Showing posts with label 317 పాపము దలచు సుమీ. Show all posts
Showing posts with label 317 పాపము దలచు సుమీ. Show all posts

08 February 2026

పాపము దలఁచు సుమీ Paapamu dalachh sumi

317
పశ్చాత్తాప ప్రార్థన 
రా - ముఖారి                    తా- ఆది 

పాపము దలఁచు సుమీ - పశ్చా - త్తాపముఁ బొందు సుమీ = దాపని యేసుని పాదంబులబడి - పాపము వీడు సుమీ ||పాపము||

1.పాపము చేయకు మీ - యేసుని - గాయము రేపకుమీ - పాయక పాపము చేసిన మనసా - కాయఁడు యేసు సుమీ ||పాపము||

2.గంతులు వేయకుమీ - యేసుని - చెంతకుఁ జేరు సుమీ = వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత - బిందువుఁ గోరు సుమీ ||పాపము||

3.ఈ ధరన్నమ్మకుమీ - ఆత్మకు - శోధన లుండు సుమీ శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ ||పాపము||

4.తెగువఁ బోరాడు సుమీ - రిపునకు - బెగ్గిలవద్దు సుమీ = తెగువగు ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి - పగతునిఁ గెల్వు సుమీ ||పాపము||

5.అంతము వచ్చు సుమీ - రక్షణ - అంతలో వెదకు సుమీ = అంత రంగుఁ డగు క్రీస్తు రక్షకుని - చెంతను జేరు సుమీ ||పాపము||
- యెషయా వీర మార్టిన్ 


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...