Showing posts with label నా. Show all posts
Showing posts with label నా. Show all posts

17 May 2026

నడ్పుమీ, మహా యెహోవా Nadpumi maha yehova

429
Guide me, O Thou Great Jehovah

1.నడ్పుమీ, మహా యెహోవా 
లోక యాత్ర యందున 
నీదు శక్తి నాకు దిక్కు 
నన్ రక్షింపఁ జేఁపట్టు 
దివ్య మన్నా, దివ్య మన్నా 
నా కాహారమై యుండు.

2.ఊటగా స్వచ్ఛజలంబు 
బండనుండి పారనీ 
అగ్ని మేఘ స్తంభాలచే 
నడవిన్ నన్ దాఁటించుఁ 
గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ 
నాకు డాలవు సదా.

3.యొర్దాన్ నది దాఁటు వేళ 
భీతు లెల్లఁ బాపుము 
మృత్యు శ్రమ లన్ని నన్ను 
క్షేమ కానాన్ జేర్చును 
స్తుతి గీతి, స్తుతి గీతి 
నీ కర్పింతు నిత్యము
- విలియం విలియమ్స్ 
అను: హెచ్ హెన్రీ డేవిస్ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...