Showing posts with label 249 రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా. Show all posts
Showing posts with label 249 రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా. Show all posts

30 May 2026

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా Rammu Parishudhathma devuda

 249
మార్గదర్శియగు పరిశుద్ధాత్ముండు 
(ఛాయ: ఓ మా తండ్రి నీదు నామము)
రా - ఆనంద భైరవి, తా - ఏక 

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా - మమ్మును గృపాస - నమ్ముకడకు - నెమ్మి నడుపుమా = మమ్ము నడుపు దీక్షతోఁబ - రమ్ము విడిచి యాత్మస్వరూ - పమ్మున నరుదెంచిన దై - వమ్ము నీవెకద యెహోవ ||రమ్ము||

1.లోకయాత్ర చేయునప్పుడు చీ - కాకుపడిన - మాకు నీవె మార్గ దర్శివై = వీఁక నొసఁగి - మాకరంబుఁ - జేకొని పరిశ్రమముఁబాపి -  సిలువఁ బడినవానికడకు - త్సేకమూని మమ్ముఁజేర్ప ||రమ్ము||

2.భక్తవన వసంతదైవమా - నీయందుఁ బ్రేమా - సక్తివృద్ధిచేసి మనుపుమా = ముక్తిదాత యేసువిభుని - రక్తమహిమఁ - దెల్పియఘ వి -ముక్తులనుగఁజేసి మమ్ము - యుక్తమార్గమందు నిలుప ||రమ్ము||

3.జీవితపుబాధ లెన్నియో - పెనుఁబ్రోవులగుచు - నావరించి మమ్ముఁ దా కిన = మాకు నీవె హితుఁడవగుచు - భావమిచ్చి భయముఁదీర్చి - జీవ మైన యేసుపాద - సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము||

4.పలువిధంబులైన చింతలు - చెలరేఁగి మమ్ము - కలఁతపెట్టు నవసరం బున = వలనుచెడిన మామనముల - మలయు వ్యాకులతను మాన్పి - వలయు నాదరణము నిచ్చు - పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||

5.తొలిప్రవక్త లెంద రెందఱో - నీ ప్రేరణమునఁ -బలికినట్టి వేదమందునఁ= గల నిగూఢ భావములను - దెలుపు నొజ్జవీవెయగుటఁ - దెలిపి వాని మమ్ము జ్ఞాన - కలితమతులఁ జేయుకొఱకు ||రమ్ము||

6.సడలివాడిపోవుచున్న మా = విశ్వాసలతను - బలసమృద్ధి నుద్ధరించి మా = యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు - లడఁచి ప్రేమఁ జ్యోతిమాలోఁ - గడుస్థిరముగ వెలుఁగజేయ ||రమ్ము||

7.స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా - వుత యుగయుగంబు - లతులభక్తిని న్నె కొలుతుము = క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య - మృతికి మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము||
- దాసరి మోజెస్ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...