Showing posts with label Naalo Nivasinche Naa Yesayya lyrics. Show all posts
Showing posts with label Naalo Nivasinche Naa Yesayya lyrics. Show all posts

29 March 2021

Naalo Nivasinche Naa Yesayya నాలో నివసించే నా యేసయ్య

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా (2)
మారని మమతల మహనీయుడ (2)
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా (2)  ||నాలో నివసించే||

1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం (2)
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2)  ||కీర్తించి||

3. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం (2)
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే (2)
ఏమని వర్ణింతును నీ కృపలను (2) ||కీర్తించి||

4. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)
సియోనులో చేరాలనే - నా ఆశయం నెరవేర్చుము (2)
యేసయ్య నిన్ను చూచి హర్షింతును
భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం (2)  ||నాలో నివసించే||
DOWNLOAD HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...