Showing posts with label Yesayya naa hrudaya spandana lyrics. Show all posts
Showing posts with label Yesayya naa hrudaya spandana lyrics. Show all posts

17 August 2020

Yesayya Naa Hrudaya Spandana | యేసయ్యా నా హృదయ స్పందన

యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా -
విశ్వమంతా నీ నామము.. ఘననీయము ||యేసయ్యా||

1. నీవు కనిపించని రోజున - ఒక్క క్షణమొక యుగముగ మారెనే
నీవు నడిపించిన రోజున - యుగయుగాల తలపు మది నిండినే (2)
యుగయుగాల తలపు మది నిండినే  ||యేసయ్యా||
 
2. నీవు మాట్లాడని రోజున - నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున - నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
 
3. నీవు వరునిగ విచ్చేయు వేళ - నా తలపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగ - యుగ యుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే  ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...