Showing posts with label Madhura madhura madhura seva lyrics. Show all posts
Showing posts with label Madhura madhura madhura seva lyrics. Show all posts

12 July 2020

Madhura madhura madhura seva | మధుర మధుర మధుర సేవ

698
రా - తిలక్కామోదు,   తా - ఆది

మధుర మధుర మధుర సేవ - యేసుప్రభు సేవ
   
1.దేవ దూతలకును లేని దైవజనుని సేవ - దేవ సుతుని సంఘ సేవ దివ్యమౌసువార్త సేవ॥మధుర||

2.పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవ - పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్యసేవ ||మధుర||

3.ప్రభుని పేరప్రజల యెదుట ప్రవచనాల సేవ - ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్థనలువచించు సేవ ||మధుర||

4.భాగ్యభోగనిధులు లేని భారభరిత సేవ - బాష్ప సిరులలోన మెలగి బాధలను వరించుసేవ ||మధుర||

5.సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ - సిలువ నిందనలు భరింప శిరము వంచి మురియు సేవ ||మధుర||

6.లోకజ్ఞాని యపహశించు వోకమూర్తి సేవ - లోకులను దీవించుసేవ లోకమును జయించుసేవ॥మధుర||

7.దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి - దైవనీతి వదలకోయి దేవుడు దీవించునోయి ॥మధుర||
                             - ఏ.బి. మాసిలామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...