Showing posts with label ద. Show all posts
Showing posts with label ద. Show all posts

01 June 2026

దేవా దీవించు మిప్పుడు Deva deevinchu mipudu

279
ప్రభురాత్రి భోజన మాచరించునపుడు దీవెన గోరుట 
(చాయ: దేవా యాశీర్వదింపుము)
రా - హునేని, తా - త్రిపుట 

దేవా దీవించు మిప్పుడు - దీన జనాళిన్ - గావ రా రమ్మెల్లప్పుడు = నీ వరగద్దెచుట్టు - నిజ దాసు లిటులఁ గూడి - పావన సంస్కారమును - బంచి పాలొందుచుండ ||దేవా||

1.మముఁ గావ నైదు గాయముల్ - బొందిన దేవ - సముఁడా నీ రక్త కాయముల్ = విమలింపు భక్తి ద్వారా - వీక్షించి మనసులందు - అమిత దుః ఖ మొందుటచే - నలిగిన భక్త జనులన్ ||దేవా||

2.నీ రాజ్యమునకు మముఁ జేర్ప - నిజము మా పాప - ఘోర శాపమ్ములన్ దీర్ప = నోరిమిచే మా కొరకు - దారుణముగ నొందిన - క్రూర మరణమును దలఁచి - కుములుచున్న హృదయులను ||దేవా||

3.కోరి నినుఁ గొలుచు భక్తుల - కోరిక లభివృద్ది - గా రాజిలఁజేయు శక్తుల = ధారాళముగ నొసంగు - ధనాత్ముండ నీ దివ్యా - కార మందుండి యీ సం - స్కార సమయమున మమ్ము ||దేవా||

4.మా దారిద్ర్యములు బాపనే - పాపభారంపు - మ్రాను నీ దివ్య మూపుననే = గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో - బాధ లొందితి వనుచు - బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||

5.నీ వీ విధంపు మరణముచే - నిజముగా మమ్ము - జీవింపఁజేసి నిల్పుటచే = పావనదేవ మే మీ - ప్రభు సంస్కారమ్ము మా - మా జీవాత్మ లాదరణకై - జే మనముగఁ గైకొనను ||దేవా||
- మురారి దావీదు 

దేవా శిశువుల దెచ్చితిమి Devaa shishuvula dechchitimi

272
శిశు బాప్తీస్మము
రా - నాథనామక్రియ, తా - ఆట 

దేవా శిశువుల దెచ్చితిమి - నీవు - దీవించువీరల - దివ్య కృపమీర||దేవ||

1.వీరు పొందిన బాప్తిస్మంబు - గురుతు - వీరు నీవా రన - విశదపరపంగా వీరిపైఁ గురిపించు దయను - వేగ - వీరికిఁ గలుగంగ - విజ్ఞాన ధనము||దేవ||

2.నీ వొసఁగు శిశువుల మాకు - దేవ నీవ చేర్చికొనుము - నీవ కాపాడు జీవ మార్గము నందు నిలుపు - నిత్య - జీవంబు దయచేసి - శ్రీ యేసు కఠినన్ ||దేవ||

3.విమలాత్మ బాప్తిస్మ మొసఁగి - వీరి - విమలులఁ జేయుము - ప్రీతిని దేవా - క్షమ భక్తిప్రేమ శాంతుల - నొసంగు - శ్రమముల వెలుఁగంగ - సత్య సాక్షులుగా ||దేవ||

4.వీరలకుఁ దోడై యుండుము - తండ్రి - వీరలఁ జూడుము - వివిధ మార్గ ముల - వీరు లోకము విడుచు నపుడు - దయను - వీరలఁ జేర్చుము - విమ లానందమున ||దేవ||
- పులిపాక జగన్నాదాము 

31 May 2026

దేవుని సీయోన్ పురమా! Devuni Siyon puramaa

265
Glorious Things of Thee are 

1.దేవుని సీయోన్ పురమా! 
శ్రేష్టమౌ పట్టణమా! 
స్థావరంబైన పురమా! 
దేవుని నివాసమా! 

యుగముల శిలయైన 
దేవుడే నీ పునాదీ! 
శత్రువు జయించలేని 
రక్షణ నీ దుర్గము.

2.కాంచుమా సజీవధారల్ 
శాశ్వత ప్రేమధారల్ 
నీదు పుత్రికా పుత్రులన్ 
తృప్తిపర్చు ధారలన్ 

అలసి సొలయకుండ 
దాహమున్ దీర్చుధార 
దాతయౌ దేవుని కృప 
సర్వకాలంబు పారున్

3.కాంచుమా నీ యిండ్లమీద 
అగ్ని మేఘంబుల్దిగె 
ప్రభుని రాక సమయం 
బని మహిమ దెల్ప! 

ప్రార్థన ఫలంబులిచ్చి 
మన్నా నిచ్చిన ప్రభు 
సింహాసనాసీనుడై సు 
నాదుస్తోత్రంబుల్ వినెన్
- జాన్ న్యూటన్ 
- అను: పి. సి. బెన్నో 

దీవెనల నిడు దేవా నీదు Deevenala nidu deva needu

270
సంఘసేవకుల కొరకైన దీవెన 
(ఛాయ: కరుణా సాగర)
రా - ముఖారి,     తా - ఆది 

దీవెనల నిడు దేవా నీదు - సేవకై వెడలెడు దీనులపైఁ = పావనాత్మ నంపుము - పనులలో నడిపింపుము - కేవలంబుగ మా తనువులు నీ - సేవకై యర్పింప గజేయుము ||దీవెనల||

1.మాటిమాటికి బాపయుతంబౌ - మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి = మేటి క్రీస్తుని నామా - మృతముఁ గ్రోలుచు మేమా - పాటున నాత్మల రక్షణకై - పనులు సల్పగ బంపుము కృపచే ||దీవెనల||

2.దివ్య బోధ లెదను గల్గి - దీనతను రక్షణ మార్గమును = భవ్యముగ బోధింపఁ - బరమార్థ మెఱిగింప - సేవ్య నేర్పవె దిన దినమును నీ - సేవకాళికి నీ మర్మముల ||దీవెనల||

3.దురిత రోగాదులచే మిగులఁ - తూలి చను మనుజాళికి నీవే = పరమ విశ్రాంతి నిడు - వరదుఁడ వంచుఁగడు - వెరవునను బోధింపంగను నీ - వర ములతో నింపుము దాసులను ||దీవెనల||

4.గ్రామ సంఘంబులను బడుల - క్షేమముగఁ గాపాడి పెంప = ఓ మహాత్మ నీ కృప - తో మమ్ముఁ గాచి సదా - స్వామి మాలో నీవును నీలో మేము మనగను బ్రోవు మామేన్ ||దీవెనల||
- పంతగాని పరదేశి 

30 May 2026

దేవుని గ్రంధము దినదినము Devuni grandhamu dinadinamu

253
పరిశుద్ధ గ్రంథము 
రా - హి||భైరవి , తా - చాపు 

దేవుని గ్రంధము - దినదినము చదువుము = పావనమార్గము - జీవము సత్యము ||దేవుని||

1.ఎంచి తలంచుము - మించిన గ్రంథము = అంచితముగను రెం - డంచుల ఖడ్గము ||దేవుని||

2.తేనియమధురము - తినుము ప్రతిదినము = ధ్యానముసేయుము - దానన బ్రదుకుము ||దేవుని||

3.నాధుని వాక్యము - అరయుము భాగ్యము = పాదపు దీపము - భక్తుల కవచము ||దేవుని||

4.ఆత్మల శాంతము - అభయము శ్రేయము = ఆత్మలకు బలము - అనయము సౌఖ్యము ||దేవుని||

5.పాపము శాపము - పలువిధతాపము = పాపును వేగము - దాపున జేరుము ||దేవుని||

6.మదినిది నిరతము - పదిలము చేయుము = సదమల జ్ఞానము - సవిధము మోక్షము ||దేవుని||

05 October 2024

Devuni samukha jeeva kavilelo దేవుని సముఖ జీవ కవిలెలో

Devuni samukha jeeva kavilelo దేవుని సముఖ జీవ కవిలెలో

దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

1.జీవవాక్యము ఇలలో చాటుచు - జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

2.ఆకాశమండలములలో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

3.పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

4.దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

5.పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

16 May 2024

Daivathma parishudhuda dharala దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ

242
Come Holy Spirit Heavenly Dove

1.దైవాత్మ పరిశుద్ధుడా 
ధారాళ ప్రేమను 
దండిగ నిచ్చి మమ్మును 
దయన్ దీవించుము.

2.మా యజ్ఞానాంధకారము 
వ్రయము జేయుము 
నీ యెక్కువైన తేజము 
మా యందు పోయుము.

3.మా దర్గుణంబు లెల్లను 
చెదరఁ గొట్టుము 
మా పాప మణుపుటకై 
నీ శక్తిఁ జూపుము.

4.సన్మార్గమందు నిత్యము 
మమ్ము నడుపుము 
నీ మోక్షమందు పిమ్మట 
మమ్మాదరింపుము.
- ఐజాక్ వాట్స్ 
అను: జాన్ స్మిత్ వార్డ్ల్ 

Divya pavanathma nee yeevulanni దివ్య పావనాత్మ, నీ యీవు

241
Gracious Spirit, Holy Ghost

1.దివ్య పావనాత్మ, నీ 
యీవు లన్ని మంచివి 
నీదు ముఖ్యదానమీ 
-దివ్య ప్రేమయే-

2.ప్రేమ దయచూపును 
ప్రేమ దీర్ఘశాంతము 
మృతికన్న బలము 
-దివ్య ప్రేమయే-

3.కాలజ్ఞాన మంతయు 
కొట్టి వేయబడును 
ప్రేమ నిత్య ముండును 
-దివ్య ప్రేమయే-

4.దృష్టిగా విశ్వాసము 
మాఱఁగా నిరీక్షణ 
యనుభవమౌఁ గాని 
-దివ్య ప్రేమయే-

5.విశ్వాస నిరీక్షణ 
ప్రేమ లీ మూడుండును 
కాని శ్రేష్ఠమయినది 
-దివ్య ప్రేమయే-

6.పావనాత్మ! స్తోత్రము 
నీకుఁ జేయు వారము 
మాకు దయచేయుము 
-దివ్య ప్రేమయే-
- క్రిస్తఫర్ వర్డ్స్ వర్త్
అను: బర్నార్డ్ లూకాస్

Daivathma digumu dasula దైవాత్మా దిగుము దాసుల పైని

238
పరిశుద్ధాత్మ కొరకు వేడుట 
(చాయ: యేసు క్రీస్తుని గొల్వరన్న)
రా - మూఖరి, తా - ఆది 

దైవాత్మా దిగుము దాసుల పైని - నీ దయా దృష్టిఁ - పారజేయుము ప్రేమన్ నింపు = దేవా యాత్ముండ దిగుము మమ్ముల - శుద్ధీకరించుము - దయారసముచే ||దైవాత్మా||

1.దైవాత్మా దిగుము ప్రవక్తలు - పూర్వంబు నీదు -  ప్రేరణవలనఁ బ్రవచించిరి = పావురమా దిగి - మాలో వసించుము - పాపుము చీఁకటి - వెలుఁగుచు మాలో ||దైవాత్మా||

2.రమ్ము ఓ యున్నతంపు ఆత్మా - నాలుగు దెసల-నుండి మమ్ముల నావ రించు = రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు- గానగు లోకుల - మీదికి ముదమున ||దైవాత్మా||

3.మే మజ్ఞానాంధకారమునను - మునిఁగితిమి గాన - చెదరఁగఁజేయు మంధకారము = పామర జనులకుఁ బేర్మి-తో నొసఁగు ను - జ్ఞాన ప్రకా శము - నిల్పుము మాలో ||దైవాత్మా||
- మామిళ్ళ యెషయా

03 September 2023

Deevinchave samruddiga దీవించావే సమృద్ధిగా

దీవించావే సమృద్ధిగా - నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా - నీ కోసమే నను బ్రతకమని

దారులలో ఏడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో - అగ్ని స్తంభమై నను నడుపుమయా ||దీవించావే||

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో  నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిల సాగమని ||దీవించావే||

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో - నేనున్నా నీకని అన్నావే 
పోరులలో పోరాటములో - నా పక్షముగానే నిలిచావే ||దీవించావే||

18 June 2023

Dina dinamu sannidhiki దిన దినము సన్నిధికి


దిన దినము సన్నిధికి వస్తావమ్మా - క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా (2)
మనసే మారలేదు - నీ బ్రతుకే మార్చుకోవు (2) ||దిన దినము||
 
1.ఎవరైనా ఒక్కమారు దూషిస్తే - పదె పదె దూషిస్తూ ఉంటావే 
ఎవరైనా నీకు నచ్చకపోతే - బ్రతుకంతా ద్వేషిస్తూ ఉంటావే (2)
మోముపై ఊసిన - సహియించిన క్రీస్తు ప్రేమ
దేహమంతా గాయపరిచిన - క్షమియించిన యేసు ప్రేమ
ఏదమ్మా నీలో ఆ క్రీస్తు ప్రేమ - లేదమ్మా నీలో సహోదర ప్రేమ ||దిన దినము||
 
2.సంఘంలో శుద్ధంగా జీవిస్తావే - సమాజంలో మాదిరినీ కనుపరచవే 
నీ కొరకు క్రీస్తు పొందిన గాయములు - మాటి మాటికి రేపుచునే ఉంటావే (2)
నీ భారము మోసిన - క్రీస్తు కాడి మోయవా
నీకై మరణించిన - ప్రభుకై జీవించవా
 
ఏదమ్మా నీలో దైవ ప్రణాళిక - లేదమ్మా కొంతైనా విశ్వాసము

దిన దినము సన్నిధికి వస్తావమ్మా - క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా
మనసే మార్చుకోవాలి - నీ బ్రతుకే మాదిరవ్వాలి ప్రేమనే నీవు పంచి క్రీస్తు - స్వారుప్యంలో మారాలి (2)

30 March 2023

Daveedu suthuniki jayamu | దావీదు సుతునికి జయము జయం


దావీదు సుతునికి జయము జయం స్తుతులు చెల్లించెదం (2)
యేరుషలేముకు యేసునిరాక - ఆర్భాటముతో జరుగు వేడుక 
స్వరమెత్తి పాడాలి విజయ గీతిక - స్వరమెత్తి పాడాలి విజయ గీతిక
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
1.రాజుల రాజు సాత్వికుడై - నీతి సామ్రాజ్యపు స్థాపకుడై (2)
ఏతెంచుచుండెను నీ యొద్దకు - ప్రవచనము నెరవేర్చుటకు (2)
ప్రవచనములు నెరవేర్చుటకు 
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
2.కట్టబడియున్న గాడిదను - విప్పి తోలుకొని తెమ్మనెను (2)
కూర్చుండి సాగెను సీయోనుకు - సమాధానము ప్రకటించుటకు (2)
సమాధానమును ప్రకటించుటకు
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
3.బాలుర పసిపిల్లల నోట - ఉంచిన స్తోత్రధ్వనుల చేత (2)
స్థాపించియుండెను దుర్గమును - అణిచివేయను శత్రువును (2)
అణిచివేయుటకు శత్రువును
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||

02 March 2023

Dayaa Samkalpam lyrics| దయాసంకల్పం|Gaganamu chilchukoni | గగనము చీల్చుకొని

Dayaa Samkalpam - దయాసంకల్పం Hosanna Ministries 2023 new Album Song-6 Pas.Freddy Paul

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని నా హృదయమెంతో  ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది ||గగనము||
 
1.నీదయ సంకల్పమే నీప్రేమను పంచినది 
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా నీఎదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము||
 
2.నీమహిమైశ్వర్యమే జ్ఞానసపదనిచ్చినది (2)
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది
కళంకం లేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను (2)
యుగయుగాలు నీతో యేలెదను (2) ||గగనము||

3.నీ కృప బహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది (2)
తేజువాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||

Na korika nee pranalika నా కోరిక నీ ప్రణాళిక Daiva Pranalika దైవ ప్రణాళిక

Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7 

నా కోరిక నీ ప్రణాళిక - పరిమలించాలని 
నా ప్రార్ధన విజ్ఞాపన - నిత్య మహిమలో నిలవాలని (2)
అక్షయుడా నీ కల్వరి త్యాగం - అంకితభావం కలుగజేసెను 
ఆశలవాకిలి తెరచినావు - అనురాగ వర్షం కురిపించినావు (2)
 
నా హృదయములో ఉప్పెంగేనే - కృతజ్ఞత సంద్రమే 
నీ సన్నిధిలో స్తుతి పాడనా - నా హృదయ విద్వంసుడా ||నా కోరిక||
 
1.యధార్ధవంతుల యెడల - నీవు యడబాయక కృప చూపి 
గాడంధకారము కమ్ముకొనగా - వెలుగు రేఖవై ఉధయించినావు (2)
నన్ను నీవు విడిపించినావు - ఇస్టుడునై నే నడచి నందున 
దీర్గాయువుతో త్రుప్తిపరచిన - సజీవుడవు నీవేనయ్యా || నా హృదయములో ||
 
2.నాలో ఉన్నదీ విశ్వాస వరము - తోడై ఉన్నదీ వగ్ధన బలము 
దైర్యపరచి నడుపుచున్నది - విజయశిఖరపు దిశగా (2 )
అర్ప జాలని నీ ప్రేమతో - ఆత్మ దీపము వెలిగించినావు 
దీన మనస్సు వినయభావము - నాకు నేర్పిన సాత్వికుడ ||నా హృదయములో||
 
3.స్వచ్చమైన నీ వాక్యం - వన్నె తరగని నీ ఉపదేశం 
మహిమ కలిగిన సంఘముగా నను - నిలుపునే నీ ఎదుట (2)
సిగ్గుపరచదు నన్నేనడు - నీలో నాకున్న నిరీక్షణ 
వేచియున్నాను నీ కోసమే - సిద్ధపరచుము సంపూర్ణుడ ||నా హృదయములో||

06 December 2022

Devaloka mahimanantha | దేవలోక మహిమనంత
















దేవలోక మహిమనంత భూమిపైకి తెచ్చాడు -
దీనురాలు కడుపు నుండి యేసు ఉదయించాడు (2)
మనుజాళిపై ప్రేమతో దేవదేవుడు - నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు (2) 

కలిగెను విడుదల సంతోష క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

1.చీకటిని దూరంచేసి - దివ్యమైన కాంతినిచూపి -
ఎప్పుడూ మనతోడై నడిపిస్తాడు (2) 
కీడు ఏది రాకుండా దీవెనలు పోకుండా (2)
కంటిపాపలా కాచి భద్రంచేసే ప్రాణ ప్రియుడు 
కలిగెను విడుదల సంతస క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

2.పాపితోటి స్నేహం చేసి - పాపముల శిక్షను బాపి -
ఎప్పుడూ మన మధ్యే నివసిస్తాడు (2) 
లోటు చూడనీకుండా - ఆటంకాలు లేకుండా (2)
అన్నింటినీ సమకూర్చి సాయంచేసే ప్రాణ ప్రియుడు 
కలిగెను విడుదల సంతస క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

3.వేదనను మాయం చేసి- గుండెలోని బాధను మాన్పి -
ఎప్పుడూ మనతోనే పయనిస్తాడు (2)
శత్రుబారి పడకుండా - ఆశయాలు చెడకుండా (2)
చుట్టూ కేడెమైయుండి - కార్యంచేసే ప్రాణ ప్రియుడు 
కలిగెను విడుదల సంతస క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

26 November 2022

Daivame garbhavasiai | దైవమే గర్భవాసియై ఎన్నుకున్న

దైవమే గర్భవాసియై - ఎన్నుకున్న ఓ తల్లివై
ప్రభువు మెచ్చిన మహిళపై - ఆ ప్రభువుకే కన్నతల్లివై (2)
స్త్రీలలోనే దీవింపబడిన ఓ కన్యకా...
నీ ధైర్యమే ప్రతి మహిళకు ఆదర్శము 
నీ త్యాగమే ప్రతి తల్లికీ ఇల ధన్యము ||దైవమే||
 
1.దయాప్రాప్తురాలా నీకు శుభమని దూత చెప్పగా
శుభవచనమేమియని మరియు మదిలో యోచించగా (2)
దేవుని కృపనే పొందగా..
దేవుడు తోడై యుండగా...
పరిశుద్ధాత్ముడు రాగా..
సర్వోన్నత శక్తి కమ్మగా..
జన్మించువాడు పరిశుద్ధుడై దైవ తనయుడు అనబడును
అని దూత చెప్పిన మాటలకు
ప్రభు దాసురాలనని మరియ దైవ చితమునకు తలవంచెను ||దైవమే||
 
2.అణుకవయే ప్రతి మహిళకు అందము
అలంకారము స్వస్థబుద్దే ఆరోగ్యము దేవుడు మెచ్చే లక్షణము (2)
ప్రతి మహిళ ఒక మరియగా..
విశ్వాసులకు తల్లిగా..
ప్రభువు మెచ్చే ఇల్లాలిగా..
దైవ సన్నిదే నిలయముగా..
ప్రభువు నందు పరిశుద్ధులై ప్రభు ప్రేమతో వర్ధిల్లును వాక్యము గైకొను ధన్యులై ప్రభు సేవలో విలసిల్లును ||దైవమే||

13 November 2022

Drakshavallivi neevaithe | ద్రాక్షవల్లివి నీవైతే తీగెగ


ద్రాక్షవల్లివి నీవైతే - తీగెగ నేను ఎదిగితిని (2)
తండ్రి తోటలో నే నాటబడితి - ఎంత ధన్యత ఈ మహిలో (2) ||ద్రాక్షా||  

చల్ల గాలులు వీచగా -
కాంతి కిరణాలు ప్రసరించగా (2)
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటి యోరన నిలిచితిని (2) ||ద్రాక్షా||  

కొమ్మ కొమ్మను చూడగా -
తీగలెన్నో అగుపించెనే (2)
ఆకు మాటున తీగె గావున
మొలవనున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో (2) ||ద్రాక్షా||

29 October 2022

Daveedu kumaruda nanu | దావీదు కుమారుడా నను

దావీదు కుమారుడా - నను దాటిపొకయా 
నజరేతువాడా - నను విడిచిపోకయా 
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా 
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

1.గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా 
మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా 
కుంటి వాడినయ్య - నా తోడు నడువవా 

దావీదు కుమారుడా - నను దాటిపొకయా 
నజరేతువాడా - నను విడిచిపోకయా 
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా 
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

2.లోకమంత చూసి - నను ఏడిపించినా 
 జాలితో నన్ను - నీవు చేరదీయవా 
ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా

దావీదు కుమారుడా - నను దాటిపొకయా 
నజరేతువాడా - నను విడిచిపోకయా 
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా 
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

3. నా తల్లి నన్ను - మరచిపోయిన 
నా తండ్రి నన్ను - విడిచిపోయిన
తల్లితండ్రి నీవై నను లాలించుమా 

దావీదు కుమారుడా - నను దాటిపొకయా 
నజరేతువాడా - నను విడిచిపోకయా 
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా 
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

05 October 2022

Devuniki sthothramu SP Balu | దేవునికి స్తోత్రము పరిశుద్ధుడగు

దేవునికి స్తోత్రము 
పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము (2)

1.అనగుడగు తన తనయు కృతమున -
మునుపు భూ నభములను జీవుల (2) 
ఇలుని నక్షత్రాదులను 
మా మనుగడకు మేలోసగ చేసిన ||దేవునికి||

2.దినములను రాత్రులను ఋతువుల 
దివ్యమగు కార్తెలను నిలిపి (2) 
తనయులని బహు నెనరు తోడను -
ఘనముగా మము సృష్టి చేసిన ||దేవునికి||

3.తొల్లిటన్ నరజాతి శోధన వల్ల 
తన మార్గములు వీడి (2) 
తల్లడిల్లగ శాప మరణపు 
ముళ్ళు విరిచిన కర్తయగు ||దేవునికి||
DOWNLOAD MP3 SONG HERE 👇

09 August 2022

Dharuna magu marana | దారుణ మగు మరణ వారిధి

309
క్రీస్తు సువార్త
రా - ముఖారి, తా - త్రిపుట
(చాయ: ఉన్నపాటున వచ్చుచున్నాను)

దారుణ మగు మరణ - వారిధి దాఁట నె - వ్వారి శక్యము సోదర = ఘోర మగు కెరటములవలె వి - స్తారముగ నేరములు పైఁగొని - పారు చుండునప్పు డద్దరిఁ - జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

1.ఒక్క పెట్టున నెగసి - చక్క వెల్ళుద మన నీ - రెక్క లక్కఱకు రావు = ఎక్కడైనను నోడ గనుఁగొని - యెక్కిపోద మని తలంచినఁ - జెక్క నిర్మతమైన యోడ - లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

2.మంగళ ధ్వనులతో - శృంగారపురము వె - లుంగుచున్నది ముందట = పొంగి పారుచు మరణ నది త-రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి మనకు క్రీస్తు - సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

3.వాద రహితుండైన - యాది దేవుఁడు దాని - నాధుం డనం బరఁగును = బాధ లొందిన నరుల నందరిఁ - జేరఁదీసిన క్రీస్తు యేసు - నాధుఁడే నావి కుఁ డు క్రైస్తవ - వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

4.మానవు లందరు - మరణాంబుధిని దాఁట - మహనీయ మగు నావ యిదె = దీనిలో నెక్కుటకు ముందే - మానుగ వాక్యమును విని సు - జ్ఞాన మొందినవారు క్రైస్తవ - స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

5.విదితంబుగా నిందు - విజ్ఞాన బోదకుల్ - వినిపించుదురు వాక్యముఁ = గొదగొనిన యాత్మములు తృప్తిఁ - గొనును బ్రభు భోజనములోనే - హృదయములలో దేవునాత్మ - యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

6.పలువిధ సంగీత - ములతో సాగుచు మనము - నలయ కుండఁగఁ బోదు ము = బలముగల యీ - యలలు దాఁటి - పరమ పురద్వారముల వెలుపల - గలిసికొని పరిశుద్ధ జనమును - గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

7.కరుణామయుని సభలోఁ - జొరకపోయిన నిత్య - నరక మంత మందున మరియు నంత్య దినపు బాధలు - విరివిగ వినఁ గోరువారలు - మరణ మొందక మును ప్రత్యక్షీ - కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||
    – రావూరి దావీదు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...