Showing posts with label 054 నా యేసూ ఆత్మ సూర్యుఁడా. Show all posts
Showing posts with label 054 నా యేసూ ఆత్మ సూర్యుఁడా. Show all posts

18 August 2021

Naa Yesu Aathma Suryuda | నా యేసూ ఆత్మ సూర్యుఁడా

54   Sun of my soul, Thou Saviour dear

1. నా యేసూ, ఆత్మ సూర్యుఁడా - నీవున్న రాత్రి కమ్మదు 
నా యాత్మలో నీ విప్పుడు - వసించి పాయకుండుమీ

2. నేను నిద్రించు వేళలో - నాకు నభయ మియ్యుము
నే లేచి పనిచేయఁగా - యొద్ద నుండు రక్షకా

3. నాతోడ రాత్రింబగళ్లు - నీ వుండి నడిపించుము
 నీవు నాతో లేకుండిన్ - జీవింపఁ జావజాలను.

4. నేఁడు నీ దివ్య వాక్యము - వినిన పాపు లెల్లరిన్
 క్షమించి గుణపఱచి - నీ మందలోకిఁ జేర్చుము.

5. రోగిని స్వస్థపఱచి - బీదలను పోషించుమా
 దుఃఖించువారి దుఃఖముఁ - బాపి యానంద మియ్యుము.
                                       - జాన్ కెబిల్ 
                            అను: జేకబ్ చేంబర్లేన్.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...