Showing posts with label Ambara Veedhilo Tharaka Velasenu lyrics. Show all posts
Showing posts with label Ambara Veedhilo Tharaka Velasenu lyrics. Show all posts

01 June 2021

Ambara Veedhilo Tharaka Velasenu | అంబరవీధిలో తారక వెలసెను

అంబరవీధిలో తారక - వెలసెను తూర్పున వింతగ
యూదుల రాజుని పుట్టుక - లోకానికి ప్రకటించగ (2)

1.జ్ఞానులు తారను గమనించి - బెల్లెహేమునకు పయనించి (2)
శిశువును గని సంతోషించి - మ్రొక్కిరి కానుకలర్పించి (2) మ్రొక్కిరి కానుకలర్పించి..||అంబర||

2.అంధకారమును తొలగించి - హృదయపు దీపము వెలిగించి (2)
వాక్యమే ఇల నిజతారకలా - నడుపును మార్గము బోధించి (2) నడుపును మార్గము బోధించి..||అంబర||

3.జగతికి యేసును చూపించి - జనులకు రక్షణ చాటించి (2)
ప్రతి క్రైస్తవుడొక తారకలా - నిలవాలి వెలుగును పంచి (2) నిలవాలి వెలుగును పంచి..||అంబర||
DOWNLOAD MP3 SONG HERE👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...