొంగల నడుమ మరణించినావా - 
నాకై ఇంత తగ్గించుకున్నావా ||ఎందుకయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

02 June 2021

Dutha Ganamu Padenu Madhura | దూత గణము పాడేను మధుర గీతము

దూత గణము పాడేను మధుర గీతము
నా నోట నిండేను స్తోత్ర గీతము (2)
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైనవారికి ఇల సమాధానము (2)

1.ఘనుడు ఆశ్చర్యకరుడు - 
ప్రియుడు అతి సుందరుడు (2)
దేవాది దేవుడే దీనుడై - 
ఉదయించె పాకలో బాలుడై (2) ||దూత||

2. నవ్వులు సొగసైన పువ్వులు - 
చూపులు మణిదీప కాంతులు (2)
ఆ యేసు జననమే రమ్యము - 
నమ్మిన ప్రతి హృదయము ధన్యము (2) ||దూత||
DOWNLOAD MP3 SONG HERE 👇

Bethlehemu Vurilo Pashulapaaka Needalo | బెత్లేహేము ఊరిలో పశులపాక నీడలో

బెత్లేహేము ఊరిలో - పశులపాక నీడలో -
ఉదయించె బాలుడు - రవికోటి తేజుడు (2)
ఆనంద మానంద మానందం (2)

1.సింహాసనం విడచి - పరమసౌఖ్యం మరచి
 నరులహృది భానుడై - ధరకు దిగె దీనుడై (2) ||బెత్లేహేము||

2.మహిమరూపం మార్చి - మంటి దేహం దాల్చి-
 పాపశ్రమ మోయను - శాపమును బాపను (2) ||బెత్లేహేము||

3.తండ్రి చిత్తం నెరవేర్చ - పరిశుద్ధరక్తం కార్చ 
లోక ఇక్కట్లను తీర్చ - మరణశక్తిని హతమార్చ (2) ||బెత్లేహేము||
DOWNLOAD MP3 SONG HERE 👇

Vinnara O Annalaara Dutha | విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే

విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట -
కన్నారా మీ కన్నులారా పరలోక వెలుగచ్చట -
కోరిన వరములు ఇచ్చేసామి కొలువు తీరి ఉన్నాడంట -
ఆయన పదములు పట్టినవారికి రక్షణ కలిగిస్తాడంట ||విన్నారా||

1.జనులందరికీ మహా సంతోషపు వార్తంట -
లోకానికే ఇది సంబరపు దినమంట (2)
దావీదు పట్టణమునకే ధన్యత వచ్చెనంట (2) పామరులమైన మనకే దరిశనమిచ్చెనంట (2) ||విన్నారా||

2.ఇన్నాళ్ళు కన్న కలలు - ఈనాడు పండెనంట 
మెస్సీయ చిన్న శిశువై - తొట్టిలో పరుండెనంట (2) 
పొత్తిగుడ్డలే తనకు మెత్తని పరుపాయెనంట (2) పశులపాకయే చివరకు రాజగృహమాయెనంట (2) ||విన్నారా||
DOWNLOAD MP3 SONG HERE 👇

01 June 2021

Bethlehemu Puramunandu | బెత్లేహేము పురమునందు

బెత్లేహేము పురమునందు చిత్రమాయెనంట
కర్తయేసు బాలుడుగా జననమాయెనంట
అంధకారమైన.. ఆకస వీధులలో.. ఆనందపు మహిమ చోద్యమేమిటోనంట (2) ||బెత్లేహేము||

1.పరమ పురమే వదలి పావనుండు యేసు - 
నరజాతిని ప్రేమించి ఇలకు దిగెనంట (2)
ఇమ్మానుయేలుగా - నెమ్మది నీయగా (2) - 
కన్నె మరియ గర్బాన పుట్టెనంట చూడరండి ||బెత్లేహేము||

2.గొల్లలేమో వార్త విని - గొర్రెలనే వదలి - 
మెల్లగా అందరికి చాటి చెప్పిరంట (2) 
దావీదు పురములో - లోకరక్షకుడుగా (2) 
యేసయ్య జనియించిన సంబరమే కనరండి ||బెత్లేహేము||

3.సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ-
ఇష్టులైన మనుష్యులకు సమాధానమంట (2) 
రెక్కలు చాచి - చక్కనైన దూతలు (2)
మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి ||బెత్లేహేము||
DOWNLOAD MP3 SONG HERE 👇

27 May 2021

Samayamu Ledannaa Mari Ledannaa | సమయము లేదన్నా మరి లేదన్నా

సమయము లేదన్నా మరి లేదన్నా 
పోతే మరలా తిరిగి రాదన్నా (2)
 యేసన్న నేడో రేపో వచ్చేనన్నా (2)
భూమిమీదికి దైవరాజ్యం తెచ్చేనన్నా 

1. హృదయంలో యేసుని చేర్చుకున్న -
పరలోక భాగ్యమే నీదగునన్నా (2)
నీ పాపజీవితం విడువకయున్న -
పాతాళగుండమే నీగతియన్నా (2)
రేపన్నది నీది కాదు నిద్ర మేలుకో -
నేడన్నది ఉండగానే దారి తెలుసుకో(2)
చేయకాలస్యము - తెరువు నీ హృదయము (2)

2.ఆకాశం పట్టజాలని దేవుడన్నా -
కన్య మరియ గర్భమందు పుట్టాడన్నా (2)
లోక పాపమంత వీపున మోసాడన్నా -
మానవాళి శాపం రూపుమాపాడన్నా (2)
నీ హృదయపు వాకిట నిలుచున్నాడు -
నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు(2)
 చేయకాలస్యము - తెరవు నీ హృదయము (2)

3.యేసయ్య రెండవ రాకకు సూచనలెన్నో -
నీ చుట్టూ జరుగుచున్నవి గమనించన్నా (2)
గడ్డిపువ్వు లాంటిది నీ జీవితమన్నా -
ఎపుడు ముగిసిపోతుందో తెలియదన్నా(2)
బూరధ్వనితో ఆర్భాటముతో మేఘరూఢుడై -
తీర్పు తీర్చ యేసురాజు రానున్నాడు(2)
చేయకాలస్యము - తెరువు నీ హృదయము(2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Yesu Nee Sakshiga Nanu Nilpinavaya | యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా

యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా 
గురిలేని నా బ్రతుకు దరిచేర్చినావయా
నీ సేవ చేయగా - నీ సిల్వ మోయగా (2)
                                                 ||యేసు||
1. ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప(2)
మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప (2)
                                                ||యేసు||
2. సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప (2)
నిత్యం స్తుతినొందదగిన నీ నామము ప్రణుతింప (2)
                                                ||యేసు||
3. నాలో నీ సిల్వ ప్రేమ లోకానికి చూపింప (2)
రాకడకై కనిపెట్టుచు నీ కొరకే జీవింప(2)
                                                 ||యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Yehova Ninnu Poliyunna Vaarevvaru | యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు

యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు 
యేసువా నీకు సాటియైన వారెవ్వరు (2)

1.సృష్టికి ఆధారుడా అద్వితీయుడా - 
నిత్యము నివసించుచున్న సత్యదేవుడా (2)
అందరిలో సుందరుడా కాంక్షనీయుడా(2) 
వందనములకర్హుడా పూజ్యనీయుడా (2)
                                         ||యెహోవా||
2.పాపికొరకు ప్రాణమిడిన ప్రేమరూపుడా - 
లోక శాపమును మోసిన సిలువధారుడా(2) 
మరణపుకోరలు పీకిన విజయవీరుడా (2)
శరణన్నచో కరుణ చూపు పరంధాముడా (2)
                                         ||యెహోవా||
3. ఆదియు అంతములేని అగ్నినేత్రుడా - 
ఆదరించు నాధుడా స్తుతికి పాత్రుడా (2)
కన్యక కడుపునబుట్టిన పరమపుత్రుడా (2)
అన్యజనుల జతకట్టిన మంచి మిత్రుడా(2)
                                         ||యెహోవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Sthuthiyinchedanu sthuthi paathruda | స్తుతియించెదను స్తుతి పాత్రుడా నిను

స్తుతియించెదను స్తుతి పాత్రుడా నిను -
భజియించెదను భయ భక్తితోను (2)
 
అ.ప: వందనమయ్యా యేసయ్యా - 
         నీకే ప్రణుతులు మెస్సీయా ||స్తుతి||
 
1.నీ గుణగణములు పొగడను తరమా -
నీ ఘనకీర్తిని పాడ నా వశమా (2)
పరలోక సైన్యపు స్తుతిగానములతో (2)
దీనుడ నా స్తుతి అంగీకరించుమా ||వందన||
 
2.నీ ఉపకారములు లెక్కింపగలనా -
నీ మేలులన్నియు వర్ణింపనగునా (2)
నా హృదిగదిలో నివసింపగోరిన (2)
నజరేయుడా నిను హెచ్చింతునయ్యా ||వందన||
 
3.నీ సిల్వప్రేమను వివరింప శక్యమా -
నీ సన్నిధి లేక జీవింపసాధ్యమా (2)
ఆరాధించెద ఆత్మతో నిరతం (2)
నీ క్షేమముతో నింపుమా సతతం ||వందన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...