Showing posts with label Siluvapai Prabhu Yesu Palukulu lyrics. Show all posts
Showing posts with label Siluvapai Prabhu Yesu Palukulu lyrics. Show all posts

30 May 2021

Siluvapai Prabhu Yesu Palukulu | సిలువ పై ప్రభు యేసు పలుకులు

సిలువ పై ప్రభు యేసు పలుకులు - విలువ కలిగిన దివ్యవాక్కులు 
హృదయమును కరిగించు సూక్తులు - ఎదగదిని వెలిగించు దివ్వెలు 
                                                   ||సిలువ||
1. కఠిన శ్రమ కలిగించు యూదులను క్షమియింప
 తండ్రినడిగిన యేసు పలుకులు 
శరణు కోరిన దొంగకభయమిచ్చి పరమ పురికి చేర్చిన దివ్యవాక్కులు 
                                                   ||సిలువ||
2. నా దేవ నన్నేల విడనాడితివియని వేదనొందిన యేసు పలుకులు 
ఇదిగో నీ తల్లియని శిష్యుడొకనికి మరియ నప్పగించిన దివ్యవాక్కులు 
                                                   ||సిలువ||
3. ఎర్రటెండలో కొయ్య సిలువ పై వ్రేలాడి దాహమనిన యేసు పలుకులు 
నా ఆత్మ గైకొనుము నా పని సమాప్తమని తలను వాల్చిన దివ్య వాక్కులు
                                                   ||సిలువ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...