Showing posts with label chaalunaya chalunaya telugu lyrics. Show all posts
Showing posts with label chaalunaya chalunaya telugu lyrics. Show all posts

31 July 2020

Chaalunaya Chaalunaya Nee Krupa | చాలునయ్యా చాలునయ్యా

చాలునయ్యా చాలునయ్యా 
నీ కృప నాకు చాలునయ్యా (2) 
ప్రేమామయుడివై ప్రేమించావు -
కరుణామయుడివై కరుణించావు 
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే 
ప్రేమ కరుణ నీ కృప చాలు (2) 

1. జిగటగల ఊబిలో పడియుండగా 
    నా అడుగులు స్థిరపరిచి నిలిపితివయ్యా
    హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా 
    హిమము కంటెను తెల్లగా మార్చయ్యా 
    నీకేమి చెల్లింతు నా మంచియేసయ్యా 
    నా జీవితమంత అర్పింతు నీకయ్యా (2)   ||ప్రేమ||

2. బంధువులు స్నేహితులు త్రోసేసినా 
    తల్లిదండ్రులే నన్ను వెలివేసినా 
    నన్ను నీవు విడువనె లేదయ్యా 
    మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా - 
    నీకేమి చెల్లింతు నా మంచి యేసయ 
    నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా (2)    ||ప్రేమ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...