Showing posts with label Bro. Yesanna songs lyrics. Show all posts
Showing posts with label Bro. Yesanna songs lyrics. Show all posts

05 March 2022

Preme shashwathamaina | ప్రేమే శాశ్వతమైన

ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2)
మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే
నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె
నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
 
1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం -
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2)
ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి 
ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను
ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా  ||ప్రేమే|| 
 
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో 
ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2)
కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము 
గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా  ||ప్రేమే|| 
 
3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో -  నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి 
నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే|| 

31 March 2021

Abrahamu Devudavu Essaku Devudavu | అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య

1.అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను  
   పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను   
   అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
   యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య

2.ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను   
   వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను   
   ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
   యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య

3.యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను   
   యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను   
   యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
   యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
DOWNLOAD MP3 SONG HERE 👇

29 March 2021

Naa hrudayamulo nee matale | నా హృదయములో నీ మాటలే

నా హృదయములో నీ మాటలే -
నా కనులకు కాంతిరేఖలు (2) 
కారు చీకటిలో కలువరి కిరణమై 
కఠినహృదయమును కరిగించినావు 
నీ కార్యములను వివరింపతరమా 
నీ ఘనకార్యములు వర్ణింపతరమా

1.మనసులో నెమ్మదిని కలిగించుటకు - 
మంచువలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టివేసి -
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువగల భూమిగా మార్చినావు ||నీ కార్యముల||

2.విరజిమ్మె ఉదయకాంతిలో -
నిరీక్షణ ధైర్యమును కలిగించితివి (2)
అగ్నిశోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్థంభముపై నను నిలిపినావు ||నీ కార్యముల||

3.పవిత్రురాలైన కన్యకగా -
పరిశుద్ధ జీవితం చేయుటకు (2)
పావన రక్తముతోకడిగి -
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి - 
సుగుణాల సన్నిధిలో ననునిలిపినావు ||నీ కార్యముల||
DOWNLOAD MP3 SONG HERE 👇

28 March 2021

Naa Arpanalu Neevu Parishudha | నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద (2)
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని (2)

1. ఆధారణలేని ఈ లోకములో -
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే (2)
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో -
అరణ్యవాసమే నాకు మేలాయెనే  (2)  ||నా అర్పణలు||

2. గమ్యమెరుగని వ్యామోహాలలో-
గురి నిలిపితినే - మార్గము చూపిన నీపైనే (2)
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో-
షాలేము నీడయే నాకు మేలాయెనే (2) ||నా అర్పణలు||

3. మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే (2)
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో -
సీయోను ధ్యానమే నాకు మేలాయెను (2) ||నా అర్పణలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

27 March 2021

Ee roju sajeevuniga neelo | ఈ రోజు సజీవునిగా నీలో జీవింప

ఈ రోజు సజీవునిగా నీలో జీవింప చేసితివే
కృతజ్ఞత స్తుతి చెల్లింతునయ్యా - 
నిత్యమూ నీసన్నిధిలో (2)

1.ఆకర్షించేను నీప్రేమ నన్ను -
సుందరుడా మనోహరుడా (2)
యేసయ్య నీ ప్రేమలోనే - 
మనసుకి నెమ్మది - ఆదరణ దొరికే (2)
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా ||ఈ రోజు||

2.మరుగైయున్న పరలోక సంగతులు -
పామరుడను నాకు తెలియజేసితివి (2) 
ఆత్మదీపం వెలిగించి నాలో -
నీతో నడచుటకు - కృపచూపితివే ( 2)
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా ||ఈ రోజు||

3.నూతన యెరూషలేము నా నివాసమని -
నూతన సృష్టిగా నన్ను మార్చినావు (2)
నూతన వధువుగా సిద్ధపడుచు -
ఎదురుచూస్తూ - జీవింతునయ్యా (2)
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా ||ఈ రోజు||

26 March 2021

Aanadam Neelone Aadharam | ఆనందం నీలోనే ఆధారం నీవేగా

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా ​స్తోత్రార్హుడా (2)
అర్హతే లేనినన్ను ప్రేమించినావు -
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై ||ఆనందం||

1. పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2)
కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా ||ఆనందం||

2. నిరంతరం నీవే వెలుగుని - నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2)
నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే - జీవ వాక్యమే ||ఆనందం||

3. సర్వ సత్యమేనా మార్గమై - సంఘ క్షేమమేనా ప్రాణమై (2)
లోకమహిమ చూడక - నీజాడను వీడక (2)
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో
నీ దర్శనం నా ఆశయం ||ఆనందం||

DOWNLOAD MP3 SONG HERE 👇

25 March 2021

Aananda Yathra Idi Aathmiya | ఆనంద యాత్ర ఇది ఆత్మీయ

629

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుషలేము యాత్ర
మన యేసుతో నూతన యెరుషలేము యాత్ర||ఆనంద||
 
1. యేసుని రక్తము - పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును (2)  ||ఆనంద||

2.రాత్రియు పగలును - పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా (2)  ||ఆనంద||

3. కృతజ్ఞత లేని వారు - వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై - కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద||

4.ఆనందం ఆనందం - యేసుని చూచే క్షణం ఆసన్నం (2)
ఆత్మానంద భరితులమై - ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద||
---------------------------------------
Aananda Yathra - Idi Aathmeeya Yathra
Yesutho Noothana Yerushalemu Yathra
Mana Yesutho Nuthana - 
Yerushalemu Yathra  ||Aananda||

Yesuni Rakthamu - Paapamulanundi Vidipinchenu (2)
Veyi Nollatho Sthuthinchinanu - Theerchalemu Aa Runamunu (2) ||Aananda||

Raathriyu Pagalunu - Paadamulaku Raayi Thagalakunda (2)
Manaku Paricharya Cheyuta Korakai - Deva Duthalu Manakundagaa (2) ||Aananda||

Kruthagnatha Leni Vaaru - Velakoladiga Kulinanu (2)
Krupaa Vaakyamunaku Saakshulamai - Krupa Vembadi Krupa Pondedamu (2) ||Aananda||

Aanandam Aanandam - Yesuni Chooche Kshanam Aasannam (2)
Aathmananda Bharithulamai - Aagamanakankshatho Sagedam (2) ||Aananda||
DOWNLOAD MP3 SONG HERE 👇

08 March 2021

Siyonulo nundi neevu | సీయోనులో నుండి నీవు

సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై - సదాకాలము 
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై -
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా 
నడిపించుచున్నావు నీ కీర్తికై -
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
 
1. నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి - ఉన్నత విజయము నిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు  ||సీయోనులో||
 
2. నాయందు దృష్టి నిలిపి - నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపావరములతో నను నింపి - సత్యసాక్షిగా మార్చితివి (2)
నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం - నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||
 
3. నీ దివ్యమైన మహిమను - పరలోకమందు నేచూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని - ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను 
నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||
DOWNLOAD MP3 SONG HERE 👇

16 November 2020

Neeve Naa Santhosha Gaanamu | నీవేనా సంతోషగానము

నీవేనా సంతోషగానము.. రక్షణశృంగము.. మహాశైలము.. (2)
బలశూరుడా.. యేసయ్యా నా తోడై - ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు (2) ||నీవేనా||

1. త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువైయుండగా - 
నిజస్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం - శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవేనా||

2. వేదన కలిగిన దేశమందు - వేకువ వెలగై నిలిచినావు - విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసన మిచ్చినావు (2)
మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం 
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవేనా|| 

3. నిర్జీవమైన లోయయందు - జీవాధిపతివై వెలసినావు -
దీనశరీరం మహిమశరీరముగా నీ వాక్కుతో - మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లెలూయా .. హల్లెలూయా .. నీవే రారాజువు
హొసన్నా .. హోసన్నా ... నీవే రారాజువు(2) ||నీవేనా||
DOWNLOAD MP3 SONG HERE 👇

02 November 2020

Siyonulo sthiramaina punadhi | సీయోనులో స్తిరమైన పునాది

సీయోనులో స్తిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము - అమర్చుచున్నావు (2) ||సీయోనులో||
 
1.సూర్యుడులేని చంద్రుడులేని - చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా - నా యేసయ్యా(2) ||సీయోనులో||
 
2.కడలిలేని కడగండ్లులేని - కల్లోల స్థితిగతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో నడిపించెదవా - నా యేసయ్యా (2)   ||సీయోనులో||
 
3.కలతలులేని కన్నీరులేని - ఆకలి దప్పులు అసలేలేని (2)
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా 
నా యేసయ్యా(2) ||సీయోనులో||
 
4.సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము (2)
సౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే ||సీయోనులో||
____________________________________
Siyonulo sthiramaina punadi neevu neemeede naajeevithamu
amarchuchunnavu(2)

Suryudu leni chandrudu leni -
cheekati raathrulu lene leni (2)
aa divya nagarilo kaanthulanu virajimmedava -
naa yesayya (2) ||siyonulo||

Kadali leni kadagandlu leni 
kallola sthithi gathulu darike raani (2)
suvarna veedhulalo nadipinchedava 
naa yesayya (2) ||siyonulo||

Kalathalu leni kanneru leni - 
aakali dappulu asale leni (2)
nee shaswatha raajyamukai - samakurchu chunnava naa yesayya (2) ||siyonulo||

Sangha prathiroopamu parama yerushalemu(2)
soundarya siyonulo - nee manoharamaina mukhamu darshinthunu (2) 
Neethone naa nivasamu - nithyamu aanandame ||siyonulo|
DOWNLOAD MP3 SONG HERE 👇

31 July 2020

Junte thene daralakanna | జుంటి తేనె ధారలకన్న

జుంటి తేనె ధారలకన్న - యేసు నామమే మధురం యేసయ్య సన్నిధి నే మరువజాలను 
జీవితకాలమంతా ఆనందించెద - 
యేసయ్యనే ఆరాధించెద  ||జుంటి||

1.యేసయ్య నామమే - బహు పూజనీయము - నా పై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి (2) 
నన్నెంతగానో దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటి||
 
2.యేసయ్య నామమే - బలమైన దుర్గము - నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి - పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)  ||జుంటి||
 
3. యేసయ్య నామమే పరిమళతైలము - నాలో నివసించి సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసే (2)  ||జుంటి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...