Showing posts with label హల్లెలూయ యని పాడి స్తుతింపను రారె. Show all posts
Showing posts with label హల్లెలూయ యని పాడి స్తుతింపను రారె. Show all posts

24 June 2021

Halleluya Yani Padi Sthuthinpanu | హల్లెలూయ యని పాడి స్తుతింపను రారె

హల్లెలూయ యని పాడి స్తుతింపను – రారె జనులారా మనసారా ఊరూర
రారే జనులార నొరార ఊరూర

1. పాడి పంటలనిచ్చి – పాలించి దేవుడని – కూడు గుడ్డల నిచ్చి పోషించు దేవుడని – తోడు నీడగ నిన్ను – కాపాడు దేవుడని
పూజించి – పూజించి – పాటించి – చాటించ రారె

2. తాతత ముత్తాతలకన్న – ముందున్న దేవుడని – తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని – కల్లాకపటములేని – కరుణ సంపన్నుడని
పూజించి – పూజించి – పాటించి – చాటించ రారె

3. బందూ మిత్రులకన్నా – బలమైన దేవుడని – అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని – కన్నబిడ్డలకన్న – కన్నుల పండుగని
పూజించి – పూజించి – పాటించి – చాటించ రారె

4. రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని – నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని
పూజించి – పూజించి – పాటించి – చాటించ రారె

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...