Showing posts with label Gethsemane Thotalo Kristhesu Vedana lyrics. Show all posts
Showing posts with label Gethsemane Thotalo Kristhesu Vedana lyrics. Show all posts

29 May 2021

Gethsemane thotalo kristhesu vedana | గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన

గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన - మానవాళి విడుదల కొరకైన ప్రార్థన (2)
నీ కోసమే - నా కోసమే ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే (2)
 
1.ఘోరమైన శ్రమలెన్నో పొందాలని - 
కలువరి వరకు సిలువ మోయాలని (2)
ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను - 
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) ||నీ కోసమే||
 
2.కొంచెమైన మంచితనము లేని పాపిని - 
సంపూర్ణ స్వస్థతతో నింపాలని (2)
గాయములు పొందుటకు సిద్దమాయెను - 
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) ||నీ కోసమే||
 
3.క్షయమగు మనిషిని మహిమకు మార్చాలని - అక్షయమగు రాజ్యములో చేర్చాలని (2)
మరణంపు ద్వారమున ప్రవేశించెను - 
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) ||నీ కోసమే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...