Showing posts with label Thanamaatanu Aalakinchi Thanabaatanu lyrics. Show all posts
Showing posts with label Thanamaatanu Aalakinchi Thanabaatanu lyrics. Show all posts

28 May 2021

Thanamatanu Aalakinchi Thanabatanu | తనమాటను ఆలకించి తనబాటను పయనించి

తనమాటను ఆలకించి తనబాటను పయనించి 
తన నామము హెచ్చించి భయభక్తితో సేవించిన

 అ.ప. : దినములన్ని క్షేమముగా జరిగిపోవును
  వత్సరములు సుఖముగా దొరిలిపోవును 

1.గుడారములలోనుండి దుర్మార్గత తొలగించిన
 దుష్టత్వమునే విడిచి సత్పురుషుని ప్రార్థించిన
 మనవులన్ని మక్కువతో ఆలకించును 
 మార్గమంత వెలుగుతో ప్రకాశించును 

2.దేవుని ఉపదేశములను హృదయములో ఉంచుకొనిన 
సత్యం సహనం దయను కంఠమున ధరించుకొనిన
 సమాధాన సంతోషం వెంట వచ్చును 
శ్రేష్ఠమైన ఫలములే ఇంట నిలుచును 

3.పూర్ణ మనస్సుతో ఘనుడగు యేసుని పూజించిన
 లోకాశలవైపు తిరుగక ప్రభునందే జీవించిన
 కొట్లలోని ధనధాన్యం అధికములగును 
 సర్వశక్తుడైన దేవుని కరుణ కలుగును

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...