Showing posts with label 137 యేసు నామ మెంతో మధురం. Show all posts
Showing posts with label 137 యేసు నామ మెంతో మధురం. Show all posts

30 April 2022

Yesu naama mentho madhuram | యేసు నామ మెంతో మధురం

137
యేసు నామము మధురము
రా - మరవా,  తా - ఆది

యేసు నామ - మెంతో మధురం - యేసు నామ - మెంతో మధురం = దోసములు మోసములు - నాధ మొనరించు ప్రభు ||యేసు||

1.స్వాంతమునకు - శాంతి నిడును = చింతలను భ్రాంతులను - వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||

2.నెమ్మి జేయు కమ్మివేయు = నమ్మికలు సొమ్ములుగ -  ముమ్మరము జేయు ప్రభు ||యేసు||

3.ప్రేమ లెదుగ - క్షేమ మొదపు = కామ గుణ పామరతి -  లేమి చొరనీదు ప్రభు ||యేసు||

4.మోక్ష దశకు - సాక్ష్య మొసఁగు = నక్షయ సురక్షణకు -  దక్షత వహించ ప్రభు ||యేసు||

5.శీల మతుల - పాలి వెతలఁ =తూలఁ జనఁదోలి తన - జాలి కనపరచు ప్రభు ||యేసు||
                        - పురుషోత్తము చౌదరి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...