Showing posts with label sp Balu Christian songs. Show all posts
Showing posts with label sp Balu Christian songs. Show all posts

07 June 2022

Nee aaradhana hrudaya | నీ ఆరాధన హృదయ ఆలాపనా

నీ ఆరాధన .. హృదయ ఆలాపనా..(2)
ఆత్మతో సత్యముతో.. (2)
ఆరాధించెదను ఆరాధించెదను (2)
ఆరాధన క్రీస్తు ఆరాధన -
ఆరాధన యేసు ఆరాధన (2)
నీ ఆరాధన .. హృదయ ఆలాపనా..(2)

1.అరుణోదయమున ఆరాధన - 
సూర్యాస్తమయమున ఆరాధన (2)
దినమెల్ల నీ నామం కీర్తించిన - 
నా ఆశ తీరునా (2)
ఆరాధన క్రీస్తు ఆరాధన - 
ఆరాధన యేసు ఆరాధన (2)
నీ ఆరాధన .. హృదయ ఆలాపనా..(2)

2.స్తోత్రము చేయు పెదవులతొ - 
తంబుర సితార నాధముతో (2)
విరిగి నలిగిన హృదయముతో - 
ఆరాధనకు యోగ్యుడవు (2)
ఆరాధన క్రీస్తు ఆరాధన - 
ఆరాధన యేసు ఆరాధన (2) ||నీ ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇

27 August 2021

Sharanu Sharanu Deva Sharanu O Deva | శరణు శరణు దేవ శరణు ఓ దేవా

శరణు శరణు దేవ శరణు ఓ దేవా
శరణుజొచ్చితి రమ్ము కరుణతో బ్రోవ

1. పాపేచ్చలతో నేను పలు బాధలొందితి
మరి చేయునది లేక మార్గంబు దప్పితి
వలదు వలదీలోక వాంఛలన్నియు భ్రమర
శరణు శరణు నాదు శ్రమలన్ని బాపరా 

2. శోధనలు నను చుట్ట ఆదరణ లేకయే
నాధ నీ భోదను కాదనుచు ద్రోసితి 
కాదుగా నా ఎదను సిలువపై దీర్చితి
పాదములు పైబడితి భ్రాంతులను ద్రుంచరా 

3. నీ ఆత్మ కాంతితో నన్ను వెలిగించరా
నీ వాక్య శక్తితో నన్ను ధృడపరచారా
నీ కృపతో ఇల నన్ను పిలచీ దీవింపరా
నిరతంబు నీ ప్రేమ నా యందు నిలుపరా 

DOWNLOAD MP3 SONG HERE 👇

08 August 2021

Mithrama Naa Mithrama | మిత్రమా నా మిత్రమా చిత్రమా

నీతో స్నేహం నాకు ప్రాణం - నాతో బంధం అది నీ త్యాగం -
మిత్రమా నా మిత్రమా - చిత్రము ఇది చిత్రము

మిత్రమా.. నా మిత్రమా - చిత్రమా.. ఇది నీ చిత్తమా..
మిత్రమా.. నా యేసయ్యా - చిత్రమే.. ఎంతో చిత్రమే..

స్నేహం.. నీ స్నేహం - ప్రాణం.. నాకు ప్రాణం 
నీ స్నేహం.. నాకు ప్రాణం - ప్రాణం.. నీ స్నేహం 
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా - ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా (2) ||మిత్రమా||

మట్టిని మనిషిగ మలచినావు..మనిషిని మమతతో నింపినావు..
మమతకు మంచిని నేర్పినావు..మంచికి మనసును ఇచ్చినావు..
మట్టిని మనిషిగ మలచినావు ఎందుకో..
మనిషిని మమతతో నింపినావు ఏమిటో..
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో ..
మనసుకు మనసును కలిపినావు..
ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ - బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ (2) ||మిత్రమా||

కంటి నీరు తుడిచినావు...కంటికి రెప్పై నిలిచినావు...
వింతగ నన్ను వలచినావు...తండ్రివై నన్ను పిలిచినావు...
కంటి నీరు తుడిచినావు ఎందుకో ..
కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో.. 
వింతగ నన్ను వలచినావు ఏలనో..
తండ్రివై నన్ను పిలిచినావు ...
రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ - బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ (2)||మిత్రమా||

DOWNLOAD MP3 SONG HERE 👇

10 May 2021

Keerthaneeyamainadi Kreesthu Gaana | కీర్తనీయమైనది క్రీస్తు గానసుధా

కీర్తనీయమైనది క్రీస్తు గానసుధా 
తరిగిపోని పెన్నిధి క్రీస్తు పుణ్యకథ 
నీరాశల నిశీధిలో విరాగపు ఎడారిలో కన్నతోడు ఉన్నదిక్కు క్రీస్తు నీకు జత 
కరుణ జూపి కలత బాపు కన్న తండ్రి కథ 
మనకున్న తండ్రి కథ 

1. ఆకలైన వేళలో అన్నమతడు తెలుసుకో
    చీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకో (2)
    వేళా లేదు పాలా లేదు శరణు వేడగా 
    పేదా సాదా అంటే తాను కరుణ చూడగా      
    మహిజనులకు మహిమ దెలిపి ఆ మమతను చూపగా తీరిపోవు వ్యధ
                                                   ||కీర్తనీయ||
2. తళ్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది 
    తననే విడనాడిన తండ్రి మనసు అతనిది (2)    
    పాపాలెన్నో చేసే జన్మ పదములంటినా 
    కామం క్రోదం లోభం మోహం సిలువ వేసినా
    కఠిన జనలకై నరులను ప్రేమ కలిగి బ్రోచినా ప్రేమమూర్తి కథ
                                                   ||కీర్తనీయ||

03 May 2021

Chaalunayya Nee Krupa Naa | చాలునయ్య నీ కృప నా జీవితానికి

చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా 
                                             ||చాలు||
1. మేఘాలలోన మెరుపుంచినావు (2)
    త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
    సాగలేని జీవిత సమరములో (2)
    వేగమే దూతనంపి బాగుగ నిలిపావు
                                             ||చాలు||
2. పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
    ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
    వెతుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
    లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా
                                            ||చాలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

07 April 2021

Doshiva Prabhu Nuvu Doshiva | దోషివా ప్రభూ నువు దోషివా

దోషివా .... ప్రభూ ..... నువు దోషివా 
నీ విధేయతకు నా అవిధేయతకు 
మధ్యలో నలిగి , వ్రేలాడిన నిర్దోషివా 
దోషివా ప్రభూ .... నువు దోషివా 

1. ఘోరంబుగా నే చేసిన నేరాలకు 
    నువు పొందిన మరణ శిక్ష 
    నే నడచిన వక్ర మార్గాలకు 
    నువు పొందిన సిలువ యాతన (2) 
    కలువరి గిరిలో ఆఘోర యాత్ర (2) 
    నేపొందిన రక్షణా పాత్ర

2. నే వేసిన తప్పటడుగులకు -
    నీవు కార్చిన రక్తపు మడుగులూ 
    నే చేసిన కపటంబులకు - 
    నీవు పొందిన కొరడా దెబ్బలు(2)
    సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2) -
    ప్రేమించితివే నన్ను 

3. తులువలలో ఓ తులువగా నున్న
    నా పై నీ దయగల చూపు 
    పరలోకములో నీతో నుండ భాగ్యంబును
   నాకు నిచ్చినదే (2) 
   తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2) 
   నీ తుది శ్వాస వీడనంటివే

19 March 2021

Hrudayame Nee Alayam Kreesthu | హృదయమే నీ ఆలయం క్రీస్తు


హృదయమే నీ ఆలయం క్రీస్తు - నీ నామమే నా గానం
విదితము కాదే ఇలలో ఎవరికీ - వివరింపగా నీ పావన రూపం -
హృదయమే నీ ఆలయం క్రీస్తూ...

1. మనిషి మనిషిగా బ్రతకాలని - మంచిని మనసున పెంచాలని
సిలువలో నీవు మరణించి (2) మృత్యువునే నీవు ఎదురించి 
వెలసిన దేవుడా నీవే - పాపుల రక్షణ నీవే ||హృదయమే||

2. కారు చీకటిలో కాంతి రేఖవై - మూగ గుండెల్లో దివ్య వాణివై -
దీనులనే నీవు కరుణించి (2) - వేదనలే నీవు తరలించి
పరమున చేరిన దేవా - శరణు శరణు ఓ ప్రభువా ||హృదయమే||
___________________________
Hrudayame nee alayam kreesthu - Nee namame naa gaanam
vidhithamu kadhe ilalo evariki - Vivarinchaga nee pavana rupam
Hrudayame nee alyam kreesthu ||Hrudaya||

Manishi manishiga brathakalani - Manchini  manasulo penchalani
siluvalo neeve maraninchi (2) - Mruthyuvu ne neevu yedurinchi
Velasina devida neeve - Paapula rakshana neeve ||Hrudaya||

Kaaru cheekatilo kaanthi rekhavai- Muga gundelo dhivya vanivai
Deenulane neevu karuninchi(2) - Vedhanle neevu Tharalinchi
Vanamunu cherina deva - Saranu saranu o prabhuva  ||Hrudaya||

DOWNLOAD MP3 SONG HERE 👇

Yendukamma Lokama Kreesthu Ante | ఎందుకమ్మా లోకమా క్రీస్తు అంటే కోపము

ఎందుకమ్మా లోకమా క్రీస్తు అంటే కోపము
ఏమిటమ్మా దేశమా యేసు అంటే ద్వేషము (2)
నిను ప్రేమించినందుకా ప్రాణమిచ్చినందుకా -
ని ధరిచేరినందుకా దీవించినందుకా.. (2)
                                      || ఎందుకమ్మా||
1. నినుఎంతో ప్రేమించి నీకోరకై ఎతేంచి (2)
    కన్నీటిని తుడిచ్చి నీకై సిలువను మోసిన (2)
    క్రీస్తు పై
                                     || ఎందుకమ్మా||
2. తనపేరే తేలియకున్న తనగురించి తేలిపెందుకు(2)
    తన సెవకులను పంపి తండ్రిప్రేమ చాటిన (2)
    క్రీస్తు పై
                                      || ఎందుకమ్మా||
3. నీలోని చీకటిని తోలగించి వేయుటకు (2)
    తన తండ్రిని విడిచి నీకోరకై వచ్చిన (2)
    క్రీస్తు పై
                                      || ఎందుకమ్మా||

Inti Meeda Nunna Ontari | ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను (2)
నా యేసయ్యా నా బలమా (2)
నా దీన ప్రార్థన ఆలకించుమా 
                                   ||ఇంటి మీద||
1. వెటకాని బాణమును చేయుచుండె గాయములు
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును (2)
    నీ బలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)
    ఆలకించుమా ఆదరించుమా (2)
                                  ||ఇంటి మీద||
2. తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
     తరచి తరచి చూచినా తరగవు నా దోషములు (2)
     నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
     ఆలకించుమా ఆదరించుమా (2) 
                                  ||ఇంటి మీద||

Taluchukunte Chalunu O Yesu Nee Prema | తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ

తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ
జలజల జల రాలును కృతజ్ఞతా కన్నీళ్ళ
తలుచుకొంటే చాలును కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము ఇది కల్వరి స్వరము

1. నీ మోమున ఊసిన ఉమ్ములు
    నా మోహపు చూపు తుడిచెను
    నీ చెంపను కొట్టిన దెబ్బలు
    నా నోటిని శుద్ధి చేసెను (2)
    నీ శిరస్సున గుచ్చిన ముండ్లు
    నా మోసపు తలపును త్రుంచెను (2)
    ఎంత త్యాగపూరితమో నీప్రేమా...
    ఎంత క్షమాభరితమో నీప్రేమా…

2. నీ దేహము చీరిన కొరడా -
    నా కామమును చీల్చెను -
    నీ చేతుల కాళ్లకు మేకులు -
    నా చీకటి దారి మూసెను (2)
    సిలువ నెత్తుటి ధారలు
    నా కలుషమును కడిగి వేసెను (2)
    ఎంత త్యాగపూరితమో నీప్రేమా...
    ఎంత క్షమాభరితమో నీ ప్రేమా…

22 February 2021

Yesu Goriya Pillanu Nenu | యేసు గొరియ పిల్లను నేను

యేసు గొరియ పిల్లను నేను - 
వధకు తేబడిన గొరియ పిల్లను
దిన దినము చనిపోవుచున్నాను - 
యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను

నా తలపై ముళ్ళు గుచ్చబడినవి - 
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది - 
నా చూపులు తలదించుకున్నవి (2) ||యేసు||

నా చేతులు సంకెళ్ళు పడినవి - 
నా వ్రాతలు చెదిరిపోవు చున్నవి(2)
నా కళ్ళకు మేకులు దిగబడినవి - 
నా నడకలు రక్తసిక్తమయినవి (2) ||యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇

05 January 2021

Gadachina Kaalam Krupalo | గడచిన కాలము కృపలో మమ్ము


గడచిన కాలము కృపలో మమ్ము - 
దాచిన దేవా నీకే స్తోత్రము -
పగలూ రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము (2) 
మము దాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున - కన్న తండ్రివైనను ఆదరించిన -
కలుషము నాలో కానవచ్చినా - కాదనక నను కరుణించిన (2) 
కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను - ధాతృత్వముతో నను నడిపించినా -
అవిధేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసిన (2) 
దీవించిన దేవా నీకే స్తోత్రము - దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||
DOWNLOAD MP3 SONG HERE 👇

31 July 2020

Chaalunaya Chaalunaya Nee Krupa | చాలునయ్యా చాలునయ్యా

చాలునయ్యా చాలునయ్యా 
నీ కృప నాకు చాలునయ్యా (2) 
ప్రేమామయుడివై ప్రేమించావు -
కరుణామయుడివై కరుణించావు 
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే 
ప్రేమ కరుణ నీ కృప చాలు (2) 

1. జిగటగల ఊబిలో పడియుండగా 
    నా అడుగులు స్థిరపరిచి నిలిపితివయ్యా
    హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా 
    హిమము కంటెను తెల్లగా మార్చయ్యా 
    నీకేమి చెల్లింతు నా మంచియేసయ్యా 
    నా జీవితమంత అర్పింతు నీకయ్యా (2)   ||ప్రేమ||

2. బంధువులు స్నేహితులు త్రోసేసినా 
    తల్లిదండ్రులే నన్ను వెలివేసినా 
    నన్ను నీవు విడువనె లేదయ్యా 
    మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా - 
    నీకేమి చెల్లింతు నా మంచి యేసయ 
    నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా (2)    ||ప్రేమ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...