Showing posts with label Chrismas songs. Show all posts
Showing posts with label Chrismas songs. Show all posts

30 November 2025

Sudinam janulaku సుదినం సర్వజనులకు సమాధానం

సుదినం సర్వ జనులకు 

సుదినం సర్వజనులకు - సమాధానం - సర్వ జగతికి
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు - 2 llసుదినంll

1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం ఆ.. ఆ.. (2)
పరముకు పధమై అరుదించె - వెలుగై యేసుడు ఉదయించె (2) llసుదినంll

2. కన్నీటితో నిండిన కనులన్ - యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. ఆ.. (2)
ఉదయించెను కాంతిగనాడు - విరజిమ్మెను శాంతిని నేడు (2) llసుదినంll

3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. ఆ.. (2)
త్వరలో వచ్చును ఆ ఱేడు - సిద్ధపడుమ ఇక యీనాడు - (2) llసుదినంll

16 December 2024

Aakasha veedhilo ఆకాశవీధిలో ఒక తార వెలిసింది

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది 

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది 
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది 
నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని 
నిత్యరాజ్యము చేర్చు టకై రక్షకుడుదయించాడని 
జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది 
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ 
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఆకాశ వీధిలో||

1. పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం - 
పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం (2) తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను - 
తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను (2)
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ 
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఆకాశ వీధిలో||

2. దివినేలే రారాజు దీనునిగా జన్మించెను - 
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము (2)
చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను - 
చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను (2) 
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ 
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ఎంతో ఉత్సాహమే

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...