Showing posts with label Na yesu na athma balama. Show all posts
Showing posts with label Na yesu na athma balama. Show all posts

18 August 2020

Na Yesu Na Athma Balama | నాయేసు నాయాత్మ

350
రక్షణ పొందిన పాపి
రా - ఆనందభైరవి, తా - కురుజంపై
(చాయ : ఈలాటిదా యేసు ప్రేమ)

నా యేసు నా యాత్మ  బలమా ! - నీదు - గాయంబులే నిలువ బలమైన స్థలము = సకలసృష్టి పునాదియపుడే - నాదు - సకల పాపములకై బలియైతి వేసు - సకల భూమ్యాకాశములును - సమము - గా గతించిన గాని నీ ప్రేమ నిలుచు ||నా||

1.నా తండ్రి ! నీ నిత్య కృపను - నెంచ - నా తరమ ? నీ ప్రేమహస్తముల జాచి = పాతకుల రండంచు బిలిచి - వేగ నీదు కృప రుచి జూపి జీవంబు నిచ్చు ||నా||

2.దరిలేని లోతైన ప్రేమా ! - నీలో - దురిత దుర్జీతి యెల్లను మునిగి పోవు = దరిలేని యుచిత కృప జాటు - నీదు - రక్తంబు నా పాపడాగులను గడిగె||నా||

3.ఈ ప్రేమ సాగరంబున నే - దుమికి - నా ప్రభుని యెదదూరి విశ్రాంతి నొంది = యేప్రొద్దు సంతసించెదను -  నన్ను - నా ప్రాణమును డాయదిక నరక మందు||నా||

4.నా శిరముపై నలలురేగి - యిలను - నా సత్తువయు స్నేహితులు నన్ను వీడి = నా సుఖమునా సంతసమును - బోయి - నను నీదు కృప నన్ను విడిపోదు తండ్రీ||నా||

5.నా హృదయమే నిలిచిపోనీ - నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ = ధర పునాదులే కరిగిపోనీ - యేసు - నిరతంబు నీ ప్రేమ నిలుచు నను బ్రోచు||నా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...