Showing posts with label Enni thalachina edi adigina lyrics. Show all posts
Showing posts with label Enni thalachina edi adigina lyrics. Show all posts

18 August 2020

Enni Thalachina Edi Adigina | ఎన్ని తలచినా ఏది అడిగినా

ఎన్ని తలచినా - ఏది అడిగినా- జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై వేచియుంటిని నాప్రార్థన ఆలకించుమా
ప్రభువా - నా ప్రార్థన ఆలకించుమా      ||ఎన్ని||

1. నీ తోడులేక - నీ ప్రేమలేక - 
    ఇలలోన ఏప్రాణి నిలువలేదు 
    అడవి పువ్వులే - నీ ప్రేమ పొందగా (2) 
    నా ప్రార్థన ఆలకించుమా .. ప్రభువా(2)||ఎన్ని||

2. నా ఇంటి దీపం నీవే అని తలచి - 
    నా హృదయం నీ కొరకు పదిలపరచితి 
    ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
    వెలిగించుము నీ ప్రేమతో.. ప్రభువా (2)||ఎన్ని||

3. ఆపదలు నన్ను వెన్నంటియున్న - 
    నా కాపరి నీవై - నన్నాదుకొంటివి 
    లోకమంతయు నన్ను విడిచినా (2)
    నీ నుండి వేరు చేయవు.. ప్రభువా (2) ||ఎన్ని||

4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి - 
    నా కొరకై కల్వరిలో యాగమైతివి 
    నీదు యాగమే నాదు మోక్షము 
    నీ యందే నిత్య జీవము.. ప్రభువా (2)  ||ఎన్ని||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...