Showing posts with label 250 పరిశుద్ధాత్మునిఁ బొందుము. Show all posts
Showing posts with label 250 పరిశుద్ధాత్మునిఁ బొందుము. Show all posts

30 May 2026

పరిశుద్ధాత్మునిఁ బొందుము Parishudhathmuni bondhumu

250
పరిశుద్ధాత్మునిఁ బొందుడి 
(ఛాయ: పరిశుద్ధాత్ముని గోరుము జీవమా)
రా - కళ్యాణి, తా - అట 

పరిశుద్ధాత్మునిఁ బొందుము - ప్రభువిచ్చెడు - వరసహాయునిఁ బొం దుము = పరిశుద్ధవర్తనకు - పరమసాహాయ్యంబుఁ - పరముఁజేరువఱకు - పరి పూర్తిగా దొరకు ||పరి||

1.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - మన రక్షణ - పరిపూర్ణమై యుండును = పరమ రక్షకుఁడిచ్చు = పరిపూర్ణ రక్షణను - పరమానందముతోడఁ - పరగఁగైకొను మిపుడే ||పరి||

2.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - బైబిలువాక్య - పరమసారము తేటగుఁన్ = పర మండలపుఁ తండ్రి - పరిశుద్ధచిత్తంబు - పొరపాటులేకుండ - విరివిరిగాఁ దెలియును ||పరి||

3.పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ - బ్రార్థనలందుఁ - పరమ పాటవ మబ్బును = సరిగాఁ బ్రార్థించెడు - సరణియుఁ దెలియును - వరములను బొందుటకు - తెరువులభియించును ||పరి||

4.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - శోధనములఁ-పరమ విజయము గల్గును = దురితంపు శోధనలఁ - దొలగింప నా ప్రభువు - పరమశక్తినొసంగి - కరుణతో జయమిచ్చు ||పరి||

5.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - జీవితమెల్లఁ-పరిశుద్ధముగ నుండును = పరిశుద్ధ జీవితము - కరము సాధ్యంబగును - పరిశుద్ధాత్ముని శక్తిన్ - వర్తింపఁగలమట్లు ||పరి||
- మండపాక కేశవరాయ శర్మ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...