Showing posts with label పులిపాక జగన్నాథము. Show all posts
Showing posts with label పులిపాక జగన్నాథము. Show all posts

15 June 2023

Hrudayamanedu thalupunodha హృదయ మనెడు తలుపు

310
యేసు హృదయద్వారమును తట్టుట 
రా - భైరవి,   తా - ఆది

హృదయ మనెడు తలుపునొద్ద - యేసు నాధుండు = నిలచి సదయుడగుచు దట్టు చుండు - సకల విధములను ||హృదయ||

1.పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ = నతడు పరుడుగాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు ||హృదయ||

2.కరుణాశీలుం డతడు గాన - గాచి యున్నాడు = యేసు - కరుణ నెఱిగి గారవింప - గరము న్యాయంబు ||హృదయ||

3.ఎంతసేపు నిలువబెట్టి - యేడ్పింతు రతని = నాత - డెంతో దయచే బిలుచు చున్నా - డిప్పుడు మిమ్ములను ||హృదయ||

4.అతడు మిత్రు డతడు మిత్రు - డఖిల పాపులకు = మీర లతని పిలుపు వింటి రేని - యతడు - ప్రియుడగును ||హృదయ||

5.జాలిచేత దన హస్తముల - జాపి యున్నాడు = మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కని పెట్టు ||హృదయ||

6.సాటి లేని దయగల వాడు - సర్వేశు సుతుడు = తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు || హృదయ||

7.చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు = నతడు - చేర్చు కొనుచు మీకిచ్చును - చిర జీవము గృపను ||హృదయ||

8.అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు = మీర - లతని హత్తుకొందు రప్పు - డానందముతోడ ||హృదయ||

9.బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించి చూడ = గాన బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి ||హృదయ||
                                  - పులిపాక జగన్నాదము

18 August 2021

Goppa Deva Neevu Naa Thandrivi | గొప్ప దేవ నీవు నా తండ్రివి

60
నీవు నా తండ్రివి
రా – ఆనంద భైరవి, తా – ఆది
                  
గొప్ప దేవ నీవు నా తండ్రివి - యకాశమందు - గొప్ప దేవ నాకుఁ దండ్రివి = తప్పకుండ వత్తు నీ - దరికి యేసు నామమందు - గొప్ప కరుణ చేత న - న్నిప్పుడు తగఁ జేర్చుకొనుము || గొప్ప ||

1. నీవు మిగుల గొప్ప వాఁడవు - నా సృష్టి కర్త - యీవు లెపుడు నిచ్చు వాఁ డవు = భావమందు నినుఁ దలంచి - పావనాత్మ నాకు నిచ్చి - జీవమార్గమందు నిలిపి - కావు మనుచు వేఁడుకొందు || గొప్ప ||

2. చిన్నవాని నంగి ప్రార్థన - నీ లోకమందు - మున్ను దయను నిన్న వాఁడవు సన్నుతుఁడగు యేసు నీదు - సన్నిధి నున్నాఁడు గాన - నన్నుఁ గనికరించు మనుచు నమ్మి వత్తు నిపుడు || గొప్ప||

3. విలువ గల్గు నీదు నాజ్ఞలు - నా హృదయమందు - బలు విధములఁ దలఁ చు చుందును = బలుకులందుఁబనులయందు - బలముఁ జూపి నిన్ను గొలిచి - యిలను నిన్నుఁ బ్రీతిపరుతు - నలయక నీ కరుణ మెయిని || గొప్ప||

4. మీఁది రాజ్యమందుఁ జేర్చుము - కరుణాసముద్ర - బీద నైన నన్నుఁ గరుణచే = సోదరులను గూడికొనుచు - మోద మొప్పఁగ నీదు సేవఁ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి || గొప్ప ||
                            - పులిపాక జగన్నాథము

10 August 2021

Naa kaalagathu levvi | నా కాలగతు లెవ్వి నా చేతులను

13
నీవే నా సహాయుడవు
 రా - శంకరాభరణము, తా - త్రిపుట
 (చాయ: మన మొదటి తలిదండ్రుల్)

నా కాలగతు లెవ్వి - నా చేతులను లేవు - నాదు దేవ = యెపుడు - నీకే వాని మీద - నిత్యాధికారంబు - నిల్చియుండు || నా ||

1.తల్లిగర్భంబున - దసర సృజించితివి - ధరణి నన్ను = నీవు - తల్లికన్నను మిగుల దయచేతఁ జూచితివి - తండ్రి నన్ను || నా ||

2.పాప కూపమునందుఁ - బడియుండఁగా నన్నుఁ - బారఁజూచి = చేయి చాపి యేసునిద్వార - చక్కఁగాఁ దెచ్చితివి - చాలు దేవ || నా ||

3.సుఖఃదుఖ కాలములు - శోధింపఁ - బంపుదువు  శోభాయుక్త = నాకు - సుఖముఁ గల్గజేయు - సొంపుగ వానిచే స్థూల శక్తి || నా ||

4.సకల కాలంబులం - జక్కఁగ లోఁబడి - నన్నుతింతు = నన్ను - ఆకలంకునిగాఁ జేయు - మనుచు వేఁడుచునుందు - నధికాసక్తి || నా ||  
- పులిపాక జగన్నాధము

27 June 2021

Naavanni Angeekarinchumi Deva | నావన్ని అంగీకరించుమి దేవా

441
సమర్పణము
రా - సౌరాష్ట్ర,   తా - ఆట

నావన్ని అంగీకరించుమి - దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ =  నావన్ని కృపచేత - నీవలన నొందిన - భావంబునను నేను - బహుదైర్యమొందెద

1.నీకు నా ప్రాణము - నిజముగ నర్పించి = నీకు మీదుగట్టి - నీ కొరకు నిల్పెద ||నావన్ని ||

2.సత్యంబు నీ ప్రేమ - చక్కగా మధి బూని = నిత్యంబు గరముల - నీ సేవ జేసెద ||నావన్ని||

3.నీ సేవ జరిగెడు - నీ ఆలయమునకు = ఆశచే నడిపించు - మరల నా పదముల ||నావన్ని|

4.పెదవులతో నేను - బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప = గలిగించు దృడభక్తి || నావన్ని||

5.నా వెండి కనకంబు - నా తండ్రి గైకొనిమీ = యావంత యైనను - నాశించ మదిలోన ||నావన్ని||

6.నీవు నా కొసగిన - నిర్మల బుద్దిచే = సేవ జేయగ నిమ్ము - స్థిరభక్తితో నీకు ||నావన్ని||

7.చిత్తము నీ కృపా - యత్తంబు గావించి = మత్తిల్ల కుండగ - మార్గంబు దెలుపుము ||నావన్ని||

8.హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి = పదిలంబుగా దాని - బట్టి కాపాడుము ||నావన్ని||
-  పులిపాక జగన్నాథము 
DOWNLOAD MP3 SONG HERE 👇

18 August 2020

Kudikoni yunnamu | కూడికొని యున్నాము

18
క్రైస్తవారాధన
రా - నురటి,   తా - త్రిపుట

కూడికొని యున్నాము - సంఘ ప్రభో - కూడికొని యున్నాము = తోడ నుండెద ననుచు నమ్ముచు - దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని||

1.ఎచట నా ప్రియ భక్తు - లెలమిఁ గూడియున్న నచటికి నేతెంతు - నని పల్కితి = విచట నుండు మమ్ము - వీక్షించి కృపచేత - నిపుడు దీవించు మీ - యేసు క్రీస్తునాధా ||కూడికొని||

2.గత కాలమందున - గాని చేఁతలచే దు - ర్గతి నొంది యుండఁగాఁ - గనుఁగొంటివి = శత సంఖ్య గల పాప - చయ మీవు క్షమియించి - యతి శాంతి నిడితివి - యాత్మ స్వరూపా ||కూడికొని||

3.నిరతము నీ ప్రేమ - నెనరున ధ్యానించి - పరమ ధర్మములందుఁ - బరతఁ గల్గి = యరులకు శుభములు - నిరతంబుఁ జేయఁగఁ - దిరత మా కొసఁగు ము - దేవుని ప్రియ తనయా ||కూడికొని||

4.అన్ని శోధనముల నన్ని విపత్తుల - నన్ని కాలములందు - నాదరించి నిన్ను నమ్మిన జనుల - నీ సందిటను జేర్చి - పన్నుగఁ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని||

5.అమలుఁడ నగు న - న్న నుకరించుం డనుచు - నాన తిచ్చినాఁడ - వాత్మ జులకు = నమల మార్గము నందు - నరుగంగ మాకీవు - విమలాత్మ దయ సేయు - వేగంబు మా తండ్రీ ||కూడికొని||
– పులిపాక జగన్నాధము
DOWNLOAD MP3 SONG HERE 👇

17 August 2020

Neevu thodaiunna chaalu | నీవు తోడైయున్న చాలు

413
యేసు తోడైయున్నఁ జాలును 
రా – బిలహరి, తా - త్రిపుట

నీవు తోడై యున్న చాలు - యేసు - నిత్యము నాకది మేలు = నీవు ధరణినుండు - నీచ పాపుల నెల్లగావ బ్రేమ వచ్చి - ఘన ప్రాణ మిడినట్టి నీవు ॥నీవు॥

1.నిను బోలు రక్షకుం డేడి - క్రీస్తు - నను బోలు పాతకుం డేడి = నిను నమ్ము వారలకు - నీవొసగుచుందువు - తనరం పాపక్షమ - దయ చేత నిలలోన ॥నీవు॥

2.నీపాటి బలవంతు డేడి - ప్రభు - నాపాటి దుర్బలుం డేడి = కాపాడు చుందువు - కలకాలమును నీవు - నీ పాద సేవకుల - నీ నేర్పు రంజిల్ల ॥నీవు॥

3.నీవంటి యుపకారి యేడి - కర్త - నావంటి కడు దీను డేడి = జీవుల కును గల్గు - జీవంబు లిచ్చుచు - జీవాధారము లొసగి - జీవుల బ్రోచెడి ॥నీవు॥

4.నీవంటి ధనవంతు డేడి - యేసు - నావంటి ధనహీను డేడి = ప్రోవు లై యున్నవి - యీవులు నీయందు - నీవు వాని నొసంగి నిరతంబు నను గావు ॥నీవు॥
- పులిపాక జగన్నాదము
DOWNLOAD MP3 SONG HERE 👇

Pampumu Deva Deevenalatho | పంపుముదేవా దీవెనలతో

614 
ముగింపు పాట
రా - శ్రీరాగము,  తా - ఆట

పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా = పంపుము దయ చేత పతిత పావన నామ - పెంపుగ నీసేవ - ప్రియ మొప్ప నొనరింప ||బంపు||

1.మా సేవ నుండిన - మావెల్తు లన్నియు = యేసుని కొఱకు నీ - వెసగ క్షమియించుచు ||బంపు||

2.వినిన సత్యంబును - విమలాత్మ మదినిల్పి = దిన దినము ఫలములు - దివ్యముగ ఫలియింప ||బంపు||

3.ఆసక్తితో ని - న్ననిశము సేవింప = భాసురంబగు నాత్మ - వాసి కెక్కగ నిచ్చి ||పంపు||
                             - పులిపాక జగన్నాథము
DOWNLOAD MP3 SONG HERE 👇

05 July 2020

Krotha yedu modalu | క్రొత్త యేడు మొదలు

603
క్రొత్త సంవత్సరము
రా - కాంభోజి, తా - త్రిపుట

క్రొత్త యేడు మొదలు బెట్టెను - మన బ్రతుకునందు - క్రొత్త యేడు మొదలు బెట్టెను = క్రొత్తమనసు తోడ మీరు - క్రొత్త యేట బ్రభుని సేవ - దత్తర పడకుండ జేయు - టుత్త మోత్తమంబు  జూడ ||క్రొత్త||

1.పొంది యున్న మేలు లన్నియు బొంకంబు మీఱ - డెందమందు స్మరణజేయుడీ = యిందు మీరు మొదలు బెట్టు - పందెమందు గెల్వ వలయు - నంద ముగను రవిని బోలి - నలయకుండ మెలయ కుండ ||క్రొత్త||

2.మేలు సేయ దడ వొనర్పగా - మీరెఱుగునట్లు  కాలమంత నిరుడు గడచెగా = ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయు - జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనత కొఱకు ||క్రొత్త|| 

3.బలము లేని వార మయ్యును - బల మొంద వచ్చు - గలిమి మీఱ - గర్త వాక్కును = నలయకుండ నడుగుచుండ - నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల - నెలమి మీరొనర్చు చుండ ||క్రొత్త||

4.ఇద్ధరిత్రి నుండు నప్పుడే- యీశ్వరుని జనులు - వృద్ధిబొంద జూడ వలయును = బుద్ధి నీతి శుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధ జేయ - శుద్ధు లైన వారిలో ప్ర - సిద్దులగుచు వెలుగవచ్చు ||క్రొత్త||

5.పాపపంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తు యేసు - ప్రాపు జేరి మీరు వేడగా = నేపు మీఱ దనదు కరుణ - బాప మంత గడిగివేసి - పాప రోగ చిహ్న లన్ని - బాపివేసి శుద్ధి జేయు IIక్రొత్త||
- పులిపాక జగన్నాధము
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...