Showing posts with label Bro. Freddy Paul songs. Show all posts
Showing posts with label Bro. Freddy Paul songs. Show all posts

13 March 2022

Athi sundarudavu yesayya | అతి సుందరుడవు యేసయ్య

Hosanna Ministries 32nd Album [ Srikaruda Naa Yesayya ] Song - 6 - " అతిసుందరుడవు " Athisundarudavu

అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2) 
హల్లెలూయ.. హల్లెలూయ.. హోసన్నా. ఆరాధన (2)

1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు - కృపాక్షేమములు నీ మందిరములో - సమృద్ధిగా కలవు (2)
నే దీనుడనై నీసన్నిధిని అనుభవించెను (2)
పరవశించి..పరవళ్లు తొక్కి.. ఆరాధించెదను (2) ||అతి||

2. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించి యున్నావు (2)
విశ్వాసముతో ఓర్పు కలిగి - వాగ్దానము నే పొందెదను (2)
సంపూర్ణతకై.. పరిశుద్ధుడనై.. ఆరాధించెదను (2) ||అతి||

3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు - పునాదులుగల పట్టణములు కట్టుచున్నావు (2)
సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు (2)
నీ మహిమనుపొంది.. నీ దరిచేరి.. ఆరాధించెదను (2) 

అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2) 
ఆరాధనకు నీవు యోగ్యుడవు స్తుతులకు నీవె పాత్రుడవు

13 August 2021

Aathma Parishudhathmuda Naalo | ఆత్మ పరిశుద్దాత్ముడా నాలో నివసించుము

ఆత్మ పరిశుద్దాత్ముడా - నాలో నివసించుము

ఆత్మ పరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము(2)
నా ప్రాణ ఆత్మ శరీరమును - యేసయ్య రాకకై సిద్దపరచుము (2)

1. నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి -
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి (2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)||ఆత్మ||

2. పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి -
అన్యభాషలు మాట్లాడుటకు - వాక్ శక్తి నొసగితివి (2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)||ఆత్మ||

2. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే -
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి (2)
నాలో నివసించుము - నీతో నడిపించుము (2)

DOWNLOAD MP3 SONG HERE 👇

07 April 2021

Aaradhana sthuthi Aaradhana | ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో

ఆరాధన స్తుతి ఆరాధన 
ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన
తండ్రియైన దేవా - కుమారుడైన ప్రభువా-
పరిశుద్దాత్మ దేవా - త్రియేక దేవా ఆరాధన 
స్తుతి ఆరాధన (2)

1. సర్వసృష్టికి ఆధారుడా - 
సకలజీవుల పోషకుడా (2)
సీయోనులోనుండి దీవించువాడవు
సదాకాలము జీవించువాడవు
సాగిలపడి నే నమస్కరించి సర్వదా 
నిను కొనియాడేద - నిన్నే కీర్తించెద (2) ||తండ్రియైన||

2. సార్వత్రిక సంఘస్థాపకుడా - 
సర్వలోక రక్షకుడా (2)
సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి
శిథిలము కాని నగరమును కట్టితివి
స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి
సర్వలోకాన నీ మహిమను - నేను ప్రకటింతు (2) ||తండ్రియైన||

3. సర్వసత్యమునకు ఆధారమై - 
పరిశుద్ధ యాజకుల సారధివై (2)
యాజక రాజ్యములో నను చేర్చుటకై
నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
మహిమతో పరిచర్య నే చేయుటకై
నూతన కృపలను నేపొందెద - ఆత్మ శక్తితో సాగేద(2) ||తండ్రియైన||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...