Parishudhi Parishudhi | పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

504
పరిశుద్ధుల ప్రకాశత
రా -మారువ (చాయ:నీ కన్న యిక వేరె) తా - త్రిపుట

పరిశుద్ధి పరిశుద్ధి - పరిశుద్ధి యని వినఁ - బడు పుర మదిగో పద పదరే ప్రియులారా = పరమేశ్వరుని చేతఁ - బరిపాలనముఁ గల్గి - చిరమై - భాసురమై - సు - స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||

1. ¹రవితోను ²కుముదబాం - ధవుతోను మఱి దీప - ³చ్ఛవితోను దాని కవ - సర మింతలేదు =  ⁴అవిరతమునఁ గ్రీస్తుఁ - డందుండుఁ ⁵ప్రభతో  ⁶సం - స్తవమై ⁷వైభవమై యు - త్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||

2. గొదయైన మఱియే యా - పదయైన దగయైన - మొదలే లేకుండు న ప్పుర వాసు లందు = మృదు జీవోదకము ల - ర్మిలి నిరంతర మిచ్చు - గుదురుగ నెదురుగఁ - గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||

3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి - శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట = సుభయ తీరములందు - నుండు వృక్షములు సౌ - రభదీప్త శుభములై - రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||

4. జననంబు మరణంబు - సంసార సుఖబాధ - లనుభవించుట గల్గ - దా పురమునందు = మును నీతి కొఱ కాప - దను బొందు తనవారి - కనునీ ళ్లన్నియు దుడుచు - మన దేవుఁ డందుండి ||పరిశుద్ధి||

5. వెలకంద రాని ని - శ్చలమైన ఘన జీవ -  విలపత్కిరీటము - ల్గల వప్పుర - మునఁ = బిలిచి నప్పుడే విభుని - పెండ్లి విందున కేగు - కుల బంధువులకు ని - చ్ఛల నిచ్చు దేవుఁడు ||పరిశుద్ధి||
– పురుషోత్తము చౌదరి
________________________________
¹సూర్యుడు. ²చంద్రుఁడు. ³శాంతి. ⁴శాశ్వతముగా. ⁵శాంతి ⁶స్తోత్రములతో నిండినది. ⁷భాగ్యముగలది. ⁸ప్రకాశమానమైన.
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: