Showing posts with label 320 యేసు విభునిఁ దలఁచి. Show all posts
Showing posts with label 320 యేసు విభునిఁ దలఁచి. Show all posts

27 August 2023

Yesu vibhuni dalachi యేసు విభునిఁ దలఁచి

320
పశ్చాత్తాప ప్రేరేపణ 
రా - బిళహరి, తా - త్రిపుట
(చాయ: భికరుండౌ)

యేసు విభునిఁ దలఁచి మదిలో - ద్వేషము లణఁగింపరే = మోస విశ్వ భ్రాంతు లెల్ల - రోసి పరిహర్షింపరే ||యేసు||

1.కామ క్రోధ లోభ మోహ - క్షామ గుణములు మానరే = హేమ రీతిని దేవ కృపలో - క్షేమ మున్నది కానరే ||యేసు||

2.సత్యవేద సార మెల్ల - నిత్యము రుచిచూడరే = సత్త లేని దురిత జాలి - బొత్తిగా విడ దీయరే ||యేసు||

3.కర్త కర్తయనుచు వేఁడి - వ్యర్ధులై చెడి పోకరే = స్వార్ధ చర్య లెల్ల మాని - కర్త యేసుని బోలరే ||యేసు||

4.బంధు మిత్రు - శత్రు నెనరు - నిందుఁ జూపఁ బూనరే = యందమైన మోక్ష విభవము - లందుఁ గని హర్పింపరే ||యేసు||

5.మోక్ష వైభవ మెదలోఁ దలఁచి - మోసమున బడిపోదురే - కక్షి సాతాన్ ముచ్చు వలలను - హెచ్చుగాఁ దెగఁగొట్టరే ||యేసు||

6.సద్దులేకను దేవ సేవ - ముద్దుతో ఁ గొని యాడరే =  హద్దు మీరు విమత సాతాన్ - సుద్దులను ద్యజియింపరే ||యేసు||

8.బాధ చేసెడి గురుల వీడుచు - బొధకుల దరిఁ జేరరే = నాధు క్రీస్తును నమ్మి మీరలు - సాధులై వర్తింపరే ||యేసు||
- డేవిడ్ లైటన్


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...