Showing posts with label 180 మనస యేసు మరణ బాధ. Show all posts
Showing posts with label 180 మనస యేసు మరణ బాధ. Show all posts

16 August 2020

Manasa yesu marana badha | మనస యేసు మరణ బాధ

180
క్రీస్తు సిలువ బాధ 
రా - గాంధారి, తా - ఏక

మనస యేసు మరణ బాధ - లెనసి పాడవే - తన - నెనరు జూడవే యా - ఘనుని గూడవే = నిను - మనుప వచ్చె ననుచు నమ్మి మదిని వేడవే ||మనస||

1.అచ్చి పాపములను బాప - వచ్చినాడట - వా - క్కిచ్చి తండ్రితో - నా - గెత్సెమందున = తా - జొచ్చి యెదను నొచ్చి బాధ - హెచ్చు గనెనట ||మనస||

2.ఆ నిశీధ రాత్రి వేళ - నార్భటించుచు - న - య్యో నరాంతకుల్ - చే బూని యీటెలన్ = ఒక - ఖూని వాని వలెను గట్టి - కొంచు బోయిరా ||మనస||

3.పట్టి దొంగవలెను గంత - గట్టి కన్నులన్ - మరి - గొట్టి చెంపలన్ వడి - దిట్టి నవ్వుచున్ = నిను - గొట్టి రెవ్వ రదియు మాకు జెప్పు - మనిరట ||మనస||

4.ముళ్లతోడ నొక కిరీట - మల్లి ప్రభు తలన్ -  బెట్టి - రెల్లు కర్రతో నా - కల్ల జనములు = రా - జిల్లు మనుచు గొట్టి నవ్వి - గొల్లు బెట్టిరా ||మనస||

5.మొయ్యలేక సిల్వ భరము - మూర్ఛ బోయెనా - అయ్యయ్యో జొక్కెనా - యే - సయ్య తూలెనా = మా - యయ్య నిన్ దలంప గుండె - లదరి పోయెనా ||మనస||

6.కాలు సేతులన్ గుదించి - కల్వరి గిరిపై - నిన్ - గేలిజేయుచు - నీ - కాళ్ల మీదను = నినుప - చీలలతో గ్రుచ్చి నిన్ను - సిల్వం గొట్టిరా ||మనస||

7.దేవ సుతుడ వైతి వేని - తీవరంబుగా - దిగి - నీవు వేగమే - రమ్ము - గావు మనుచును = ఇట్లు - గావరించి పల్కు పగర - కరుణ జూపెనా ||మనస||

8.తన్ను జంపు శత్రువులకు - దయను జూపెనా తన - నెనరు జూపెనా - ప్రభు - కనికరించెనా = ఓ - జనక యీ జనుల క్షమించు - మనుచు వే డెనా ||మనస||

9.తాళలేని బాధ లెచ్చి - దాహ మాయెనా - న - న్నేలు వానికి - నా - పాలి స్వామికి = నే - నేల పాపములను జేసి - హింస పరచితి ||మనస||

10.గోడు బుచ్చి సిలువ పైన - నేడు మారులు - మా - ట్లాడి ప్రేమతో - నా నాడు శిరమును = వంచి - నేడు  ముగిసే సర్వ మనుచు - వీడె బ్రాణము ||మనస||

11.మరణమైన ప్రభుని జూచి - ధరణి వణకె నా - బల్ - గిరులు బగిలెనా - గుడి - తెరయు - జీలెనా = దివా - కరుడు చీక టాయె మృతులు - తిరిగి లేచిరి ||మనస||

12.ఇంత జాలి యింత ప్రేమ - యింత శాంతమా - నీ - యంతః కరుణను - నే - జింత చేయగా = నీ - వింత లెల్ల నిత్య జీవ - విధము లాయెనా ||మనస||
  - మిక్కిలి సమూయేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...