Showing posts with label సంతోషముతో నిచ్చెడు. Show all posts
Showing posts with label సంతోషముతో నిచ్చెడు. Show all posts

21 August 2020

Santhoshamutho Nichedu | సంతోషముతో నిచ్చెడు

సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుడు  ప్రేమించున్ = వింతగవలసిన - దంతయు నొసంగును - వినయమనసుగల - విశ్వాసులకును||సంతో||
1.అత్యాసక్తితో నధిక ప్రేమతో - నంధకార జను లందఱకు = సత్య సువార్తను జాటించుటకై - సతతము దిరిగెడు - సద్భుక్తులకు  ||సంతో||

2.వేదవాక్యమును వేరు వేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు - బోధలు నేర్పెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతో||

3.దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటి దీర్చుటకై = నిక్కపు రక్షణ - నిద్దరలో నలు - ప్రక్కలలో బ్రక - టించుట కొఱకై ||సంతో||

4.ఇయ్యండీ మీకీయం బడునని - యియ్యంగల ప్రభు యేసనెను - ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియ్యవలెను మన - యీవుల నికను ||సంతో||

5.భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు - యుక్త  మటంచును - దారతతో - శక్తికొలది మన భుక్తి నుండి యా - సక్తితో నిరతము - నియ్య వలెను||సంతో||
   - మోచర్ల రాఘవయ్య

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...