Showing posts with label telugu christian lyrics. Show all posts
Showing posts with label telugu christian lyrics. Show all posts

02 January 2023

Athi parishududa sthuthi | అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము


అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును 
నీవు నా పక్షమై నను దీవించగా -నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే -ఆశ్రయమైన నా యేసయ్యా
 
సర్వోన్నతమైన స్థలములయందు - నీ మహిమ వివరింపగా 
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
 
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని 
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే 
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా 
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
 
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక 
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమున కలిసి ఉన్నావులె ప్రతి అడుగున 
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

15 October 2021

Neevu Chesina Upakaramulaku | నీవు చేసిన ఉపకారములకు


నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును 
ఏడాది కోడెలనా - వేలాది పొట్టేళ్ళనా (2) 

1. వేలాది నదులంత విస్తార తైలము - నీ కిచ్చిన చాలునా
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని - నీ కిచ్చిన చాలునా 

2. మరణ పాత్రుడనై యున్న నాకై - మరణించితివా సిల్వలో 
కరుణ జూపి నీ దివ్య మార్గాన - నడిపించుము యేసయ్యా 

3. విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయ మర్పింతును
కపట నటనలు లేనట్టి హృదయాన్ని - అర్పింతును యేసయ్యా 

4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నేనేమి చెల్లింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము - నిను వెంబడించెదను
పాట రచయిత - కృపా రావు 

DOWNLOAD MP3 SONG HERE 👇

03 February 2021

Ye Baadha Ledu Ye Kashtam | ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా 
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా ... 
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా ...
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా 
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా 

1. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - యెరికో గోడలు అడొచ్చినా 
సాతానే శోధించినా శత్రువులే శాసించినా 
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా 
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ... 

2. పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా 
తుఫానులే చెలరేగినా - వరదలే ఉప్పొంగినా 
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్చుగా 
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా ...
                                     ||ఏ బాధ లేదు||

DOWNLOAD MP3 SONG HERE 👇

27 January 2021

Kaaru Moyilu Daarilo | కారు మొయిలు దారిలో

 
కారు మొయిలు దారిలో - కఠిన శిలల నేలలో
వెలుగు విరులు వెలసి - కనుల విందు సేయ జాలునా ||కారు||  

ఇరుకు లోయ నడుమలో - కరకు రాతి అడుగులో
మరణ భయము నార్పివేయు - కరుణ జలము లూరునా ||కారు||  

ఎండిన ఎడారిలో - మండుటెండ మేరలో
మధుర వాయు తటులు వీచి - మనసు సేద దీరునా ||కారు||   

రుధిర సిక్త నగములో - హృదయ భగ్న పదములో
మధుర మృదుల కధములైన - మాటలెన్న వచ్చునా 
||కారు||  

స్వామి యేసు సిలువలో - జీవ జలపు నదులలో
హృదయ క్షుదను దీర్చు క్రీస్తు - విమల సుధలు నిండగా ||కారు||
 DOWNLOAD MP3 SONG HERE 👇

23 January 2021

Paavanaathma Deva Nanu | పావనాత్మ దేవ నను

పావనాత్మా దేవ.. నను బ్రోవ రావేరా
నీవే నాకు మార్గమందు కావుమయ్య యేసయ్య
                                            ||పావనాత్మా||
కూలిపోయే హృదయం లేవనెత్తు యేసయ్య (2)
భావమందు నిలుపు జీవ వాక్కు యేసయ్య (2)
                                           ||పావనాత్మా||
దీన మనస్సు తోడా దిక్కు నీవే యంటి దేవా (2)
మానకుండా నీవు నన్ను మహిమ దరికి చేర్చు (2)
                                           ||పావనాత్మా||
_______________________
Paavanaathma Deva Nanu brova raaveraa
Neeve naaku maargamandu kaavumayya Yesayya
                                  ||Paavanaathma||
Koolipoye hrudayam levanettu Yesayya
Bhaavamandu nilupu Jeeva vaakku Yesayya
                                  ||Paavanaathma||
Deena manasu thoda dikku neeveyanti deva
Maanakunda neevu nannu mahima dariki cherchu
                                  ||Paavanaathma||
DOWNLOAD MP3 SONG HERE 👇

19 January 2021

Nee Krupa Chalunu Nee Prema | నీ కృప చాలును నీ ప్రేమ చాలును

నీ కృప చాలును - నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసూ ||2||

నీవులేని జీవితం అంధకార బంధురం ||2||
నీవు నాకు తోడుంటే చాలును యేసూ
శొధనలు ఎన్నియో వేధనలు ఎన్నియో
నన్ను కృంగదీయ సంకటములెన్నియో (2)

నీ ప్రేమ వర్షం నా స్తితిని మార్చెగా (2)
నా జీవితాంతము నీలొ నే నిలిచెదన్ నా జీవితాంతము నీతో నే నిడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసూ

నా ప్రేమ గీతం నా దీన ప్రార్ధన
నా హౄదయ ఆలాపన అందుకో దేవ (2)
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2)

నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ అత్మ అభిషేకం నాకు నొసగుదేవా
నా ప్రేమ గీతం నా దీన ప్రార్ధన
నా హౄదయ ఆలాపన అందుకో దేవ ||2||

17 January 2021

Sameepincharani tejassulo lyrics | సమీంచరాని తేజస్సులో

సమీంచరాని తేజస్సులో నీవు - వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు - నీ ప్రేమ వర్ణింప తరమా (2) 
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది -
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని||  

1.ధరయందు నేనుండి చెరయందు పడియుండ -  కరమందు దాచితివి - నన్నే పరమందు చేర్చితివే (2)
ఖలునకు...కరుణను...వొసగితివి (2)  ||యేసయ్యా||
 
2.మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి  - నా స్థితి మార్చినది - నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు... విలువను... వొసగినది (2) ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

23 December 2020

Padeda Deva Neekrupalan | పాడెద దేవా నీకృపలన్ నూతన

పాడెద దేవా - నీకృపలన్ - నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ - స్తు స్తోత్రము చెల్లింతున్
                                              ||పాడెద దేవా||
భూమి పునాదులు వేయకమందే యేసులో జూచితివి
ప్రేమ పునాదులు వేసితివి - దీనుని బ్రోచితివి ఈ
                                              ||పాడెద దేవా||
ప్రవిమల రక్తము కలువరి సిలువలో ఖలునకు నిచ్చితివి ప్రేమకృపా మహదైశ్వర్యములతో-పాపము తుడిచితివి
                                               ||పాడెద దేవా||
పాపము శాపము నరకపు వేదన - మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను-ధర బ్రతికించితివి నను
                                               ||పాడెద దేవా||
దేవుని రాజ్యపు వారసుడుగా క్రీస్తులో జేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెఱ 
                                               ||పాడెద దేవా||
ముద్రించితివి శుద్ధాత్మతో నను - భధ్రము జేసితివి సత్యస్వరూపి నిత్య నివాసి - సోత్తుగా జేసితివి -నీ 
                                                ||పాడెద దేవా||

Gana Prathiganamulatho | గాన ప్రతిగానములతో

గాన ప్రతిగానములతో -స్తోత్ర ప్రతి స్తోత్రములతో
గానము చేయుదము- యేసుకు గీతముపాడుదము

1.యుద్దశూరుడు - విజయ వీరుడు మహదేవుడు - 
   మన యేసు రాజని గాన ప్రతి గానములతో 
   స్తోత్రము చేయుదము            ||గాన ప్రతి||

2.పూజ్యనీయుడు - పునరుత్థానుడు నిత్య దేవుడు - 
   మన యేసునాధుడని గాన ప్రతి గానములతో 
   స్తోత్రము చేయుదము           ||గాన ప్రతి||

3.ధవళవర్ణుడు - రత్న వర్ణుడు మహిమ పూర్ణుడు 
    మన యేసు దేవుడు గాన ప్రతి గానములతో
    స్తోత్రము చేయుదము         ||గాన ప్రతి||

4.శక్తిమంతుడు - బలవంతుడు అద్వితీయుడు-
   దేవాది దేవుడు గాన ప్రతి గానములతో
   స్తోత్రము చేయుదము           ||గాన ప్రతి||

5. పరిశుద్ధుడు - పరిశుద్దుడు పరిశుద్ధుడు - 
    ప్రభుయేసు క్రీస్తని గాన ప్రతి గానములతో
    స్తోత్రము చేయుదము            ||గాన ప్రతి||

Halleluya pata yesayya Pata | హల్లెలూయా పాట యేసయ్య పాట

హల్లెలూయా పాట - యేసయ్య పాట పాడాలి 
ప్రతిచోట పాడాలి ప్రతినోట హల్లెలూయ హల్లెలూయ 
                            ||హల్లెలూయా||
1. కష్టాలెన్నో కల్గినా - కన్నీరు మిగిలినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా 
                             ||హల్లెలూయా||
2. బంధాలు బిగియించినా - చెరసాలలో వేసినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
                             ||హల్లెలూయా||

13 December 2020

Sthuthi Gaanamu Cheyuchu | స్తుతిగానము చేయుచు

స్తుతి గానము చేయుచు ప్రవేశించుడి - 
మన దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తోత్రము    
చెల్లించుడి అతి పరిశుద్ధ ఆవరణములో 
ఆహా ! ఆనందమే, మన ప్రభువును స్తోత్రించుట 
అతి సుందరము, అతి మనోహరము 
మన ప్రభును కీర్తించుట

1. మహోన్నతుడైన యేసుని ఆరాధించెదము
మహారాజైన క్రీస్తుని ఘనపరచెదము  ||ఆహా||

2. పరమతండ్రిని పూజింతుము, పవిత్రమనస్సుతో 
పరిశుద్ధుడగు ప్రభువును ప్రణుతిజేయుదము ||ఆహా||

3. ఏకమైయున్న యేసుని - స్తుతించి పాడుదము      
అద్వితీయ కుమారుని - ఆర్భటించుదము ||ఆహా||

Uhalakandani Lokamulo | ఊహలకందని లోకములో

ఊ
హలకందని లోకములో ఉన్నత సింహాసనమందు
ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా, సర్వోన్నతుడా 

సిరూపులు దూతాళి - పరిశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు - పొగడబడెడి పావనుడా
హల్లెలూయా.హల్లెలూయా.హల్లెలూయా.హల్లెలూయా 

నీ శిరము ధవళముగా - పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా
అల్ఫయును ఓమేగయును- అన్ని కాలంబుల 
నుండావాడా- సర్వాధికారుండా -సర్వేశా, సజీవుండా

11 December 2020

Yesuni Sthuthinchuvaru | యేసుని స్తుతియించువారు

యేసుని స్తుతియించువారు - నిత్యజీవము పొందెదరు ఆనందముతో దినదినము - సంతోషముతో నుందురు 
                                                        ||యేసుని||
ఆహ ........ హల్లెలూయ .....

చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు 
చేయి విడువక తనతో కూడయేసే నడిపించును 
ఆహ.... హల్లెలూయ....                   ||యేసుని||

నడిసంద్రములో పయనించిన నట్టడవులలో నివసించిన 
ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడుండును ఆహ..... హల్లెలూయ.......             ||యేసుని||





Paramamanduna Dootalu | పరమందున దూతలు పాడుచున్నారు

పరమందున దూతలు పాడుచున్నారు  
ఇహమందున భక్తులారాధించుచున్నారు 
స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునికే చెల్లును
హల్లెలూయ ఆమేన్ - హల్లెలూయ ఆమేన్ - హల్లెలూయ ఆమేన్

1. సుందరులలో అతిసుందరుడు - 
    పదివేలలో అతి ప్రియుడు కాంక్షనీయుడు 
    కారుణ్యమూర్తి - కరుణతో మము బ్రోచెన్ ||పరమ||

2. శ్రేష్ఠులలో అతిశ్రేష్ఠుండు - మన ప్రభువునకు
    సమమెవరు చిందించె రక్తం బలియిచ్చే ప్రాణం
    పరమున నను చేర్చున్ ||పరమ||

3. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు - 
    నేత్రములే అగ్ని జ్వాలలు - జయించే సాతానున్
    రక్తము చేతన్ - జయశాలిగచేసెన్  ||పరమ||

4. విశ్వమంత ప్రభు మహిమ నిండెన్ - 
    పాతాళ పునాదులదరన్ భక్తులు కూడిరి 
    బూరలు ఊదగన్ - దేవునికే మహిమ ||పరమ||

Sthotrageethamul Paadedamu | స్తోత్రగీతముల్ పాడెదము స్తుతి

స్తోత్రగీతముల్ పాడెదము స్తుతి పాత్రుని కొనియాడెదము
హల్లెలూయా హల్లెలూయ -హల్లెలూయ - హల్లెలూయ 

1. సర్వసృష్టిని జేసిన -సర్వేశ్వరుని కొనియాడెదము 
    సర్వము త్యజించి వచ్చిన -సృష్టికర్తను కొలిచెదము 

2. పాపభారమంత మోసిన -పావనాత్మునిగొలిచెదము 
    శాపమంతా తొలగజేసిన శాంతమూర్తిని గొలిచెదము 

3సిలువలో తనప్రాణమిచ్చిన-యేసునాధునిగొలిచెదము
  కలుషమెల్ల - కడిగివైచిన - కరుణాభరితుని కీర్తింతము

10 December 2020

Sthuthinchudi yehova devuni | స్తుతించుడి యెహోవా దేవుని

స్తుతించుడి యెహోవా దేవుని - సూర్యచంద్రులారా -
పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో
యెహోవాను స్తుతించుడి

కాంతిగల నక్షత్రములారా - పరమాకాశమా - ఆకాశ జలమా ఆవిరి హిమమా - అగ్నితుఫాను - మహాసముద్ర పర్వతవృక్ష మృగములు పశువులారా - ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవానుస్తుతించుడి

రాజులు ప్రజలు న్యాయాధిపతులు - అధిపతులారా బాలురు - యౌవన కన్యక వృద్ధులు - ప్రభుని స్తుతించుడి - ప్రాకు జీవులు - పలువిధ పక్షులు పాడి స్తుతించుడి - ప్రశంసించ ప్రభావ మహిమను పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి

Shrungara Nagaramandu | శృంగార నగరమందు జయగీతముల్

శృంగార నగరమందు జయగీతముల్ 
పాడెదము సీయోను వరుని చేరి 
                                                    ||శృంగార||
1. ఆనందమిచ్చిన ప్రియుని చేరి -
    ఆదరణ పొందెదము అచ్చట అలంకార మహిమ -
    కిరీటము పొంది ప్రియునిలో హర్షించెదం
                                                     ||శృంగార||
2. దు:ఖించు వారు స్తుతిపాట పాడుచు - 
    స్తుతి వస్త్రములతో అచట ఉన్నత సీయోను 
    తిన్నని - వీధిలో హర్షించి పాడెదం
                                                    ||శృంగార||
3. ముండ్ల కిరీటము పొందిన నిజయేసు - 
    పరిశుద్ధుని చూతము అచ్చట ముద్రపొందిన - 
    శుద్దుల తెల్లంగి ధరించి స్తోత్రించెదం 
                                                     ||శృంగార||
4. భూలోక పాలన క్రొత్త పాటపాడి - 
    ప్రేమతో హర్షించెదం శాంతి సౌఖ్యంబులతోడ -
    ప్రభువుతో నుండి భూ ఆశల్ విడచెదము
                                                     ||శృంగార||
5. ఆయన చెప్పిన గురుతులన్నియు - తప్పక 
    జరుగుచుండె ఆయన వచ్చువేళ 
    తెలియదు ఎప్పుడో ఆయత్తముగా యుందము 
                                                    ||శృంగార||
6. సిలువను మోసిన పరిశుద్ధ ప్రభు యేసు 
    చెంగుపట్టుకొందము అచ్చట మచ్చ డాగులేని - 
    ప్రభుని వెంబడించి - జయగీతముల్ పాడెదం 
                                                    ||శృంగార||

Sthuthiyinthumu Sthotrinthumu | స్తుతియింతుము స్తోత్రింతుము

స్తుతియింతుము - స్తోత్రింతుము పావనుడగుమా - పరమతండ్రిని ...

1.నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవ
వర్ణింప మా తరమా-మహిమ కలిగిన నీనామమును ||స్తుతియింతు||

2.మా ప్రభువా మా కొరకై- సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై - రక్తమును గార్చిన రక్షకుడా ||స్తుతియింతు||

3.మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మప్రియుని
ప్రియమగు కాపరులను-ప్రియమార మాకొసగిన తండ్రివి ||స్తుతియింతు||

4.పరిశుద్ధజనముగ - నిర్దిష ప్రజలనుగా
పరలోక తనయులుగా - పరమకృపతో మార్చిన దేవా ||స్తుతియింతు||

5.సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును
పరిపూర్ణంబుగ కలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి ||స్తుతియింతు||

6.ప్రభు యేసుక్రీస్తులో - పరలోక విషయములో 
ప్రతి ఆశీర్వాదములన్ - ప్రాపుగ ఒసగిన పరమ తండ్రి ||స్తుతియింతు||

7.ఎల్లరిలో జీవజలం - కొల్లిగ పారునట్లు
జీవంబునిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ||స్తుతియింతు||

Sthuthi Jethumu Neeku | స్తుతిజేతుము నీకు దేవా స్తుతిజేతుము

స్తుతి జేతుము నీకు - దేవా స్తుతిజేతుము - 
నీకు = నేడును రేపును ఎల్లప్పుడును = 
సమకూడిన స్తుతిగానం నీకిలలో  ||స్తుతి||

1. మనసుయు నాలుకయు - నీకు అనుదినం
స్తుతిజేయు = జనక కుమార నీకై స్తోత్రము
ఘనతయు మహిమయు కలుగును గాక ||స్తుతి||

2. వేడుకొనకముందే - ప్రార్ధన - వినియుంటివి 
దేవా = నేడును రేపును ఎల్లప్పుడును = 
సమకూడిన స్తుతిగానం నీకిలలో ||స్తుతి||

Tarataramulalona | తరతరములలోన

తరతరములలోన యుగయుగములలో
నీకే స్తోత్రము యేసువా 

1. నను గావను నీవే - 
    ఓ  యేసా పరలోకంబును విడచితివా -
    దాసుని రూపంబున - 
    సిల్వపై నీవు పాపా శాపములు మోసితివా 
                                              ||తరతరముల||
2. నా పాపఋణంబును - 
    ఓ యేసా ఆ కల్వరిగిరిపై తీర్చితివా 
    అంగలార్పును మార్చి - 
    రక్షణవస్త్రము - నాకు ధరింప జేసితివా 
                                             ||తరతరముల||
3. నీ ప్రేమకు ప్రతిగా -
    ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్య 
    రక్షణ పాత్రను చేబూని - 
    నిత్యము అర్పించెదను స్తోత్రమును
                                            ||తరతరముల||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...