Showing posts with label Margamulanu srujinchuvadu jeevithalanu. Show all posts
Showing posts with label Margamulanu srujinchuvadu jeevithalanu. Show all posts

10 May 2023

Margamulanu srujinchuvadu jeevithalanu మార్గములను సృజించువాడు జీవితాలను

మార్గములను సృజించువాడు - జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు -యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు - జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు - విజయమెప్పుడూ నాదే (2)

ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను||

జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...