Showing posts with label Bilmoria songs. Show all posts
Showing posts with label Bilmoria songs. Show all posts

27 September 2020

Thandree Nee Dari Cherchuko | తండ్రీ నీదరి చేర్చుకో

తండ్రీ నీదరి చేర్చుకో - నీ చేతిలో దాచుకో(2)
నీఆత్మలో నింపుకో - నీరూపులో మార్చుకో
     నీసేవకై వాడుకో - నన్ను నీసేవలో నిలుపుకో(2)
                                                        ||తండ్రీ||
1. పలుమారులు నే పడుచున్నను 
    నీఆత్మతో నన్ను పట్టుకో 
    దారితెలియక పరుగెత్తగా - 
    నీ త్రోవలో నన్ను నడిపించుకో(2)     ||తండ్రీ||

2. సాతాను శోధనలు అధికమైనా 
    నీ రెక్కల చాటున దాచుకో 
    సొమ్మసిల్లి నే పడియుండగా -
    నీ కంటి పాపగా నన్ను చూసుకో (2)  ||తండ్రీ||

3. ఆపదలు నన్ను దరిచేరగా 
    నా మంచి కాపరివై కాచుకో 
    తుఫాను లెన్నో చెలరేగగా - 
    ఆవలి తీరము నన్ను చేర్చుకో (2)   ||తండ్రీ||

4. నా అన్న వారు నన్ను విడువగా
    కన్న తండ్రి వై నన్ను చూసుకో
    ఇహ లోక యాత్ర నే ముగియగా
    పరలోక రాజ్యము నను చేర్చుకు (2) ||తండ్రీ||

20 September 2020

Neevanti Devudu Evarunnaru | నీవంటి దేవుడు ఎవరున్నారు

నీవంటి దేవుడు ఎవరున్నారు - పరమందు ఈ భూతల మందు (2)
ఆకాశము నీ సింహాసనము - భూమి నీ పాదపీఠము (2)||నీవంటి||

1. భూమంతయు దాని అంతమంతయు - నీ చేతి కార్యములు =
జలరాశులు సకల ప్రాణులంతయు - నీ దయకు తీపి గురుతులు 
మానవజాతి నీ ప్రేమకు చిహ్నం - సృష్టించినావు నీ రూపులో (2)||నీవంటి||

2. నీవు సృష్టించిన మనుషులందరూ - సృష్టికర్తను నిన్ను మరచితిమి = 
నా చేతి పనినే నమ్మితిమి - వాటిని మేము పూజించితిమి తండ్రియైన నీవు విలపించి మాకై - ఏసుగా ఏతెంచితివి  (2) ||నీవంటి||

3. జీవ వాక్యం శరీరధారియై- మన మధ్యన నివసించెను =
 ప్రతి పాపమును తానే మోసి - సిలువపై మరణించెను -
 పాపక్షమాపణ మనకు ఇచ్చెను - పరలోకరాజ్యముకు దారి చూపెను(2) ||నీవంటి||
DOWNLOAD MP3 SONG HERE 👇

17 August 2020

Premamrutha dharalu chindinchina | ప్రేమామృతధారలు చిందించిన

677
1. ప్రేమామృతధారలు చిందించిన 
యేసుకు సమమెవరు ? ఆ --- ఆ - 
ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి
ప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమనగరికి చనియె ||ప్రేమామృత||

2. నిశ్చలమైన ప్రేమజీవికి - యిలలో తావేది
ప్రేమ ద్రోహులేగాని - ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా ||ప్రేమామృత||

3.ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించునురారా
పాపభారముతో - రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించున్ ||ప్రేమామృత||

4. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల?
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా 
ఇదియే దేవునివరము - ముదమారగ జేకొనుము ||ప్రేమామృత||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...