Showing posts with label Unnathamaina rajyapu vasi. Show all posts
Showing posts with label Unnathamaina rajyapu vasi. Show all posts

22 December 2021

Unnathamaina rajyapu vasi | ఉన్నతమైన రాజ్యపువాసీ

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా - ఆ మహిమను విడిచావా - 
ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా - ఈ ధరణికి వచ్చావా
నీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంట (2)
నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా 

1.మంచివారినే ప్రేమించుట - మాకిలలో సాధ్యము కాదే -
మంచికార్యములు చేయు స్వభావము - మాలోపల కానరాదే (2)
మంచితనమన్నదే లేని (2) వంచకుని కరుణించావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా (2) ||ఉన్నత||

2.ప్రాణప్రదముగా ప్రేమించిన - తన మిత్రుని కొరకైనా - 
ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో - ఎచటా కనుగొనలేమే (2)
గుణహీనుడైన మానవుని (2) ఋణము చెల్లింపదలిచావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా (2)  ||ఉన్నత||

3. పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప - 
ఇరుగు పొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే (2)
పురుగువంటి నరమాత్రునికి (2) కరుణతో సర్వమిచ్చావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా (2) ||ఉన్నత||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...