Showing posts with label 589 మన దేశంబున క్రీస్తు సువార్త. Show all posts
Showing posts with label 589 మన దేశంబున క్రీస్తు సువార్త. Show all posts

31 May 2022

Mana deshambuna kreesthu suvaartha | మన దేశంబున క్రీస్తు సువార్త

589 
బైబిలు స్త్రీల సేవ
(ఛాయ: ఘన దేవుని తనయుండ)
రా - తోడి,  తా - రూపకము

మన దేశంబున క్రీస్తు - సువార్త వ్యాపించుటకు - మార్గంబు స్త్రీలంచు - మరువకమ్మ - పనిబూని ప్రభుకొరకు - పరదేశంబులయందు - ఘనురాండ్రు చేయుపనుల్ - వినలేదమ్మా?||

1.సాటియైనటువంటి - సాయంబవై పతికి - లోటులేకుండ నెపుడు - లోబడు మమ్మ = పాటుపడి నీ సుతుల - భయభక్తితో పెంచి - నాటుము మదిలోన బోధ - నమ్ములమ్మ||

2.అన్నపానములందు నలవాటులందు నీ - పన్యులకు మాదిరి - వగుదు వమ్మ = నిన్ను నీ పనుల గమ - నించి పరీక్షించు - చున్నవారింట బైట - నున్నారమ్మ||

3.ఘనుఁడౌ దేవుని వాక్య - మును జదివియో వినియో - దిన మేకాంతముగ ప్రార్థించు మమ్మ = నినువలెను నీ పొరుగు - నెలఁతుల ప్రేమింపవలె - వినుమ దూషింపక దీ - వించు మమ్మ||

4.పనులెన్నో నీ కున్న - ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన - దెల్పుమమ్మ - ఒనరంగా నేఁడాది - కొక యాత్మనైన నిక = నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ||

5.ఎల్లసేవకుల కొర = కెల్లప్పుడు ప్రార్థింప - తల్లుల సమాజమునకు - చెల్లు నమ్మ - పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న - తల్లులే మంచి సా - ధనములమ్మ ||
                          – మల్లెల దావీదు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...