Showing posts with label బన్యన్ జోసఫ్. Show all posts
Showing posts with label బన్యన్ జోసఫ్. Show all posts

23 April 2022

Parama prabho yesurakshaka | పరమ ప్రభో యేసురక్షకా

225 
ఆరోహణ దినము
రా - ఆనంద భైరవి, తా - ఏక
(ఛాయ: ఓ మా తండ్రీ నీదు నామము)

పరమ ప్రభో యేసురక్షకా - ధననరుల బ్రోచి = పరమ కారోహణంబైతివా = మరియయందు జననమొంది - వరము లిడుచు దిరిగిధరను - మరణమొంది తిరిగిలేచి - పరము కేగితివా ప్రభో ||పరమ||

1.ఘోర పాపభారముతోడ - దరిగానలేకఁ -  దిరుగుచుండినట్టి మమ్మును = కూరిమితోఁ దరికిఁబిలిచి - భారమును నీవేమోసి - ఊరకమము క్షమియించి - నేరములను బాపిన ప్రభో ||పరమ||

2.సిలువమరణమొందినఁ ప్రభువా - ఇలనరుల ఘోర - కలుషములను బాపిన ప్రభువా = విలువలేని నీదు బ్రతుకు - బలముగల నీ ప్రేమ సేవ - సలితముగ ననుకరించి - ఇలను మేము బ్రతుకునట్లు ||పరమ||

3.చెఱను చెఱగఁబట్టిన ప్రభువా - ధనరులకెల్ల - వరములను విరివి నిడితివా = పరముకేగి పరమతండ్రి - పరమున కుడిపార్శ్వమందుఁ - దిరముగాఁ గూర్చుండి యుండి - తిరిగి ధరకు వచ్చెదవా ||పరమ||

4.నీదు రాక కెదురుజూచెడి - నీ దాసులను -  సదయతతో జూడుమో ప్రభో = మాదినపు ప్రార్థనలను - మాదు స్తోత్రములను మిగులఁ - బ్రోదిగా గైకొనుచు నేడు - బ్రోవుమయ్య మమ్ములను ||పరమ||

5.పంపుమయ్య నీదు ఆత్మను - పదిలముగ దయతో - సొంపుగ నీ శుద్ధాత్మను - నింపుమయ్య నీదు కృపతో - ఇంపగు నీవరములతో - సొంపు గాను నీదు సేవ - జేయనిలను నెల్లపుడు ||పరమ||
                         - బన్యన్ జోసఫ్

10 April 2022

Yesuva jayamutho yerushalemuna | యేసువ జయముతో యెరుషలేమున

593 
మట్టలాదివారము
రా- శంకరాభరణం,   తా - ఆది
(ఛాయ: యేసుని ప్రేమను)

యేసువ జయముతో - యెరుషలేమున - బ్ర - వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ వసుధను జనులు - విజయము జేసిన యో ప్రభువా ||యేసువ||

1.మట్టలు బట్టియు - బట్టలు బరచియు - గట్టిగఁ బాడగ యో ప్రభువా = అట్టహాసముతో - అశ్వము నెక్కడ - అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||

2.పిల్లలు పెద్దలు - పలుకేకలతోఁ - బలికి నుతించగ యో ప్రభువా = చల్లగ వానిని - సరియని యొప్పి - సంతోషించిన యో ప్రభువా ||యేసువ||

3.కొందరు వారిని - తొందరఁ జేయగ - కూర్మిని దిద్దిన యో ప్రభువా = అందరు మానిన - అరచును రాళ్లని - ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||

4.యెరుషలేం కొరకై - యోరిమి జూపియు - నేడ్చిన దయగల యో ప్రభువా = యెరుషలేమందున - యాలయ మంతను - శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||

5.మా కొఱకై తన - ప్రాణము బెట్టిన - మాన్యుడవీవె యో ప్రభువా = మా కొరకై ధర - మరణము గెల్చిన - మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||

6.మాదు మనస్సును - హృదయము నాత్మను - నీదిగ గైకొను మో ప్రభువా = సాదర వాక్కులు - చక్కఁగఁ బలికియు - నాదరించుమము నో ప్రభువా ||యేసువ||
                             – బన్యన్ జోసఫ్

17 August 2021

Sthothramu sthothramu O Deva | స్తోత్రము స్తోత్రము ఓ దేవా

48    
ఉదయగీతి
రా – ఆనందభైరవి, తా – త్రిపుట
(చాయ: ఎందుకు మరచితివి)

స్తోత్రము స్తోత్రము ఓ దేవా - ఈ వేకువనే - స్తోత్రము జేతుము మా దేవా = రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి - ధాత్రి మరియొక దినము - దయతో నిచ్చిన దేవా||

1.పాపశోధనలనుండి - ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య = పాపము మమ్మున్ - ఏల నియ్యకుండ - మాపు రేపులుమమ్ము- మనిపి బ్రోవుమయ్య ||

2.కన్న తండ్రికంటెను - కనికరమున - కాపాడెడి మా దేవా = అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి - మన్ననతో నీదినము - మన నియ్యుమో దేవా||

3.పితా సుతా శుద్ధాత్మ - లనెడి దేవా - ప్రీతితో గావుమయ్యా = నీతిమార్గములందు నిరతము మముగాచి - ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా||
                                      – బన్యన్ జోసఫ్

14 August 2021

Paahiloka Prabho Paahi Loka | పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో

29    
ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
రా – ధీరశంకరాభరణము,  తా – ఆది
                   
పాహిలోక ప్రభో - పాహి లోక ప్రభో = పాహి యని వేఁడు మాం - పాహిలోక ప్రభో ||

1.నిన్ను స్తుతియించుచు - నీవు ప్రభుఁడ వని = చెన్ను మీరఁగ నమ్మి యున్నాము సత్రభో ||

2.నిత్య మా తండ్రి భూ లోకం బంతయు నిన్ను = భక్తితో నారాధిం చు - చున్నది మా ప్రభో ||

3.దేవ లోకాధిపతులు - దూతల సమూహము = దేవా యని కొల్చుచు - న్నారు నిన్నుఁ బ్రభో ||

4*పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా = పరలోక సేనాధి - పతి వైన మా ప్రభో ||

5.ఇహలోకం బంతయుఁ - బరలోకం బంతయు నీ = మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో ||

6.కెరూబులను దూతలు - సెరూపులను దూతలు = తిరముగా నిన్ గొనియడు - చున్నారు మా ప్రభో ||
     
7.నీ దపొస్తలుల - మహిమగల సంఘము = ప్రోదిగా నిన్నుతించు - చున్నది మా ప్రభో ||
     
8.నిత్యము ప్రవక్తల - యుత్తమ సంఘము = సత్యముగ నిన్నుతించు - చున్నది మా ప్రభో ||

9.ధీర హత సాక్షుల - వీర సైన్య మంతయు = సారెకు నిన్నుతించు - చున్నది మా ప్రభో ||

10.నిత్య మహాత్మ్యముగల - తండ్రి వైన నిన్నును = నీదు పూజ్యుఁడగు నిజ - అద్వితీయ సుతినిన్ ||

11.ఆదరణ కర్తయై - నట్టి శుద్ధాత్ముని = నంతట నుండు సభ - యెప్పుకొనును నిన్ బ్రభో||
                                   - బన్యన్ జోసఫ్
_____________________________
* ఈ గుర్తు గల చరణములను దీనస్వరముతో పాడదగును.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...