Showing posts with label SP Balu Christian songs lyrics. Show all posts
Showing posts with label SP Balu Christian songs lyrics. Show all posts

16 April 2024

Evarikosamo ee prana thyagamu ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

 ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము (2)
 నీకోసమే నాకోసమే కలువరి పయనం
 ఈ కలువరి పయనం ||ఎవరికోసమో||

1.ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో - మోముపైన ఉమ్ములతో -  నడువలేని నడకలతో
తడబడుతూ పోయావా - సోలి వాలి పోయావా

2.జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము
జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి
"తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు"
అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని 

09 April 2024

Nenante neekenduko ee prema నేనంటే నీకెందుకో ఈ ప్రేమా

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా. - నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా - నన్ను విడిచిపోవెందుకు 
కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో - వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు - ప్రాణమా.. నా ప్రాణమా (2) ||నేనంటే||

1.నిన్ను మరచిపోయినా - నన్ను మరచిపోలేవు -
నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

2.ప్రార్ధించకపోయినా - పలకరిస్తు ఉంటావు -
మాట వినకపోయినా - కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| 
DOWNLOAD THIS SONG  HERE 👇

25 August 2023

Nadipinchu chunnadu najaraeyudu నడిపించు చున్నాడు నజరేయుడు


నడిపించు చున్నాడు - నజరేయుడు
నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||

1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా 
ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||నడి||

2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా 
ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||నడి||

DOWNLOAD MP3 SONG HERE 👇

07 June 2022

Nee aaradhana hrudaya | నీ ఆరాధన హృదయ ఆలాపనా

నీ ఆరాధన .. హృదయ ఆలాపనా..(2)
ఆత్మతో సత్యముతో.. (2)
ఆరాధించెదను ఆరాధించెదను (2)
ఆరాధన క్రీస్తు ఆరాధన -
ఆరాధన యేసు ఆరాధన (2)
నీ ఆరాధన .. హృదయ ఆలాపనా..(2)

1.అరుణోదయమున ఆరాధన - 
సూర్యాస్తమయమున ఆరాధన (2)
దినమెల్ల నీ నామం కీర్తించిన - 
నా ఆశ తీరునా (2)
ఆరాధన క్రీస్తు ఆరాధన - 
ఆరాధన యేసు ఆరాధన (2)
నీ ఆరాధన .. హృదయ ఆలాపనా..(2)

2.స్తోత్రము చేయు పెదవులతొ - 
తంబుర సితార నాధముతో (2)
విరిగి నలిగిన హృదయముతో - 
ఆరాధనకు యోగ్యుడవు (2)
ఆరాధన క్రీస్తు ఆరాధన - 
ఆరాధన యేసు ఆరాధన (2) ||నీ ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇

06 November 2021

Guduleni Guvvala | గూడు లేని గువ్వలా

గూడు లేని గువ్వలా దారి తప్పితి -
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా - నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||

1.గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

2.చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
                            - గుంటూరు రాజా
DOWNLOAD MP3 SONG HERE 👇

14 October 2021

Prema Devuni Prema | ప్రేమ దేవుని ప్రేమ

ప్రేమ దేవుని ప్రేమ  (2) 
శాశ్వతమైనది మత్సరపడనిది డంబము లేనిది 
ప్రేమ దేవుని ప్రేమ  ||ప్రేమ||

1. శోధన కాలమునా వేదన పాలైనా (2) 
కాదనకా వెంటాడునది (2) 
కలుషములన్న కడుగునది - కన్నీటిని తుడుచునది -
మన కన్నీటిని తుడుచునది ||ప్రేమ||

2. ప్రభు యేసు క్రీస్తు భోధించినది - ప్రవక్తలందరు ప్రవచించినది (2) 
పాపపు స్త్రీని మన్నంచినది (2) 
త్యాగావికే ఆదర్శమైనది - పరిపూర్ణమైనది ఇహపరములలో (2) ||ప్రేమ|| 

3. అదిగదిగో కనబడుచున్నది అదియే కల్వరిగిరి
 లోక పాపములు పరిహరించుటకు - ప్రేమతో క్రీస్తుని శరీరము 
పాపయాగపు బలిపశువై శిలువలో వ్రేలాడినది 
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుకా వీరల క్షమించమని వేడినదీ ప్రేమ ||ప్రేమ||

DOWNLOAD MP3 SONG HERE 👇

08 October 2021

Nee Dayalo Nee Krupalo | నీ దయలో నీ కృపలో కాచితివి

నీ దయలో నీ కృపలో - కాచితివి గతకాలము 
నీ దయలో నీ నీడలో - దాచుమయా జీవితాంతము 
నీ ఆత్మతో నను నింపుమా - నీ సేవలో ఫలియింపగా 
దేవా ... దేవా ... || నీ దయ || 

1. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా -
ప్రాణ హితులే.. నన్ను విడచి.. వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు - నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) 
ఏమి అద్భుత ప్రేమయా - ఏ రీతి పాడనయా 
నీవె నా మార్గము - నీవె నా జీవము 
నీవె నా గమ్యము - నీవె నా సర్వము 
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ॥నీ దయ ||

2. ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి - 
వట్టి పాత్రను.. మహిమతో నింపి.. మార్గము నీవైతివి (2) 
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని - నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) 
నా మది నిండెను ఆశతో - నే పాడెద స్తుతి గీతం 
నీవె నా తోడుగా - నీవె నా నీడగా 
ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా 
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా || నీ దయ ||

DOWNLOAD MP3 SONG HERE 👇

22 August 2021

Kanureppa Paataina Kanu | కనురెప్ప పాటైన కను మూయలేదు

కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది - పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా - ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది - ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని - ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా - కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||

ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది - ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని - ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా – కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||

DOWNLOAD MP3 SONG HERE 👇

03 June 2021

Yendukayya yesayya naapai | ఎందుకయ్యా యేసయ్యా

ఎందుకయ్యా యేసయ్యా నా పై ఇంత ప్రేమ (2)
పాపిని నాకొరకు నీకు ఏల సిలువ శ్రమ (2)

1. శ్రీమంతుడవు సిరికే రాజువు - 
ప్రార్థించినంతనే కృప చూపువాడవు (2) 
కడు దీనుడవై మరియ సుతుడవై (2)
పశుల శాలలో జన్మించినావా - 
నాకై ఇంత తగ్గించుకున్నావా  ||ఎందుకయ్యా||

2. న్యాయము జరిగించు శాసనకర్తవు - 
న్యాయాధిపతిగా రానున్నవాడవు (2) 
లోకాధికారుల తీర్పుకు తలవంచి(2)
దొంగల నడుమ మరణించినావా - 
నాకై ఇంత తగ్గించుకున్నావా ||ఎందుకయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

15 April 2021

Cherithi Prabhuva Nee Sannidhi | చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు

చేరితి ప్రభువా నీ సన్నిధి - పూజలు చేయగా నా పెన్నిధి
పాడి స్తుతింతును నీ దివ్య నామం - వరములు చిందే ఈ దివ్యబలిలో

1. చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎడదలలో
వెలుగును నింపే జ్యోతివి నీవు - నీ కృప మాపై ప్రసరించు దేవా||చేరితి||

2. శోధన బాధలు కలిగిన వేళ - నీ సిలువే మా కాశ్రయ దుర్గం
నూతన బలమును ఒసగుము దేవా - కనురెప్పల మము కాయుము ప్రభువా||చేరితి||
DOWNLOAD MP3 SONG HERE 👇

14 April 2021

Bangaru thandri na yesayya | బంగారు తండ్రి నా యేసయ్యా

బంగారు తండ్రి నా యేసయ్యా - స్తోత్రము చెల్లింతును యేసయ్యా -  
నేరము చేసితిని నేనయ్యా (2) 
నా భారాన్ని మోసిన యేసయ్యా. ||బంగారు||

1. పాపమునుండి నన్ను విడిపించి - నీ రక్తము నాకై నీవు చిందించి (2)
రక్షణ వస్త్రమును నాకిచ్చి (2)
నా రక్షకుడైనావు యేసయ్యా ||బంగారు||

2. శత్రువు నుండి నన్ను విడిపించి - నీ రెక్కల నీడలో దాచితివి (2)
దుఃఖములన్నియు బాపితివా (2)
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా ||బంగారు||

3. అడుగులు జారక నను నడిపితివి - నీ ఉన్నత సేవకై పిలిచితివి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని (2)
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా ||బంగారు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Bethlehemu Nagarilo Pashula Paka | బెత్లహేము నగరిలో పశువుల

బెత్లహేము నగరిలో పశువుల పాక నీడలో
రారాజు పుట్టెను తనే యేసు దైవము
సర్వలోకానికి నేడే శుభోదయం 
శుభోదయం శుభోదయం

కన్నెమరియ కన్నతల్లిగా ఎన్నటికి మరువలేని కల్పవల్లిగా
లాలి లాలి లాలియని యేసు బాలా జోలని 
లోకమంతా ఉయ్యాలగా ఊపినట్టి దేవతరా
చాటరా యేసు నామము దాటరా నరకలోకము
నేడే శుభోదయం

లేమి ఇంట ఉన్నవాడుగా వెలసినావు ప్రేమజ్యోతిగా
నీవు లేని హృదయము ఏమీలేని సదనము
ఏమి సుఖము పొందుటకొ పుట్టితివి మట్టిలో
చాటరా యేసు నామము దాటరా నరకలోకము 
నేడే శుభోదయం

పల్లెలోని గొల్లవారలు వెళ్ళిరిగా ప్రభునిచూడ తెల్లవారులు
మంచి గొర్రెల కాపరి మనకు వెలుగునిచ్చురా 
మందలన్నీ మేపుటకే కన్నె మరియ కన్నదిరా
చాటరా యేసు నామము దాటరా నరకలోకం 
నేడే శుభోదయం

DOWNLOAD MP3 SONG HERE 👇

13 April 2021

Bangaru Bomma Neevamma | బంగారు బొమ్మ నీవమ్మా వధువు

 
బంగారు బొమ్మ నీవమ్మా -
వధువు సంగమా రావమ్మా (2)
శృంగార ప్రభువు యేసమ్మా -
వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా(2)

1. పశ్చాత్తాపమే పెళ్లి చూపులమ్మా
    పాప క్షమాపణ నిర్చితార్ధమమ్మా
    విరిగిన మనస్సే వరుని కట్నమమ్మా
    నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
    గొరియ పిల్ల రక్తములో తడిసిన
    పవిత్ర కన్యవై నిలిచేవమ్మా (2)
                                       ||బంగారు||
2. కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా
    అసూయా ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా
    నెత్తుటి దారాలే పెళ్లి చీరమ్మా
    ముళ్ళ కిరిటమే పెళ్లి ముసుగమ్మా
    ప్రకాశమయమై నిర్మలమైన
    పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా (2)
                                      ||బంగారు||
3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా
    దేవుని దూతలే పెళ్లి సాక్షులమ్మా
    సిలువ దండమే పెళ్లి సూత్రమమ్మా
    దూషణ హేళనే పెళ్లి అక్షింతలమ్మా
    సువర్ణమయమై స్వచ్చమైన
    స్పటికమువోలే మెరిసేవమ్మా (2)
                                      ||బంగారు||
==========================

Anubhavaniki Vachena Anthuleni | అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన

అనుభవానికి వచ్చెనా... అంతులేని వేదన...
దైవవాక్కును మీరినా... ఫలితం తెలిసేనా...

అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన -
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)

మట్టి నుండి మనిషిగా నిను మలచి ప్రభు నిలిపినాడే
ప్రక్కటెముకను పడతి చేసి నీకుతోడుగా పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే (2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2) ||అనుభవానికి||

రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన 
కలికి మాటకు విలువ ఫలముగా కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతిగా మార్చెన (2)
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2) ||అనుభవానికి||

మనిషి మనుగడ విలువ చెరిపి జన్మపాపము నంటగట్టి
ఆరు ఋతువుల కాలచక్రపు పాపభారము తలకుపెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున ముంచినావే(2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2) ||అనుభవానికి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Arunodayamu Yesuni Jananamu | అరుణోదయము యేసుని జననము

అరుణోదయము యేసుని జననము (2)
పరమ జనకుని ప్రవచన సారాము 
మరణపు చాయలో ఉండిన జనము 
చూచిరి జీవాపు వెలుగు కిరణము 
అరుణోదయము యేసుని జననము -
అరుణోదయము

1.పశువుల తొట్టిలో పసి బాలకుడు - సకల సృష్టికి కారణ భూతుడు (2) 
పాపుల పాలిట ప్రేమా మయూడు (1) 
ప్రజలందరికి నిజ రాక్షకుడు (2) ||అరుణో||

2.నరులను దేవుని కొమరుల చేయగా - నరునిగ మారినా దేవా కుమారుడు (2) 
మరణము నరకము గెలిచిన ధీరుడు (1) 
నిరతము తోడుగా ఉండేడి దేవుడు (2) ||అరుణో||

3.లోక పాపమును మోసిన గొరియగ - అరుదెంచెను ప్రభు మొదటి రాకలో (2)
కొదమ సింగమై వచ్చును త్వరలో (1)
తాళగ జాలిన వారెవరు (2) 
ఎదలో ఏసుని కలిగినవారు(1)
నిజముగా క్రీస్తుని ఎరిగిన వారు (2) ||అరుణో||
_____________________________________
Arunodayamu yesuni jananamu
Parama janakuni pravachana saaramu
Maranapu chaayalo undina janamu
Choochiri jeevapu velugu kiranamu
Arunodayamu yesuni jananamu ||Aruno||

Pashuvula thottilo pasi balakudu - Sakala srustiki kaarana bhuthudu (2)
Paapula paalita prema mayudu (1)
Prajalandhariki nija rakshakudu (2) ||Aruno||

Narulanu devuni komarula cheyaga - Naruniga maarina deva kumaarudu (2)
Maranamu narakamu gelichina dheerudu (1)
Nirathamu thoduga undedi devudu (2) ||Aruno||

Loka papamunu mosina goriyaga -  Arudhenchenu prabhu modhati raakalo (2)
Kodhama singamai vachunu twaralo (1)
Thalaga jaalina varevaru (2)
Yedhalo yesuni kaligina vaaru (1)
Nijamuga kreesthuni erigina vaaru(2) ||Aruno||
DOWNLOAD MP3 SONG HERE 👇

08 April 2021

Aanadam amara aanandam | ఆనందం అమర ఆనందం లోకానికే

ఆనందం అమర ఆనందం 
లోకానికే మహాదానందం
ప్రభు యేసు ప్రభవించే ఆనందం
హృదయాల అలరించు ఆనందం ||ఆనందం||

దూతాళి స్తోత్ర గీతాలు పాడ ఆనాడు - 
కోపాలు రక్త రారాజు చూడ ఆవేళ (2)
మహిమతో ప్రభువుగా - మరియకె శిశువుగా
ప్రభు యేసు జన్మించె లోకానా ఆనందమానంద ||ఆనందం||

గగనాన తూర్పు శిఖరాన తారా దీపించే - 
అదిగాంచి జ్ఞానులరుదెంచినారు వేవేగ (2)
ప్రభువుకే ప్రియముగా ప్రణుతులే చేయగా
బంగారు సాంబ్రాణి అర్పింప ఆనందమానంద ||ఆనందం||
DOWNLOAD MP3 SONG HERE 👇

Aananda Geetaalu Ne Paduthu | ఆనందగీతాలు నే పాడుతూ యేసయ్య

ఆనందగీతాలు నేపాడుతూ యేసయ్య సన్నిధి నే చేరన(2) ఎల్లవేళల యందు స్తుతియింతును
హల్లేలూయ పాటలే పాడనా (2) ||ఆనందగీతాలు||

1.నేను నా ఇంటి వారందరూ - యెహోవాను సేవింతుము -
రేయి పగలు కాపాడిన - కన్నతండ్రిని స్తుతియింతుము (2)
వాగ్దానములిచ్చిన దేవుడు - విడువడు నిన్ను ఎడబాయడు (2) 
విడువడు నిన్ను ఎడబాయడు  ||ఆనందగీతాలు||

2.నాదు యేసుని దూతలతో - కలుసుకొందును మేఘాలలో -
కష్టములు నా శ్రమలు - ఆగిపోవును రాకడలో (2)
నా దుఃఖము ఇకఉండదు - ఆనందింతును హల్లెలూయ(2)
ఆనందింతును హల్లెలూయ ||ఆనందగీతాలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

21 March 2021

Evari kosamo ee prana | ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) 
నీ కోసమే నా కోసమే కలువరి పయనం - ఈ కలువరి పయనం (2)

1. ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా 
సోలి వాలి పోయావా ||ఎవరి కోసమో||

2. జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు
వీరిని క్షమించు అని వేడుకొన్నావా..పరమ తండ్రిని || ఎవరి కోసమో ||
DOWNLOAD MP3 SONG HERE 👇

07 March 2021

Siluvalo aa siluvalo aa ghora | సిలువలో ఆ సిలువలో ఆ ఘోర

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో - 
తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా - బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా ||సిలువలో||

1.నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ - మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్లని చీల్చెనే - నీ సుందర దేహమునే (2)
తడిపెనే నీ తనువునే - రుధిరంబు ధారలే (2) ||వెలి||

2.వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె - 
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా ||వెలి||

2.నాదు పాప భారం - నిను సిలువకు గురి చేసెనే -
నాదు దోషమే నిన్ను - అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే - నా రక్షణ ఆధారం (2)
సిలువను చేరెదన్ - విరిగిన హృదయముతోను (2) ||వెలి||
DOWNLOAD MP3 SONG HERE 👇

03 February 2021

Teliyaka vaaru siluva vesaru lyrics | తెలియక వారు సిలువ వేశారు

తెలియక వారు సిలువ వేశారు -
క్షమించమని ప్రార్థించాడు యేసు(2)
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే 
క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు ?
 
తిండికోసము జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు ఏశావు 
వెండి కోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము 
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము 
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే 
క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు ? 
 
పదవికోసము ప్రభువు యేసును అమ్ముకొంటారా ఓటు నోటుకు
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు 
దేవునిపాలన మనిషిపాలనగా మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా మారితే  కూలి కాలి పోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే 
క్షమించేదెవరు ? ప్రార్థించేది ఎవరు ?
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...