Showing posts with label telugu Christian song lyrics. Show all posts
Showing posts with label telugu Christian song lyrics. Show all posts

31 March 2025

Idi rakshana krupa kaalam ఇది రక్షణ కృపకాలం

 
ఇది రక్షణ కృపకాలం — ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక – మనస్సు మార్చుకోనీవిక (2)

1. రాజ్యముల రాజ్యముల్ – జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్ – ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2. దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే – యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన - అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు – భక్తులకు హింసలు ||ఇది||

4. క్రైస్తవుడా మేలుకో – సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు – ఆత్మయందే బలపడు ||ఇది||

24 January 2023

Naa mattukaite brathukuta| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే నాకు లాభము
నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||

నీ కృప నాకు చాలును ఇలలో
నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2)
నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||

నీవే నా గొప్ప కాపరివి
విడువను నను ఎడబాయనంటివి (2)
నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||

18 November 2020

Aashrayudaa mee daasudanu | ఆశ్రయుడా మీ దాసుడను

ఆశ్రయుడా - మీ దాసుడను ఆర్భాటముతో - ప్రహర్షింతును యెహోవ చేసిన - మేలులను నిత్య నిత్యము - నే తలంచెదను ||ఆశ్రయుడా||

హద్దులేని ప్రేమతో - హత్తుకొనను ఎంచలేని మేలులతో నింపును నిష్కళంక ప్రియుడు - మహిమ ప్రభువు ప్రేమతో మీ పాదం - పట్టుకొందును . ఆ ||ఆశ్రయుడా||

యెహోవా మీ కార్యములు - ఔనత్యముల్ శుద్ధుడా మీ కార్యములు - ఆశ్చర్యముల్ నిత్యుడా మీ న్యాయము ఎల్లప్పుడుండున్ భక్తుని గొప్పయింపు - భాగ్యమిదే..ఆ ||ఆశ్రయుడా||

నిత్యము బోధించి నడిపించుము నీ దృష్టియుంచి - ఆలోచన చెప్పుము నేను నడుచు మార్గము - నాకు చూపించుము- నమ్మి వచ్చితిని నీకృప చూపుము ..ఆ..||ఆశ్రయుడా||

చేయిపట్టి - నడిపించుము ప్రభువా నన్ను పిలిచి - సౌఖ్యము ననుగ్రహించి పాపములో పడకుండ - కాపాడు మమ్ము అనుగ్రహించుము - ఆనందమును .. ఆ ||ఆశ్రయుడా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...