Showing posts with label Prabhu prema tholi keka lyrics. Show all posts
Showing posts with label Prabhu prema tholi keka lyrics. Show all posts

24 August 2020

Prabhu prema tholi keka | ప్రభుప్రేమ తొలికేక

674
ప్రభు ప్రేమ తొలికేక - హృదయములో ప్రతి ధ్వనియించే 
పాప క్షమా యేసునిలో- శరణు నొసంగుచు కనిపించే 

1.పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె
ఫలితముగా లోకములో - బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేకా - దాహము తోనే నొంటరిగా
బావికని పయనింపా - నాధుని దర్శన మెదురాయే
పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె ||ప్రభు||

2.జాతినిచూడని నేత్రముతో - పాపము శోకని హృదయముతో 
జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో 
జాప్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని - ప్రభు వెరిగిన నా నిజస్థితిని 
జయమొందె నాతనువూ - సరిగ నుడితివని ప్రభు తెలుపా ||ప్రభు||

3.దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింపా
దినదినమూ జీవితమూ - చావుగ మారిన  కాలములో 
దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి 
దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే 
దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే ||ప్రభు||

4.పాపము దాగును నాబావి - లోతును ఎరిగినవారెవరు 
పోరాట వాటికయౌ - నా బ్రతుకును చూచినదెవరు
పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ
పాపిని కాపాడుటకు - సిలువను మోసినవారెవరూ 
ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు ||ప్రభు||

5.ఘటముతో వెడలితి నొంటరిగా - పితరులు త్రావిన జలములకై 
కనబడెను బావికడ - రక్షణ యూటల ప్రభు యేసు 
కుండను వీడి పరుగడితి - బావిని చేకొని హృదయములో
ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుపా
గ్రామప్రజా కనుగొనిరి - విశ్వ విమోచకు డగు యేసున 
||ప్రభు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...