Showing posts with label Ninnu Nenu Viduvanu Deva lyrics. Show all posts
Showing posts with label Ninnu Nenu Viduvanu Deva lyrics. Show all posts

26 May 2021

Ninnu Nenu Viduvanu Deva | నిన్ను నేను విడువను దేవ

381  
నీవు నన్ను ఆశీర్వదింపని యెడల నిన్ను వెళ్ళనీయను
రా – తోడి, తా – రూపకము

నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వరకు = నిన్ను నమ్మిన వారల నెల్ల - నీవు చక్కగ దీవిం చెదవు ||నిన్ను||

1.నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెనరు జూపి = దాన మిచ్చితివి నా కొర కు - దారుడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను॥

2.త్రోవ దప్పి తిరుగుచుండ - దుడుకు నైన నన్ను గాంచి = ప్రోవ గోరి మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను॥

3.నాటనుండి నేటి వరకు - నాకుఁ గల్గిన శోధనములలో = నేటుగా నను గాచిన వాడవు - నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను॥

4.ఇంత కాలము నన్నుగాచి - యికను నన్ను విడువ వనుచు = సంత సించి మదిని నేను - జక్కగ నీ దరి జేరితిని ||నిన్ను||

5.నీవు గాక యెవ రున్నారు - నేల పైని నను గాపాడ = చేవ లేని నాకు నీవు - చేవ గలుగ జేయ గలవు ||నిన్ను||

6.అడుగు వారి కిచ్చెద నంచు - నాన తిచ్చినాను గాన = నడిగెద నిను సాహాయ్యంబు - నాత్మవై యున్నట్టి తండ్రి ||నిన్ను||

7.నాదు ప్రార్థన లన్నియు నీవు - నీదు కృపచే నాలకించి = నీదు సరణిని నిల్పి నన్ను - నేర్పు దనరగ రక్షించితివి ||నిన్ను||
                             - పులిపాక జగన్నాధం
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...