Showing posts with label Prabhuva ne ninnu nammi lyrics. Show all posts
Showing posts with label Prabhuva ne ninnu nammi lyrics. Show all posts

20 August 2020

Prabhuva Ne Ninnu Nammi | ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను

ప్రభువా ! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు 

1. గర్విష్ఠులైనవారు - నాతో పోరాడుచుండ
    ప్రతిమాట కెల్లవారు - పరభావ మెంచుచుండ 
    ప్రభువా! నా ప్రక్కనుండి - నన్ను తప్పించినావు

2. నేనెందుపోదుమన్నా - గమనించుచుండువారు 
    నా వెంట పొంచియుండి - నన్ను కృంగదీయ నెంచ
    ప్రభువా! నా ప్రక్కనుండి - నన్ను తప్పించినావు 

3. పగబూని వారు నన్ను - హతమార్చ జూచియున్న
    మరణంబునుండి నన్ను - కడువింత రీతిగాను
    ప్రభువా ! నా ప్రక్క నుండి - నన్ను తప్పించినావు 

4. జీవంపు వెల్గునైన - నీ సన్నిధానమందు
    నే సంచరించునట్లు - నే జారిపోకుండ
    ప్రభువా ! నా ప్రక్కనుండి - నన్ను తప్పించినావు

5. నన్నాదుకొంటి నీవు - నన్నాదరించినావు
    కొన్నావు నీవు నన్ను - మన్నించినావు నీవు 
    ఎన్నాళ్ళు బ్రతికి యున్న - నిన్నే సేవింతు దేవా ! 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...